
దుకాణంలో తనిఖీలు నిర్వహిస్తున్న ఎస్పీ
అనుమతులు లేకుండా దుకాణాలు
నిర్వహిస్తే చర్యలు
చెరుకుపల్లి: అనుమతులు లేకుండా ఎరువులు, పురుగుమందులు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు ఎదుర్కొనక తప్పదని రీజనల్ విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీ కే.ఈశ్వరరావు అన్నారు. మండలంలోని మెట్టగౌడపాలెం గ్రామంలో పలు ఎరువుల దుకాణాలలో విజిలెన్స్ అధికారులు సోమవారం ఆకస్మిక దాడులు నిర్వహించి మాట్లాడారు. దుకాణాలలో ప్రభుత్వం నుంచి లైసెన్స్‌లు పొందిన వారు మాత్రమే ఎరువుల దుకాణాలు నిర్వహించాలన్నారు. ఎరువుల దుకాణాలలో నిర్వహించే లావాదేవీలను రికార్డులలో పొందుపరచాలని, కొనుగోలు చేసే రైతులకు తప్పనిసరిగా రశీదులు అందజేయాలని చెప్పారు. నాణ్యతా ప్రమాణాలతో కూడిన విత్తనాలు, ఎరువులను మాత్రమే విక్రయించాలన్నారు. గ్రామంలో తనిఖీలు నిర్వహించగా ఎనుముల నాగరాజు అనే వ్యక్తి ఎటువంటి లైసెన్స్‌లు లేకుండా ఎరువులు దుకాణం నడుపుతున్నట్లు గుర్తించామన్నారు. నాగరాజుపై కేసులు నమోదు చేయటం జరిగిందని రూ.1,26,536 విలువైన 34.35 లీటర్ల పురుగుమందులు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. కార్యక్రమంలో విజిలెన్‌న్స్ ఎన్‌ఫోర్స్ మెంట్ వ్యవసాయ అధికారి కే.రమణకుమార్, సబ్ ఇన్‌స్పెక్టర్ రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.