
‘అల్లూరి’.. ఒక సమూహ శక్తి
అనంతపురం అర్బన్: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఒక వక్తి కాదని, ఆయన ఒక సమూహ శక్తి అని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, కలెక్టర్ వి.వినోద్‌కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్ రెవెన్యూ భవన్‌లో అల్లూరి సీతారామారాజు 128వ జయంతి నిర్వహించారు. అల్లూరి చిత్రపటానికి ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, కార్మిక సంక్షేమ బోర్డు రాష్ట్ర చైర్మన్ వెంకటశివుడు యాదవ్ పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడారు. అల్లూరి దేశభక్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
ఫైళ్లు పక్కాగా ఉండాలి
చుక్కుల భూములు, 22ఏ జాబితాకు సంబంధించి ఫైళ్లు సమగ్ర వివరాలతో పక్కాగా ఉండాలని కలెక్టర్ వినోద్‌కుమార్ అధికారులను ఆదేశించారు. చుక్కల భూముల క్లెయిమ్‌ల పరిష్కారంపై కలెక్టర్ శుక్రవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా డాటెడ్ ల్యాండ్ కమిటీ సమావేశం నిర్వహించారు.