
కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్‌లో టమాటా ధర వారం రోజులుగా దారుణంగా పడిపోయింది. శుక్రవారం రైతులు మార్కెట్‌కు తీసుకొచ్చిన టమాటాలకు కిలోకు కనిష్టంగా 50పైసలు, గరిష్టంగా 1 రూపాయి మాత్రమే ధర రావడంతో వారి ఆవేదన వర్ణనాతీతం.
చాలామంది రైతులు తీసుకొచి్చన టమాటాలను కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ఆసక్తి చూపలేదు. దీంతో ఆత్మాభిమానం చంపుకొని వ్యాపారులను అడుక్కోలేక రెక్కల కష్టంతో తీసుకొచి్చన టమాటాలను వ్యాపారుల ముందే మార్కెట్‌లో పారబోసి వెళ్లిపోయారు. తమను కూటమి ప్రభుత్వం ఆదుకోలేందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. – పత్తికొండ