కేఏ పాల్‌కు పవన్‌ కల్యాణ్‌కు తేడా ఏమీ లేదు: మంత్రి జోగి రమేష్‌ 

Jogi Ramesh Satirical Comments On TDP And Janasena - Sakshi

సాక్షి, తాడేపల్లి: ఏపీలో టీడీపీపై తిరుగుబాటు మొదలైంది. చంద్రబాబు రాష్ట్రంలో తిరిగే పరిస్థితి కనిపించడం లేదని ఏపీ గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ విమర్శించారు. తాడేపల్లిలో మంత్రి జోగి రమేష్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘టీడీపీ మీద ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది అనడానికి కుప్పమే నిదర్శనం. తిరుగుబాటు కుప్పంలో బీసీల నుంచే ప్రారంభమైంది. చంద్రబాబు జెండాను, పార్టీని కూకటి వేర్లతో పెకిలించడానికి ప్రజలు సిద్ధమయ్యారు. తమను బానిసలుగా చేసుకున్న చంద్రబాబు.. ఏ ముఖం పెట్టుకుని కుప్పం వస్తాడని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ప్రజలంతా మనసున్న మారాజు.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని జేజేలు కొడుతున్నారు. ప్రజలు కూడా పార్టీలు,కులాలు,మతాలు చూడమని.. సీఎం వైఎస్‌ జగన్‌ను మాత్రమే చూస్తామని చెబుతున్నారు. చంద్రబాబు.. నీ నియోజకవర్గంలోనే అభివృద్ధి లేదు. ఇంక నువ్వు రాష్ట్రానికి ఏం చేస్తావ్‌?. తండ్రీకొడుకులని నమ్ముకుంటే నట్టేట ముగినిపోతారు. కేఏ పాల్‌కు, పవన్‌ కల్యాణ్‌కు తేడా ఏమీలేదు. ఇద్దరికీ ఏపీలో సీట్లు లేవు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 175 నియోజకవర్గాల్లో ఓటమి తప్పదు. ఎల్లో మీడియా ఎన్ని జాకీలు పెట్టినా చంద్రబాబు లేవలేరు అని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: దాడులు చేసిన టీడీపీ నాయకుల అరెస్టు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top