
బాపట్ల
ఆదివారం శ్రీ 6 శ్రీ జూలై శ్రీ 2025
లోక్ అదాలత్‌లో 5,300 పైగా కేసులు పరిష్కారం
ఒంగోలు: జాతీయ లోక్ అదాలత్‌లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అన్ని కోర్టుల్లో 5300కు పైగా కేసులు పరిష్కారమయ్యాయని జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ. భారతి పేర్కొన్నారు. జిల్లాలో శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో మొత్తం 27 బెంచీల ద్వారా పరిష్కారమైన కేసుల వివరాలను ఒక ప్రకటనలో వెల్లడించారు. 5200కు పైగా క్రిమినల్ కేసులు, 155 సివిల్ దావాలతో పాటు 17 ప్రీలిటిగేషన్ కేసులు పరిష్కరించారు. మోటార్ వాహన ప్రమాద బీమా తదితర కేసుల్లో రూ.8 కోట్లకు పైగా కక్షిదారులకు పరిష్కార చెల్లింపులు చేసినట్లు పేర్కొన్నారు. ప్రతి బెంచీలో న్యాయమూర్తితో పాటు న్యాయవాదులు సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారన్నారు. న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారం కోసం సహకరించిన న్యాయవాదులకు, పోలీసులకు, వివిధ ప్రభుత్వ శాఖల ప్రతినిధులకు, బ్యాంకు అధికారులకు, బీమా సంస్థల ప్రతినిధులకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అభినందనలు తెలిపారు. జాతీయ లోక్ అదాలత్‌ను జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి షేక్ ఇబ్రహీం షరీఫ్ తదితరులు నిరంతరం పర్యవేక్షించారు.
ఎయిమ్స్‌లో 13 మంది విద్యార్థుల సస్పెన్షన్
మంగళగిరి: ఎయిమ్స్‌లో మెడికల్ విద్యార్థులపై చర్యలు తీసుకున్నట్లు అధికార ప్రతినిధి వంశీకృష్ణారెడ్డి శనివారం తెలిపారు. ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థులపై సస్పెన్షన్ వేటు వేశామని పేర్కొన్నారు. ఏడాదిన్నరపాటు 13 మంది విద్యార్థులపై ఈ సస్పెన్షన్ విధించామని వివరించారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
సాక్షి ప్రతినిధి,బాపట్ల: డ్వామాలో అక్రమ వసూళ్ల బాగోతం ఇప్పడు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. నిత్యం కోట్లాది రూపాయల పనులు జరుగుతున్న డ్వామాలో వసూళ్ల పర్వం పతాక స్థాయికి చేరింది. ఆ విభాగం ఉన్నతాధికారి కిందిస్థాయి ఉద్యోగుల నుంచి పెద్దఎత్తున డబ్బులు వసూళ్లు చేస్తున్నట్లు ఆ శాఖ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ప్రతి మండలం నుంచి రూ.25 వేలకు తగ్గకుండా ముడుపులు ఇవ్వాలని షరతు విధించారు. ఇది కాకుండా ప్రతి సోషల్ ఆడిట్‌కు రూ.లక్ష వసూలు చేస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 20 సోషల్ ఆడిట్‌లు జరగ్గా రూ.20 లక్షలు వసూలు చేసినట్లు కిందిస్థాయి అధికార వర్గాల సమాచారం. తాజాగా ఈ నెల 8వ తేదీన చీరాల సోషల్ ఆడిట్ ఉండగా రూ.లక్ష సిద్ధం చేసుకోవాలని ఇప్పటికే సంబంధిత అధికారిని ఆదేశించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. లక్షలో రూ.50 వేలు జిల్లా ఉన్నతాధికారి పేరు చెప్పి డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి జరిగిన పనులను షాట్ డైరెక్టర్ కార్యాలయం సోషల్ ఆడిట్ చేస్తుంది. అక్కడి నుంచి నలుగురు డీఆర్‌పీలతోపాటు ఒక ఎస్‌ఆర్‌పీ సోషల్ ఆడిట్‌లో పాల్గొంటారు. డీఆర్‌పీలు గ్రామాల్లో జరిగిన పనులను పూర్తిగా తనిఖీ చేసి ఆ తర్వాత డ్వామా పీడీతో కలిసి తనిఖీలు చేస్తారు. తనిఖీ అధికారులు అక్రమాలు ఎత్తి చూపితే మీరు కక్షతో కంప్లెయింట్ రాశారని చెప్పి డ్వామా అధికారి తన వద్ద పనిచేసే ఏపీడీని విచారణకు ఆదేశిస్తారు. దీంతో జరిగిన అక్రమాలు కనుమరుగవుతాయి. ఇందుకోసం డ్వామా అధికారి ప్రతి సోషల్ ఆడిట్‌కు రూ.లక్ష వసూలు చేస్తున్నారు. ఇబ్బంది రాకూడదన్న ఉద్దేశంతో ఏపీవోలు జిల్లా అధికారి అడిగిన మొత్తం చెల్లించాల్సి వస్తోంది. అయితే పనుల్లో అక్రమాలకు పాల్పడినవారే కాక అక్రమాలు చేయని అధికారులు సైతం కామన్‌గా డ్వామా అధికారికి డబ్బులు చెల్లించాల్సి రావడం ఇబ్బందిగా మారింది.
ఉన్నతాధికారి పేరు చెప్పి వసూళ్లు
ఇదికాకుండా జిల్లా ఉన్నతాధికారి పేరుచెప్పి ప్రతి మండలం నుంచి రూ.20 వేలు ఇవ్వాలని ఇటీవల డ్వామా అధికారి హుకుం జారీ చేశారు. ఇక ఆ అధికారి బయట అడుగు పెడితే చాలు ఏ మండలానికి వెళ్లినా వాహనం డీజల్, ఇతర ఖర్చుల పేరున ఏపీవోలు రూ.10 వేలు చెల్లించాల్సిందేనట. ఏ అధికారైనా రూ.10 వేల చెల్లించకపోతే గూగుల్ మీట్‌లో సదరు అధికారికి తిట్ల దండకం తప్పదని పలువురు ఏపీవోలు సాక్షికి తెలిపారు.
వసూళ్లు ఇలా...
● సీసీ రోడ్ల నిర్మాణంతోపాటు ఇతర పనులకు సంబంధించి అక్రమాలు జరిగాయని సోషల్ ఆడిట్‌లో తేలడంతో నగరం మండలంలో కొందరు అధికారులను జిల్లా అధికారి సస్పెండ్ చేశారు. వారిని తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు పెద్దఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
● కొల్లూరు మడంలంలో ఆయిల్‌ఫాం సాగుకు సంబంధించి ఉపాధి కూలీల మంజూరు విషయంలో ఫైల్ శాంక్షన్ కోసం అక్కడి అధికారులపై ఒత్తిడి తెచ్చి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి.
● యద్దనపూడి మండలంలో రూ.13 లక్షల విలువచేసే రోడ్డు నిర్మాణం కోసం స్థానిక నేత నుంచి రూ. 2.50 లక్షలు వసూలు చేయగా సదరు రోడ్డు నిర్మాణానికి పర్చూరు ఎమ్మెల్యే ఆమోదం లేదంటూ జిల్లా కలెక్టర్ సదరు పనిని నిలిపి వేయడంతో చివరకు డ్వామా అధికారి తీసుకున్న డబ్బులు వెనక్కి తిరిగి చెల్లించినట్లు తెలుస్తోంది.
● బాపట్లకు ప్రాంతానికి చెందిన ఒక టెక్నికల్ అసిస్టెంట్ యద్దనపూడి బదిలీ కోసం విన్నవించుకోగా జిల్లా అధికారి డబ్బుల కోసం డిమాండ్ చేసినట్లు సమాచారం. దీంతో ఆ వ్యక్తి 50 కిలోల అలసందలు తీసుకువచ్చి ఇవ్వగా వాటితోపాటు మరో రూ.50 వేలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేయడంతో టెక్నికల్ అసిస్టెంట్ అంత ఇచ్చుకోలేనని చెప్పినా అధికారి ససేమిరా అనడంతో చివరకు రూ.40 వేలు చెల్లించినట్లు సమాచారం.
7
న్యూస్‌రీల్
జిల్లా అధికారి బరితెగింపు సోషల్ ఆడిట్ కోసం రూ.లక్ష ఇప్పటి వరకూ 20 సోషల్ ఆడిట్లు పనుల మంజూరుకు లక్షల్లో డబ్బులు బదిలీలకు భారీగా ముడుపులు అధికారుల రీ పోస్టింగులకూ పెద్ద మొత్తంలో డిమాండ్ స్పందించకపోతే డిప్యూటీ సీఎం తాలూకా అంటూ బెదిరింపులు జిల్లా ఉన్నతాధికారి పేరుచెప్పి ప్రత్యేక వసూళ్లు ఆందోళన బాటలో కిందిస్థాయి అధికారులు, సిబ్బంది
స్పందించకుంటే బెదిరింపులు
ఉపాధి హామీ పథకంలో కోట్లాది రూపాయల పనులు జరుగుతుండడంతో అంతే స్థాయిలో డ్వామా అధికారి పెద్దఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. అధికారులు డబ్బులు చెల్లించే విషయంలో ఏ మాత్రం ఆలస్యం చేసినా సరిగ్గా స్పందించక పోయినా తాను డిప్యూటీ సీఎం తాలూకా అని, ఆయన ఓఎస్‌డీ తన బ్యాచ్‌మేట్ అంటూ డ్వామా అధికారి బెదిరింపులకు దిగుతున్నట్లు అధికారులు. సిబ్బంధి వాపోతున్నారు. సదరు అధికారి వేదింపులు భరించలేక కిందిస్థాయి అధికారులు, సిబ్బంది త్వరలో జిల్లా కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేసేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం.

బాపట్ల

బాపట్ల

బాపట్ల

బాపట్ల

బాపట్ల

బాపట్ల

బాపట్ల