
పోలీసుల సేవలు వినియోగించుకోండి
కొత్తగూడెంటౌన్: ప్రతీ పౌరుడు పోలీసుల సేవలను ఉపయోగించుకోవాలని ఎస్పీ రోహిత్‌రాజు అన్నారు. సోమవారం తన కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేలో జిల్లా వ్యాప్తంగా వచ్చిన పలువురు తమ సమస్యలు ఎస్పీకి వివరించారు. ఆయా సమస్యలు త్వరగా పరిష్కరించాలని ఎస్పీ ఆయా స్టేషన్ల అధికారులను ఆదేశించారు. పోలీసు స్టేషన్ల వారీగా నమోదైన కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. సమస్యలు ఉన్నవారు మధ్యవర్తులను సంప్రదించకుండా నేరుగా సమీప పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తెలియజేయాలని సూచించారు. జిల్లాలో శాంతిభద్రతలను పరిరక్షించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని చెప్పారు.
ఉద్యోగ విరమణ పొందిన వారికి సన్మానం
జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్లలో విధులు నిర్వహిస్తూ ఉద్యోగ విరమణ పొందిన ముగ్గురిని ఎస్పీ రోహిత్‌రాజు సన్మానించారు. ఏడూళ్ల బయ్యారం పీఎస్ ఎస్సై మహమ్మద్ షఫీ, భద్రాచలం ట్రాఫిక్ పీఎస్ ఎస్సై సత్యనారాయణ, ఆశ్వాపురం పీఎస్ హెడ్ కానిస్టేబుల్ చిన్న వెంకటేశ్వర్లును ఘనంగా సత్కరించారు.
గ్రీవెన్స్‌లో ఎస్పీ రోహిత్‌రాజు