‘ఉద్యానం’ సతమతం! | - | Sakshi
Sakshi News home page

‘ఉద్యానం’ సతమతం!

Jul 6 2025 6:52 AM | Updated on Jul 6 2025 6:52 AM

‘ఉద్య

‘ఉద్యానం’ సతమతం!

● జిల్లా ఉద్యాన శాఖలో ఖాళీ పోస్టులు ● ఉన్న అధికారులపై పెరుగుతున్న పనిభారం ● కనీసం కార్యాలయాలు కూడా లేని దుస్థితి

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): జిల్లా ఉద్యాన శాఖలో సిబ్బంది కొరత వేధిస్తోంది. కలెక్టరేట్‌లోని ఉద్యాన శాఖ కార్యాలయం తప్ప జిల్లాలో మరెక్కడా ఉద్యానశాఖకు కనీసం కార్యాలయాలు లేవు. దీంతో అధికారులు రైతు వేదికల నుంచే కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. గతంలో జిల్లా ఉద్యాన శాఖాధికారిగా పనిచేసిన అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయాడు. కొంతకాలం తర్వాత ఆ స్థానంలో జంగా కిషోర్‌ను ఇన్‌చార్జ్‌గా నియమించారు. ప్రస్తుతం జిల్లా ఆయిల్‌పామ్‌ సాగులో రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉంది. మరో వైపు కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ చొరవతో కొందరు రైతులు లాభదాయకమైన మునగసాగుపై దృష్టి సారిస్తున్నారు. సంప్రదాయ పంటలకు ప్రత్యామ్నాయంగా పండ్లు, కూరగాయల సాగు చేపడితే ఆదాయం పెరుగుతుందని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. కానీ వీటిపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించే ఉద్యాన శాఖాధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

జిల్లాలో ఆరుగురు హార్టికల్చర్‌ ఆఫీసర్లు

జిల్లా కేంద్రంలోని ఉద్యాన శాఖ కార్యాలయంలో టెక్నికల్‌ హార్టికల్చర్‌ ఆఫీసర్‌ ఒకరు ఉండగా, అశ్వారావుపేట, అశ్వాపురం, దమ్మపేట, ఇల్లెందు, పాల్వంచ కేంద్రాల్లో మరో ఐదుగురు హార్టికల్చర్‌ అధికారులు విధులు నిర్వర్తిస్తున్నారు. అశ్వారావుపేట హార్టికల్చర్‌ ఆఫీసర్‌ పరిధిలో ములకలపల్లి, భద్రాచలం, బూర్గంపాడు మండలాలు, దమ్మపేట ఆఫీసర్‌ పరిధిలో అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ, అశ్వాపురం ఆఫీసర్‌ పరిధిలో పినపాక, చర్ల, దుమ్ముగూడెం, కరకగూడెం, మణుగూరు, ఇల్లెందు ఆఫీసర్‌ పరిధిలో ఆళ్లపల్లి, గుండాల, టేకులపల్లి, పాల్వంచ ఆఫీసర్‌ పరిధిలో జూలూరుపాడు, సుజాతనగర్‌, కొత్తగూడెం, చుంచుపల్లి మండలాలు ఉన్నాయి.

రైతు వేదికలే కార్యాలయాలు

హార్టికల్చర్‌ ఆఫీసర్లకు ఎక్కడా కార్యాలయాలు లేవు. జిల్లాలో వ్యవసాయశాఖకు అనుబంధంగా 67 రైతువేదికలు ఉన్నాయి. వీటి నుంచే అధికారులు శాఖాపరమైన కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. వ్యవసాయశాఖ కార్యకలాపాలు ఉన్నపుడు ఉద్యానశాఖకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. శాఖాపరమైన విధులతోపాటు ఇతర ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు, ఎన్నికల విధులు, సర్వే వంటి పనులు, వరద సహాయక కార్యక్రమాలు తదితర బాధ్యతలు కూడా కేటాయిస్తుండటంతో ఉద్యాన అధికారులు పనిభారంతో సతమతమవుతున్ననారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని పలువురు కోరుతున్నారు.

ఉన్నతాధికారుల

దృష్టికి తీసుకెళ్లాం..

ఉద్యాన శాఖలో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని ఉన్నతాధికారులకు నివేదించాం. ఉన్న అధికారులతోనే రైతులకు అవసరమైన సేవలు అందిస్తున్నాం. ఉద్యాన శాఖ నుంచి వివిధ పంటలకు ఇస్తున్న రాయితీలపై అవగాహన కల్పిస్తున్నాం.

– జంగా కిషోర్‌, జిల్లా ఉద్యాన,

పట్టుపరిశ్రమ శాఖాధికారి

ఎక్స్‌టెన్షన్‌ అధికారులే లేరు

ప్రతీ హార్టికల్చర్‌ ఆఫీసర్‌కు ఇద్దరు ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్లు సహాయకులుగా ఉండాలి. జిల్లాలో 12 మంది టెక్నికల్‌ ఆఫీసర్లను ఉండాల్సి ఉండగా, అన్ని పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. దీంతో ఉన్న అధికారులపైనే పనిభారం పడుతోంది. జిల్లాలో 2019 వరకు ఎనిమిది మంది ఎక్సటెన్షన్‌ ఆఫీసర్లు విధులను నిర్వహించారు. వారు ఇతర ప్రాంతాలకు బదిలీ కావడంతో అప్పటి నుంచి ఆ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

‘ఉద్యానం’ సతమతం!1
1/1

‘ఉద్యానం’ సతమతం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement