
కడప మీదుగా వెళ్లే జాతీయ రహదారి –40 మార్గంలో కీలకమైన గువ
కడప రూరల్: కర్నూలు, చిత్తూరు మధ్యలో కడప అనుసంధానంగా ఉండే జాతీయ రహదారి–40 మార్గం ఎంతో కీలకమైనది. ఈ ఘాట్ కడప నగరానికి దాదాపు 15 కిలో మీటర్ల దూరంలో ఉంది. వాహనదారులు, ముఖ్యంగా భారీ వాహనదారులు ఈ ప్రమాదకర మలుపుల్లో వెళ్లాలంటే చాలా అప్రమత్తంగా ఉండాలి.
నాలుగు వరసల దారి..
కేంద్ర ప్రభుత్వం ఇటీవలనే కడప గువ్వల చెరువు ఘాట్ వద్ద ప్రమాదాల నివారణకు, సురక్షిత ప్రయాణానికి సొరంగ మార్గం నిర్మించాలని సంకల్పించింది. ఆ మేరకు అంచనా వ్యయం రూ.920 కోట్లుగా నిర్ణయించింది. ఇక్కడ ప్రస్తుతం వాహనాలు రాకపోకలు సాగించడానికి దాదాపు 30 అడుగుల రహదారి ఉంది. సొరంగ మార్గం నిర్మించే ప్రాంతంలో కడప వైపు నుంచి చిన్న బిడికి గ్రామం వద్ద నుంచి.. ఘాట్‌కు ఆవలి వైపు ఉన్న గువ్వలచెరువు ప్రాంతం వరకు దాదాపు 7–8 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మధ్యలో సొరంగ మార్గం (టన్నెల్) దాదాపు 3 కిలోమీటర్ల దూరం ఉండనుంది. అంటే మొత్తం 7–8 కిలో మీటర్ల వరకు (సొరంగ మార్గంతో కలిపి) వాహనాలు రాకపోకలు సాగించడానికి నాలుగు వరుసల రహదారులను నిర్మించనున్నారు. ఈ టన్నెల్‌ను ఏ ప్రాంతంలో ఏర్పాటు చేసేది అత్యున్నత స్ధాయి నిపుణులు నిర్ధారించాల్సి వుంది. ఇప్పటికే ఢిల్లీ నుంచి నేషనల్ హైవే టన్నెల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌తో మరి కొంతమంది నిపుణులు ఇక్కడికి వచ్చి.. ప్రాథమికంగా ఈ ప్రాంతాలను పరిశీలించి వెళ్లినట్లుగా తెలిసింది. కాగా ఈ మార్గానికి అటవీ, పర్యావరణ తదితర శాఖల నుంచి అనుమతులు రావాల్సి వుంది.
మలుపుల్లో తరచూ మృత్యు ఘంటికలు
ఇక్కడ చాలా ఏళ్ల క్రితం బ్రిటీష్ హయాంలో రోడ్డును నిర్మించారు. ఈ ఘాట్ మార్గంలోనే ఇప్పుడు అంద రూ ప్రయాణాలు సాగిస్తున్నారు. ఒక అంచనా ప్రకా రం ఈ మార్గంలో ఒక నిమిషానికి ఒక వాహనం వెళ్తోంది. పలు రకాల వాహనాలు ముఖ్యంగా భారీ వాహనదారులకు ఈ ఘాట్ విషమ పరీక్షను పెడుతుంది. ఇక్కడ అత్యంత జాగ్రత్తగా వాహనం నడపక పోతే ప్రమాదం జరుగుతుంది. ఒక అంచనా ప్రకారం ఒక నెలలో 2–3 ప్రమాదాలు జరుగుతుంటాయి. ప్రాణ నష్టం కూడా సంభిస్తుంటుంది. కడప వైపు నుంచి ప్రయాణించే వైపు ఘాట్‌లో ఉండే.. శ్రీ ఆంజనేయ స్వామి గుడి వద్ద ఉన్న మలుపు, ఆ పైన ఉన్న మలుపుల వద్ద ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. గువ్వలచెరువు నుంచి కడప వైపు వచ్చే మార్గంలో మొదటి మలుపు వద్ద కూడా ప్రమాదాలు సంభవిస్తుంటాయి. ఈ ప్రమాదాలకు సొరంగ మార్గంతో దాదాపుగా అడ్డుకట్ట పడే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.
● గువ్వల చెరువు ఘాట్‌లో ఏర్పాటుకు సన్నాహాలు
● రూ.920 కోట్ల అంచనా వ్యయం
● మొత్తం 7 కిలోమీటర్ల దారి
● అందులో 3 కి.మీ సొరంగం
● టన్నెల్‌తో ప్రమాదాలకు అడ్డుకట్ట
● వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడే ప్రతిపాదనలు
నాడే ప్రతిపాదనలు
ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్న సమయంలోనే పలు ప్రాజెక్ట్‌లు పూర్త య్యా యి. ఎన్నో చారిత్రాత్మక పథకాలను అమలు చేశా రు. జాతీయ రహదారులతోపాటు జిల్లా, గ్రామీ ణ రోడ్లకు మహర్దశ పట్టింది. అందులో భాగంగానే గువ్వలచెరువు ఘాట్‌లో సొరంగ మార్గానికి ప్రతిపాదనలు పంపారు. కాగా వైఎస్సార్ మరణానంతరం ఈ పనులు ముందుకు సాగలేదు.

కడప మీదుగా వెళ్లే జాతీయ రహదారి –40 మార్గంలో కీలకమైన గువ