
రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామివారికి శనివారం సువర్ణ తులసీ అర్చన నిర్వహించారు. స్వామివారిని బేడా మండపంలో కొలువుదీర్చి నిత్యకల్యాణం శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు.
శాశ్వత నిత్యాన్నదానానికి విరాళం
శాశ్వత నిత్యాన్నదాన కార్యక్రమానికి ఏపీలోని కాకినాడకు చెందిన భక్తురాలు సత్య అనురాధ రూ.లక్ష చెక్కును ఆలయ అధికారులకు అందజేశారు. దాత కుటుంబ సభ్యులతో కలిసి స్వా మివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించగా, ఆలయ అధికారులు స్వామి వారి ప్రసాదంతోపాటు జ్ఞాపికను అందజేశారు.
పెండింగ్ కేసులను పరిష్కరించాలి
అశ్వాపురం: పెండింగ్‌లో కేసులను సత్వరమే పరిష్కరించాలని ఎస్పీ రోహిత్‌రాజు పోలీస్ అధికారులు, సిబ్బందికి సూచించారు. అశ్వాపు రం పోలీస్‌స్టేషన్‌ను శనివారం ఆయన సందర్శించారు. స్టేషన్ పరిసరాలు, గదులను పరిశీ లించి రికార్డులు తనిఖీ చేశారు. కేసుల వివరా లు తెలుసుకుని పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పెట్రోలింగ్, బ్లూ కోల్ట్స్ వాహనాలతో సంచరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. డీఎస్పీ రవీందర్‌రెడ్డి, సీఐ అశోక్‌రెడ్డి పాల్గొన్నారు.
ఆయిల్ రికవరీని కాపాడాలి
అశ్వారావుపేట/దమ్మపేట: ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీలో ఆయిల్ రికవరీని కాపాడాలని తెలంగాణ ఆయిల్‌ఫెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రశాంత్ కుమార్ సూచించారు. శనివారం అశ్వారావుపేట, దమ్మపేట మండలం అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలను నారంవారిగూడెంలోని ఆయిల్‌పామ్ నర్సరీని ఆయన సందర్శించారు. ఫ్యాక్టరీలో జరుగుతున్న పనులు, గెలల క్రషింగ్ సామర్థ్యంపై అధికారులతో చర్చించారు. అనంతరం మాట్లాడుతూ ఆయిల్ రికవరీ శాతం తగ్గకుండా ఉండేందుకు గెలల దిగుమతి నుంచి క్రూడాయిల్ సేకరణ వరకు అన్ని అంశాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పక్వానికి రాని గెలలను తీసుకురావొద్దని రైతులను సూచించాలన్నారు. ప్లాంట్ల మేనేజర్లు ఎం.నాగబాబు, సత్యనారాయణ, అధికారులు పవన్, కళ్యాణ్, వెంకటేష్, కార్తీక్, రాజేష్, శివ,రాధాకృష్ణ ఉన్నారు.

రామయ్యకు సువర్ణ తులసీ అర్చన

రామయ్యకు సువర్ణ తులసీ అర్చన