
9 నుంచి అంగన్‌వాడీల సమ్మె బాట
రాయచోటి టౌన్ : ఈనెల 9వ తేదీ నుంచి అంగన్‌వాడీలు సార్వత్రిక సమ్మెలోకి వెళ్లనున్నట్లు సంఘం నాయకులు తెలిపారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ (ఏఐటీయూసీ అనుబంధం) జిల్లా కార్యదర్శి నాగేశ్వరి జిల్లా సీ్త్ర శిశు సంక్షేమశాఖ సూపరింటెండెంట్ లక్ష్మిదేవికి నోటీసులు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గత 50 సంవత్సరాలుగా ఎలాంటి ఉద్యోగ భద్రత లేకుండా కనీస వేతనాలు, ఈఎస్‌ఐ, పెన్షన్, గ్రాట్యుటీ, ఇన్సూరెన్స్ వంటి సౌకర్యాలు లేకుండానే అంగన్‌వాడీలు పని చేస్తున్నారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్‌వాడీలకు యాప్‌ల పేరుతో పని భారం పెంచుతున్నారన్నారు. అంగన్‌వాడీల సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేపట్టనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రేణుక, శశికళ, శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు.