నేత్రపర్వంగా చన్నమల్లప్ప జాతర
బ్రహ్మసముద్రం: మండలంలోని సూగేపల్లిలో సోమవారం రాత్రి ఆరూఢ చన్నమల్లప్ప స్వామి జాతర నేత్రపర్వంగా సాగింది. అర్ధరాత్రి 11 గంటల సమయంలో పీఠాధిపతి ఆరూఢా చన్నమల్లప్ప స్వామిని అశ్వ రథంపై ఊరేగించారు. మంగళవారం తెల్లవారుజామున ఊరేగింపు స్వామీజీ పూర్వీకుల సజీవ సమాధుల వద్దకు చేరుకుంది. అక్కడ ప్రత్యేక పూజల అనంతరం తిరిగి మఠానికి ఊరేగింపుగా చేరారు. ఉత్సవంలో పాల్గొనేందుకు ఆంధ్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు.
రథంపై ఊరేగుతున్న చన్నమల్లప్ప స్వామి జాతరలో పాల్గొన్న భక్తులు
నేత్రపర్వంగా చన్నమల్లప్ప జాతర


