
ఉద్యోగాల పేరుతో కుచ్చుటోపీ
గుత్తి: ఉద్యోగాలు కల్పిస్తామని, సంక్షేమ పథకాలు వర్తింజేస్తామని ఇద్దరు యువకులపై సైబర్ నేరగాళ్లు వల విసిరి, డబ్బు దండుకున్నారు. వివరాలు.. గుత్తిలోని బీసీ కాలనీకి చెందిన రవికుమార్, కుళ్లాయప్పకు మూడు రోజుల క్రితం ఫోన్ కాల్ వచ్చింది. తాము అమరావతి నుంచి మాట్లాడుతున్నామని వెంటనే డబ్బు పంపితే ప్రభుత్వ పథకాలు మంజూరు చేయడంతో పాటు ఉద్యోగాలు ఇప్పిస్తామని అవతలి వ్యక్తి నమ్మ బలికాడు. ప్రస్తుతానికి తమ వద్ద డబ్బు లేదని వారు తెలపడంతో ఇప్పుడు ఎంతుంటే అంత పంపాలని, మిగిలిన డబ్బు ఆ తర్వాత ఇవ్వాలన్నారు. దీంతో రవికుమార్ రూ. 22 వేలు, కుళ్లాయప్ప రూ. 15 వేలు ఫోన్ పే చేశారు. బుధవారం రవికుమార్, కుళ్లాయప్ప ఫోన్ చేస్తే స్విచాఫ్ అని వచ్చింది. దీంతో తాము మోసపోయామని నిర్ధారించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య
గుత్తి: స్థానిక జీఆర్‌పీ పరిధిలోని తిమ్మనచెర్ల రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం అర్ధరాత్రి ఓ గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. శరీరం మూడు భాగాలైంది. సంఘటనా స్థలాన్ని గుత్తి జీఆర్‌పీ ఎస్‌ఐ నాగప్ప, కానిస్టేబుల్ వాసు పరిశీలించి, కేసు నమోదు చేశాఉ.
‘స్మార్ట్‌మీటర్ల’పై క్యూఆర్ కోడ్‌తో పోరాటం : సీపీఎం
అనంతపురం అర్బన్: స్మార్ట్‌మీటర్ల ఏర్పాటుపై ప్రజా నిరసనను ప్రభుత్వానికి తెలియజేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వి.రాంభూపాల్ తెలిపారు. బుధవారం స్థానిక గణేనాయక్ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఓ.నల్లప్ప, కార్యవర్గ సభ్యులతో కలిసి స్మార్ట్‌మీటర్లపై వ్యతిరేకతను తెలిపేందుకు రూపొందించిన క్యూఆర్ కోడ్‌ను ఆయన విడుదల చేసి, మాట్లాడారు. ఈ నెల 6న ప్రజల ద్వారానే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయించి ఈ విధానానికి స్వస్తి పలికేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకెళ్లనున్నట్లు పేర్కొన్నారు.
కార్యక్రమంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బాలరంగయ్య, నాగేంద్రకుమార్, కృష్ణమూర్తి, చంద్రశేఖరరెడ్డి, రామిరెడ్డి, శ్రీనివాసులు పాల్గొన్నారు.
మద్యం అక్రమ విక్రేతలపై చర్యలు
అనంతపురం: ఎకై ్సజ్ శాఖ నుంచి లైసెన్స్ పొందిన రిటైల్ మద్యం దుకాణాల నుంచి కాకుండా ఇతరులు మద్యం విక్రయాలు చేపడితే కఠిన చర్యలు ఉంటాయని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి బి. రామమోహన్‌రెడ్డి హెచ్చరించారు. ఇలాంటి విక్రయాలపై 99896 28308కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు.