రైల్వేస్టేషన్లకు కొత్తకళ! | - | Sakshi
Sakshi News home page

రైల్వేస్టేషన్లకు కొత్తకళ!

Apr 2 2025 1:38 AM | Updated on Apr 2 2025 1:40 AM

మారనున్నాయ్‌... మన రైల్వేస్టేషన్లు!

అమృతభారత్‌ పథకంతో శ్రీకారం

మదనపల్లె, పీలేరు, రాజంపేటలో ఆధునికీకరణ పనులు

రైల్వేస్టేషన్ల అభివృద్ధికి అమృత్‌ భారత్‌ ఒక వరం

జిల్లాలో రాజంపేట, మదనపల్లె స్టేషన్ల అభివృద్ధిపై దృష్టి సారించారు. రాజంపేట స్టేషన్‌ ముఖ ద్వారంపై అన్నమయ్య విగ్రహంను ఏర్పాటు చేస్తున్నారు. అమృత్‌ భారత్‌ జాబితాలో రాజంపేట, పీలేరు, మదనపల్లె స్టేషన్లు చేరేలా ఎంపీ మిథున్‌రెడ్డి కృషి చేశారు. ఈ పథకం ఓ వరం. ప్రతి రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పన ఉండాలని రైల్వేశాఖను ఎంపీ కోరుతున్నారు. – తల్లెం భరత్‌ కుమార్‌రెడ్డి,

సభ్యుడు, గుంతకల్‌ డీఆర్‌యుసీసీ

రాజంపేట రైల్వేస్టేషన్‌లో

అధునాతన సౌకర్యాలు

ఎంపీ మిథున్‌రెడ్డి కృషితో అమృత్‌భారత్‌ పథకం కింద ఎంపికై న రాజంపేట రైల్వేస్టేషన్‌లో అధునాతన సౌకర్యాలు కల్పించేందుకు పనులు జరుగుతున్నాయి. ఇది శుభపరిణామం. పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రమైన రాజంపేటలో అన్ని రైళ్ల హాల్టింగ్‌కు ఎంపీ కృషిచేస్తున్నారు. అన్నమయ్య రాజంపేట రైల్వేస్టేషన్‌గా పేరు మార్చేలా రైల్వేశాఖ కృషి చేయాలి. – మర్రి రవికుమార్‌,

వైస్‌చైర్మన్‌, మున్సిపాలిటి, రాజంపేట

రాజంపేట: అన్నమయ్య జిల్లాలోని పలు రైల్వేస్టేషన్ల రూపురేఖలు మారనున్నాయి. ప్రయాణీకుల రద్దీ ఎక్కువుగా ఉన్నవాటిని ఆధునీకరించే లక్ష్యంతో కేంద్రప్రభుత్వం అమృత్‌భారత్‌ స్టేషన్‌ పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. ప్రయాణీకులకు మెరుగైన వసతులు కల్పించే విధంగా స్టేషన్లను ఆధునీకరణ చేస్తున్నారు.

● అమృత్‌భారత్‌ పథకం కింద అన్నమయ్య, వైఎస్సార్‌ జిల్లాలో కడప, రాజంపేట, మదనపల్లె, పీలేరు రైల్వేస్టేషన్లలో ఆధునీకరణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రయాణీకుల సౌకర్యాల కల్పన దిశగా ప్లానింగ్‌ చేసిన నేపథ్యంలో చకచకా పనులు కొనసాగుతున్నాయి. అత్యాధునిక ఆర్కిటెక్చర్‌, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయనున్నారు. రాజంపేటకు రూ.5.53 కోట్లు, మదనపల్లెకు రూ.8 కోట్లు, పీలేరు రూ.55 లక్షలు కేటాయించారు.

ప్రధాన సౌకర్యాలు ఇవే..

రాజంపేట, పీలేరు రైల్వేస్టేషన్లలో భవనాలు, ఫ్లోరింగ్‌ ఆధునికశైలితో నిర్మితం చేయనున్నారు. ప్లాట్‌ఫాం పొడవును కూడా పెంచనున్నారు. 600 మీటర్ల ఉన్న ప్లాట్‌ఫాంలు 760 మీటర్ల నుంచి 840 మీటర్ల వరకు పొడిగించే అవకాశాలున్నాయి. స్టేషన్లలో రైలుపట్టాల పరిశుభ్రత కోసం బ్యాలస్ట్‌లెస్‌ ట్రాక్‌లు ఏర్పాటు చేస్తారు. దివ్వాంగుల కోసం ప్రత్యేకంగా వీల్‌చైర్లు, ప్రత్యేక ప్రవేశమార్గాలు, ఇతర సదుపాయాలు ఉంటాయి. వెయింటింగ్‌ హాల్స్‌, వాటికి అనుబంధంగా కేఫెటేరియా, స్థానిక ఉత్పత్తుల విక్రయానికి కనీసం రెండుస్టాల్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి స్టేషన్‌ మొదటి అంతస్తులో ప్రత్యేకంగా రూఫ్‌ప్లాజా, సమావేశ మందిరాలు నిర్మితం చేయనున్నారు. స్టేషన్‌కు రెండువైపులా అప్రోచ్‌రోడ్లు, పార్కింగ్‌ ఏరియా, పాదచారులకు ప్రత్యేక దారి – ల్యాండ్‌ స్కేపింగ్‌, ఆధునిక లైటింగ్‌, వేగవంతమైన వైఫే సేవలకు 5 జీ టవర్లు ఏర్పాటుచేసే దిశగా మాస్టర్‌ ప్లాన్‌ కొనసాగనున్నది.

స్టేషన్ల అభివృద్ధిపై

ఎంపీ మిథున్‌రెడ్డి ప్రత్యేక దృష్టి

రాజంపేట, మదనపల్లె, పీలేరుతోపాటు పలు రైల్వేస్టేషన్ల అభివృద్ధిపై రాజంపేట ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. అమృత్‌భారత్‌ పథకం కింద పీలేరు, రాజంపేట రైల్వేస్టేషన్ల ఎంపికకు తన వంతు కృషిచేశారు. అలాగే స్టేషన్‌లలో ప్రయాణీకులకు మెరుగైన సదుపాయాల కల్పన పూర్తి స్థాయిలో ఉండాలన్నదే ఎంపీ అభిమతంగా కనిపిస్తోంది. జిల్లాలో రాజంపేట, పీలేరు స్టేషన్లున్నాయి. ఈ పథకం కింద 53 రకాల సదుపాయాలతో స్టేషన్ల సమగ్ర అభివృద్ధికి రైల్వేశాఖ చర్యలు చేపట్టేందుకు తన వంతుగా కృషిచేస్తున్నారు.

అమృత్‌ భారత్‌ నిధులు

రాజంపేట: రూ.5.53కోట్లు

మదనపల్లె : రూ.8.కోట్లు

స్టేషన్ల చరిత్ర..

రైల్వేస్టేషన్లకు కొత్తకళ! 1
1/3

రైల్వేస్టేషన్లకు కొత్తకళ!

రైల్వేస్టేషన్లకు కొత్తకళ! 2
2/3

రైల్వేస్టేషన్లకు కొత్తకళ!

రైల్వేస్టేషన్లకు కొత్తకళ! 3
3/3

రైల్వేస్టేషన్లకు కొత్తకళ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement