● సొగసైన సురక్షితమైన ప్రయాణం | - | Sakshi
Sakshi News home page

● సొగసైన సురక్షితమైన ప్రయాణం

Jul 5 2025 6:18 AM | Updated on Jul 5 2025 6:18 AM

● సొగసైన సురక్షితమైన ప్రయాణం

● సొగసైన సురక్షితమైన ప్రయాణం

పవిత్రమైన, సుందరమైన శేషాచలం అటవీ కొండలు, పాలకొండల సముదాయంలో గువ్వలచెరువు ఘాట్‌ ఉంది. ఈ ప్రాంతం అందమైన అటవీ ప్రాంతం, వర్షాకాలంలో ఎటు చూసి నా పచ్చదనం.. జలపాతాల సోయ గాలు కనువిందు చేస్తుంటాయి. అలాంటి ప్రకృతి మధ్య సొరంగ మార్గం ఏర్పాటు కావడంతో.. ఆ ఏరియా అంతా పర్యాటక ప్రాంతంగా మారే అవకాశం ఉంది. ఈ మార్గం గుండా ఇప్పటికే హైదరాబాద్‌, కర్నూలు, అనంతపురం, వైఎస్సార్‌ కడప జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వాపార, వ్యవసాయ రంగానికి సంబంధించి ఉత్పత్తులు రవాణా అవుతున్నాయి. ఉదాహరణకు మన జిల్లా నుంచి సిమెంట్‌, మైనింగ్‌, అరటి, బత్తాయి తదితర వస్తువులు గువ్వలచెరువు ఘాట్‌ మీదుగా పీలేరు, చిత్తూరు, చైన్నె, మదనపల్లె, బెంగళూరు తదితర ప్రాంతాలకు రవాణా అవుతున్నాయి. చైన్నె, బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి ఇక్కడికి ఫ్యాక్టరీలకు మిషనరీ, ఇతర పరిశ్రమలకు సంబంధించిన విడి భాగాలు, కెమికల్స్‌తోపాటు టమోటా తదితర కూరగాయలు, కొబ్బరి బొండాలు.. ఇలా పలు రకాల వస్తువులు భారీ వాహనాల్లో వస్తుంటాయి. వీటిలో కొన్ని వివిధ కారణాల చేత ఘాట్‌ మలుపుల్లో చిక్కుకొని ప్రమాదాలకు గురి అవుతున్నాయి. సొరంగ మార్గం ఏర్పాటైతే దాదాపు ఒక గంట ప్రయాణం కలిసి రావడంతోపాటు సుఖంగా.. సురక్షితంగా ప్రయాణం సాగించడానికి వీలుకలుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement