
ఎక్కడ పడితే అక్కడే..
ఇల్లెందు: ఇల్లెందులో డంపింగ్ యార్డు ఉన్నా సేకరించిన చెత్త అక్కడికి చేరడం లేదు. ఎక్కడ పడితే అక్కడ రోడ్డు వెంట పడేస్తుండగా వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. పట్టణం నుంచి నిత్యం 8 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుండగా కొంత డంప్ యార్డుకు చేరుతున్నా.. అధికారుల పర్యవేక్షణ లోపంతో కొందరు డ్రైవర్లు రోడ్డుపైనే పడేస్తున్నారు. ఇక యార్డుకు చేరిన చెత్తను సైతం రీసైక్లింగ్ చేయడం లేదు. తడి చెత్తతో ఎరువు తయారు చేయాల్సి ఉండగా ఈ ప్రక్రియ కూడా అడుగంటింది. వార్డులకు రెండు, మూడురోజు లకోసారి చెత్త వాహనం వస్తోంది. దీంతో ఇళ్లల్లో చెత్త నిల్వలు పెరిగి దోమలు, ఈగలు వృద్ధి చెందుతున్నాయని పట్టణ వాసులు అంటున్నారు.
రోడ్డు పక్కన వేస్తున్నారు
డంప్ యార్డుకు వెళ్లే దారిలో రోడ్డు పక్కనే చెత్త పడేస్తుండగా పక్క చేల్లోకి వస్తోంది. చెత్త నుంచి దుర్వాసన వస్తోంది. అన్ని రకాల మలినాలు, కోళ్లు, జంతువుల కళేబరాలు వదిలి వేస్తుండడంతో రోడ్డు వెంట ప్రయాణం చేయటం, సమీప రైతులు చేలలో పనులు చేసుకోవడం ఇబ్బందిగా మారింది.
– హరిప్రసాద్ యాదవ్, ఇల్లెందు
●

ఎక్కడ పడితే అక్కడే..