
ఆలోచనకు పదును.. సృజనకు అదును
కడప ఎడ్యుకేషన్ : ఇన్‌స్పైర్ మనక్– 2005 అవార్డులకు వేళయింది. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులను ప్రయోగాల వైపు నడిపించి.. వారి చిట్టి బుర్రలకు పదునుపెట్టి... కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టి.. వారిని భావి భారత శాస్త్ర వేత్తలుగా తయారుచేయాలనే లక్ష్యంతోభాగంగా భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం(డిఎస్‌టి) ఏటా విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. జిల్లా స్థాయిలో ప్రతిభ చూసిన విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించే అవకాశం ఉంటుంది. జాతీయ స్థాయికి ఎంపికై న విద్యార్థులకు బాల శాస్త్రవేత్తలుగా నామకరణం చేసి రాష్ట్రపతి అవార్డు అందజేస్తారు. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు త్వరపడాల్సి ఉంది.
అర్హతలు... ఎంపికలు ఇలా
వైఎస్సార్ జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్తు, ఎయిడెడ్, ప్రైవేటు ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఆరు నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులందరూ ఇన్‌స్పైర్ మనక్‌కు దరఖాస్తు చేసేందుకు అర్హు లు. వారంతా తమ సైన్సు టీచర్‌ను గైడ్‌గా ఏర్పాటుచేసుకుని ఈ పరిశోధనలో పాల్గొనాల్సి ఉంటుంది. ప్రతి పాఠశాల నుంచి ఐదు ప్రాజెక్టులు ఎంపిక చేస్తారు. స్థానిక సమస్యలను తీర్చే విధంగా ఆలోచనలుండాలి. తరగతి వారీగా ఉత్తమ ఆలోచన ఎంపిక చేసి అందుకు అవసరమైన ప్రాజెక్టు రూపొందించాలి. విద్యార్థి, తండ్రి పేర్లు, తరగతి నమోదు చేసి విద్యార్థికి సంబంధించిన బ్యాంకు ఖాతా, ఆధార్‌కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి. విద్యార్థి ప్రాజెక్టు రాత పూర్వకంగా సంబంధిత వెబ్ సైట్‌లో నమోదు చేయాలి. ప్రాజెక్టు పేరు, శాస్త్ర సాంకేతికతకు సంబంధించిన అంశాలు ఉండేలా చూసుకోవాలి. ప్రాజెక్టు ఎంపిక రెండు నెలల్లో పూర్తి చేసి జిల్లా స్థాయి ప్రతిభా వంతులను ప్రకటిస్తారు. తర్వాత రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తారు. ఎంపికై న ప్రాజెక్టుకు ప్రయోగం నిమిత్తం బ్యాంకు ఖాతాల్లో రూ.10 వేలు జమ చేస్తారు. ఈ దరఖాస్తుకు గడువు సెప్టెంబర్ 15వ తేదీ వరకు ఉంది.
దరఖాస్తు చేసుకునే విధానం ఇలా...
ఇన్‌స్పైర్ అవార్డు మనాక్‌లో పాల్గొనేందుకు విద్యార్థులు ముందుగా www.inrpireawardrdrt.gov.in వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. స్కూల్ ఆఽథారిటీ ఆప్షన్‌ను ఎంపిక చేయాలి. అందులో న్యూ రిజిస్ట్రేషన్ అప్షన్‌ను ఎంపిక చేయాలి. పాఠశాల వివరాలను పొందుపరిచి సేవ్ చేయాలి. సంబంధిత దరఖాస్తు జిల్లా అథారిటీకి చేరుతుంది. ఆమోదించిన తరువాత మనం ఇచ్చిన మొయిల్ ఐడీకి యూజర్ ఐడితో కూడిన లింక్ వస్తుంది. ఆ ఐడీతో పాస్‌వర్డు క్రియేట్ చేయాలి. అనంతరం విద్యార్థుల ప్రాజెక్టు వివరాలను అందులో నమోదుచేయాలి.
జాగ్రత్తలు పాటించాలి...
విద్యార్థులు తయారు చేసే ప్రాజెక్టులలో స్థానిక సమస్యలను ప్రతిబింబించి.. వాటికి పరిష్కార మార్గాలు చూపేలా ఉండాలి. పాతవైనా తాజా పరిస్థితులకు అన్వయించి పరిష్కారం చూపాలి. నమూనాల పొడవు, వెడల్పు ఒక మీటరు ఉండేలా చూసుకోవాలి. ప్రాజెక్టు రిపోర్టులో నమూనా పరిచయం, పనిచేసే తీరు, ఉపయోగించే పరికరాలు, తయారీ విధానం, పనిచేసే తీరు. ఫలితాల అనువర్తనాలు తప్పని సరిగా ఉండాలి. ప్రాజెక్టుల పరిశీలనకు వచ్చే న్యాయ నిర్ణేతలకు నమూనా చూపించి ప్రాజెక్టు గురించి తడబాటు లేకుండా వివరించాలి.
ఎంపిక పక్రియ...
విద్యార్థులు తయారుచేసిన ప్రాజెక్టులు, నమూనాలను జిల్లా స్థాయి ప్రదర్శనలో ఉంచుతారు. జిల్లా స్థాయిలో ఎంపికై న ప్రాజెక్టులను రాష్ట్రస్థాయికి పంపుతారు. అక్కడ విజయం సాధిస్తే జాతీయ స్థాయిలో పదర్శించే అవకాశం కల్పిస్తారు. జాతీయ స్థాయిలో ఎంపికై న వాటిని ఐఐటి, నీట్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలకు అప్పగిస్తారు. వాటిని వారు గొప్ప నమూనాలుగా రూపొందిస్తారు. ఉత్తమ ప్రదర్శనల నుంచి జాతీయ స్థాయిలో పదర్శనలకు అవకాశం ఉంటుంది. వీటిలో పలు ప్రాజెక్టులను ఫైనల్‌గా ఎంపిక చేసి రాష్ట్రపతి భవన్‌లో జరిగే వారోత్సవాల్లో ప్రదర్శిస్తారు. ఈ ప్రాజెక్టులకు ప్రభుత్వం పెటెంట్ హక్కులు మంజూరు చేస్తుంది.
ఇన్‌స్పైర్‌మనక్ –2025కు
దరఖాస్తుల ఆహ్వానం
బాల మేధావులకు గొప్ప అవకాశం
సెప్టెంబర్ 15వ తేదీ వరకు
నమోదుకు గడువు
విద్యార్థులను ప్రోత్సహించండి
ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పనిచేసే సైన్సు ఉపాధ్యాయులందరూ విద్యార్థులను ప్రోత్సహించాలి. ప్రాజెక్టుల రూపకల్పనలో వారి ఆలోచనలను పరిగణనలోకి తీసుకోని నూతనత్వాన్ని ప్రతిబింబించేలా ప్రాజెక్టు సిద్ధం చేసుకోవాలి. ఇందుకు అన్ని పాఠశాలల సైన్సు ఉపాధ్యాయులు కృషిచేయాలి. అనుమానాలుంటే జిల్లా సైన్సు అధికారిని సంప్రదించాలి.
– షేక్ షంషుద్దీన్, జిల్లా విద్యాశాఖాధికారి
ప్రతి పాఠశాలల నుంచి...
ఇన్‌స్పైర్ మనక్ నామినేషన్ల నమోదుకు సెప్టెంబర్ 15వ తేదీ వరకు గడువు ఉంది. ప్రతి పాఠశాల నుంచి ప్రాజెక్టులు వచ్చేలా చూడాలి. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల నుంచి విద్యార్థులు భాగస్వాములు కావాలి. ఇందులో ప్రాథమికోన్నత పాఠశాల నుంచి మూడు, ఉన్నత పాఠశాల నుంచి 5 ప్రాజెక్టులను తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. ఇందుకు ప్రతి ౖసైన్సు ఉపాధ్యాయుడు కృషి చేయాలి. – ఎబినైజర్, జిల్లా సైన్సు అధికారి

ఆలోచనకు పదును.. సృజనకు అదును

ఆలోచనకు పదును.. సృజనకు అదును

ఆలోచనకు పదును.. సృజనకు అదును