నిజాంపట్నం: నాటుసారా తాగి జీవితాన్ని అంధకారం చేసుకోవద్దని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఒంగోలు డిప్యూటీ కమిషనర్ కె.హేమంత నాగరాజు అన్నారు. నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా మండలంలోని దిండి పంచాయతీ అదవల గ్రామ ప్రాథమిక పాఠశాల ఆవరణంలో శుక్రవారం అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. నాటుసారాకు ఉపయోగించే ముడి సరకులను విక్రయించినా నేరమేనని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఫిర్యాదులు ఉంటే 94904 55599, 94409 02477 నంబర్లకుగానీ, 14405 టోల్‌ఫ్రీ నంబరుకుగానీ సమాచారం అందించాలని సూచించారు. తొలుత నవోదయం 2.0 పోస్టర్‌లను విడుదల చేశారు. కార్యక్రమంలో ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ జిల్లా సూపరింటెండెంట్ బి.వెంకటేశ్వర్లు, ఒంగోలు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇన్‌స్పెక్టర్ రామారావు, నగరం సీఐ ఎం.శ్రీరామ్‌ప్రసాద్, గ్రామస్తులు పాల్గొన్నారు.