
భరద్వాజ రచనలు సందేశాత్మకం
చీరాల: సమాజంలోని ఆకలి, ఆవేదన, కష్టాలు, కన్నీళ్లు, దోపిడీ వంటి కథాంశాలను వస్తువులుగా స్వీకరించి సమకాలిన సామాజిక సందేశాలుగా రావూరి భరద్వాజ రచనలు చేశారని రచయిత బీ రం సుందరరావు అన్నారు. ఆదివారం స్థానిక సీనియర్ సిటిజన్స్ కార్యాలయంలో రావూరి భరద్వాజ సాహితి సమితి ఆధ్వర్యంలో ప్రముఖ రచయిత, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత రావూరి భరద్వాజ జయంతిని నిర్వహించారు. సంస్థ అధ్యక్షుడు ఎ.నాగవీరభద్రాచారి అధ్యక్షత వహించారు. భరద్వాజ రచనలు జీవితానికి ఎంతో ఉపయోగపడతాయని, వారు సృష్టించిన పాత్రలు సజీవాలని రిటైర్డు ప్రిన్సిపాల్ బత్తుల బ్రహ్మారెడ్డి అన్నారు. అనంతరం బీరం సుందరరావుకు రావూరి భరద్వాజ సాహితీ పురస్కారాన్ని అందించారు. కార్యక్రమంలో కడలి జగదీష్‌కుమార్, గొర్రెపాటి ప్రభాకర్, కట్టా రాజ్ వినయ్‌కుమార్, గాదె హరిహరరావు, అత్తులూరి రామారావు, వడలి రాధాకృష్ణ, నాగమాంబ, కోట వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.