
గూగూడుకు పోటెత్తిన భక్తులు
నార్పల మండలం గూగూడులో కుళ్లాయిస్వామి ఉత్సవాలకు భక్తులు పోటెత్తారు. శుక్రవారం తెల్లవారుజామున చిన్నసరిగెత్తు సందర్భంగా అర్చకులు హుసేనప్ప కుళ్లాయిస్వామి పీరును ప్రత్యేక పూలు, పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో అలంకరించారు. కుళ్లాయిస్వామి– ఆంజనేయస్వామి దర్శనం కోసం రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో కాసేపు తొక్కిసలాట జరిగింది. చిన్న సరిగెత్తులో భాగంగా స్వామి వారి భక్తులు ఫకీర్లుగా మారి జలధి పోయే వరకు నియమనిష్టగా ఉంటారు.
– నార్పల/ సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం

గూగూడుకు పోటెత్తిన భక్తులు