
18 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత
తాడికొండ: అక్రమంగా నిల్వ చేసిన 18 బస్తాల రేషన్ బియ్యాన్ని సివిల్ సప్‌లైస్ అధికారులు పట్టుకున్న ఘటన మండల కేంద్రమైన తాడికొండలో జరిగింది. వివరాల ప్రకారం తాడికొండ చెరువు కట్టపై రేషన్ బియ్యం నిల్వ చేసినట్లు వచ్చిన సమాచారం మేరకు సీఎస్ డీటీ దేవరాజు, ఆర్‌ఐ హనుమంతరావుల ఆధ్వర్యంలో మంగళవారం దాడులు నిర్వహించగా 35 కిలోల తూకం కలిగిన 18 బస్తాల రేషన్ బియ్యం పట్టుబడింది. దీనిపై విచారించగా తాడికొండకు చెందిన గుర్రపుశాల ఆనంద్ అనే వ్యక్తి కొనుగోలు చేసి నిల్వ చేసినట్లు స్థానికులు తెలపగా అతనిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ దాడులలో వీఆర్వో మాల్యాద్రి కూడా పాల్గొన్నారు.