
వాతావరణ ం
జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆకాశంలో దట్టమైన మేఘాలు అలుముకునే అవకాశం ఉంది.
తాలిపేరుకు వరద ఉధృతి
రెండు గేట్లు ఎత్తి రెండు వేల క్యూసెక్కులు దిగువకు విడుదల
చర్ల: తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్ట్‌కు వరద ఉధృతి పెరుగుతోంది. ఎగువ ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తుండటంతో రెండు రోజుల నుంచి ప్రాజెక్ట్‌లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. శనివారం ప్రాజెక్ట్ 25 గేట్లలో రెండు గేట్లను 2 అడుగుల మేర ఎత్తి ఉంచి 2,105 క్యూసెక్కుల చొప్పున వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 74 మీటర్లు కాగా ఎగువ నుంచి వస్తున్న వరద నీటిని దృష్టిలో ఉంచుకుని నీటిమట్టాన్ని 71.74 మీటర్లుగా క్రమబద్ధీకరిస్తున్నారు. పంట పొలాలకు సాగునీటిని విడుదల చేసేందుకు సరిపడా నీరు ప్రాజెక్ట్‌లో ఉందని డీఈ తిరుపతి తెలిపారు.