
రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై విజయవాడ ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్‌పీ) కేసు నమోదు చేశారు. బుధవారం ఉదయం కృష్ణా కెనల్ రైల్వే బ్రిడ్జి వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది ఉండటాన్ని గుర్తించిన సిబ్బంది జీఆర్‌పీ స్టేషన్‌కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. మృతుడి వయస్సు సుమారు 55–60 సంవత్సరాల మధ్య ఉంటుందని, ఆచూకీ తెలిపే ఆధారాలు ఏవీ లభ్యం కాలేదని తెలిపారు. వంటిపై గాయాలను బట్టి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుని ఆచూకీ తెలిసిన వారు విజయవాడ జీఆర్‌పీ పోలీసులకు సమాచారం అందించాల్సిందిగా కోరారు.