
తాడేపల్లి : వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మహానేత వైఎస్సార్ 16వ వర్థంతి కార్యక్రమం నిర్వహించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి, మహానేత వైఎస్సార్‌కు పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు పార్టీ నేతలు. ఈ కార్యక్రమంలో పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పార్టీ ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్‌రావు సహా పలువురు పార్టీ నేతల పాల్గొన్నారు.

దీనిలో భాగంగా సజ్జల మాట్లాడుతూ.. ‘ శత్రువులను కూడా క్షమించగల మానవతావాది వైఎస్సార్. ప్రతి ఒక్కరికీ చేతనైన సాయం చేయగలిగిన వ్యక్తి వైఎస్సార్. మనకు తెలియకుండానే మన జీవితాల్లో మార్పులు తెచ్చిన నేత. జలయజ్ఞం పేరుతో ప్రాజెక్టులు కట్టినా, రైతులకు ఉచిత విద్యుత్ అందించినా ఆయనకే చెల్లింది. మన ఇంట్లో మనిషిలా మన జీవితాల్లో వైఎస్సార్ ఉన్నారు. కొన్ని కోట్ల మందికి వైఎస్సార్‌తో జ్ఞాపకాలు ఉన్నాయి. తన పాలనా దక్షతతో వైఎస్సార్ అందరినీ ఆకట్టుకున్నారు.
వైఎస్సార్ వారసత్వాన్ని జగన్ కొనసాగిస్తున్నారు. వైఎస్సార్ ఆశయాలను భావి తరాలకు అందించటంలో అందరం కలిసి కదులుదాం. వైఎస్ఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు ప్రజల జీవితాల్లో మార్పులు తెచ్చాయి. రైతులకు ఉచిత కరెంట్....ఆరోగ్య శ్రీ పథకాలను ఎవరూ ఎప్పటికీ మర్చిపోరు. వైఎస్ఆర్ రాష్ట్ర ప్రజలకు ఆదర్శ ప్రాయుడు.. వైఎస్ఆర్ వెళుతూ వెళుతూ మనకు వారసత్వాన్ని ఇచ్చారు. జగన్ మోహన్ రెడ్డి వైఎస్ఆర్ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. వైఎస్ఆర్ కంటే మిన్నగా సంక్షేమ పథకాలు అమలు చేశారు. రాజశేఖర్ రెడ్డిని గుండెల్లో పెట్టుకున్న ప్రజలు...జగన్‌ని అంతగా ఆదరిస్తున్నారు.వందేళ్లయినా వైఎస్ఆర్ గుర్తుకు వస్తారు. వైఎస్ జగన్ వైఎస్సార్ ఆశయాలను ముందుకు తీసుకు వెళుతున్నారు. అలాంటి వైఎస్సార్‌సీపీ మనం ఉండటం అదృష్టంగా భావించాలి. కొందరు నేతలు చేస్తున్న దుష్ట రాజకీయం ఎంతో కాలం నిలవదు. అధికారం కోసం అడ్డ దారులు తొక్కుతున్న వారిని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు’ అని పేర్కొన్నారు.
పేద ప్రజల గుండెల్లో వైఎస్సార్ చెరగని ముద్ర
విజయవాడ: తన సంక్షేమ పథకాలతో పేద ప్రజల గుండెల్లో వైఎస్సార్ చెరగని ముద్ర వేశారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కొనియాడారు. ఈరోజు(మంగళవారం, సెప్టెంబర్ 2వ తేదీ) వైఎస్సార్ 16వ వర్థంతిని పురస్కరించుకుని విజయవాడ పోలీస్ కంట్రోల్ రూమ్ వద్దనున్న వైఎస్సార్ విగ్రహానికి ఘన నివాళులు అర్పించిన వైఎస్సార్‌సీపీ నేతలు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు వెలంపల్లి శ్రీనివాసరావు, జోగి రమేష్ ,మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, వైఎస్సార్‌సీపీ నాయకులు పోతిన మహేష్, షేక్ ఆసిఫ్ ,పూనూరు గౌతమ్ రెడ్డి , మేయర్ రాయన భాగ్యలక్ష్మి , డిప్యూటీ మేయర్ శైలజా రెడ్డి, ఇంకా పార్టీకి చెందిన పలువురు నేతలు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
దీనిలో భాగంగా వెల్లంపల్లి మాట్లాడుతూ.. ‘ వైఎస్సార్ మరణించినా పేద ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కారం చేశారు. విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. చంద్రబాబు హయాంలో పేదలకు చేసిందేమీ లేదు. వైఎస్సార్ పాలన సువర్ణ యుగంలా సాగింది. వైఎస్సార్ పెట్టిన మంచి పథకాలను కూడా చంద్రబాబు తీసివేశారు’ అని పేర్కొన్నారు
దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. ‘ ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో వైఎస్సార్‌కు ఘనంగా నివాళులర్పించాం. పార్టీ శ్రేణులు అందరూ వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొని ఆయనపై అభిమానాన్ని చూపించారు. వైఎస్సార్ పేరు చెబితే సంక్షేమం అభివృద్ధి గుర్తుకు వస్తాయి. అన్ని వర్గాల ప్రజలను వైఎస్సార్ ఆదుకున్నారు.
వైఎస్సార్ పాలనను ఒక ఐకాన్‌గా తీసుకుని ప్రక్క రాష్ట్రాల వారు పాలన చేస్తున్నారు. చంద్రబాబు ముప్పై ఏళ్ల పాలనలో ఒక మంచి పథకం గుర్తుకు రాదు. చంద్రబాబు పొడిచిన వెన్నుపోటు తప్ప ఆయన పేరు చెబితే ఏమి గుర్తుకు రాదు. వైఎస్సార్ ఆశయాలను కొనసాగిస్తూ జగన్ ముందుకు వెళ్తున్నారు. జగన్ పాలనలో ప్రజలందరికీ మంచి జరిగింది. పేద ప్రజల కోసం ఎన్నో పథకాలు అమలు చేసి వారికి అండగా నిలిచారు.కూటమి పాలనలో ప్రజలకు సంతోషం కరువైంది. ఇచ్చిన హామీలు తుంగలో తొక్కారు.’ అని విమర్శించారు.
మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ‘ వైఎస్సార్ పాలన సువర్ణ అధ్యాయంలా నిలుస్తుంది. మంచి వైద్యం అందించి ప్రజల ప్రాణాలు కాపాడారుప్రతి పథకం పక్కాగా అమలు చేసి ప్రజలకు సేవ చేశారు. కూటమి ప్రభుత్వం కక్ష పూరిత రాజకీయాలు చేస్తుంది. కూటమి పాలనలో ప్రజా స్వామ్య విలువలు దిగజారాయి’ అని మండిపడ్డారు.