
రైతుల్లో నమ్మకం కోల్పోయారు
మాట చెప్పడం దాన్ని దాటవేయడం సీఎం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. బీటీపీని 2014–19 మధ్య పూర్తి చేస్తామన్నారు. శంకుస్థాపనలతో హడావుడి చేశారు. రూ.కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారు. మాజీ సీఎం జగన్ 2019–24 మధ్య రైతుల్ని ఆదుకునే చర్యలు చేపట్టారు. భూసేకరణకు నిధులిచ్చారు. ప్రాజెక్టు పనులు పరుగులు పెడుతున్న సమయంలోనే మళ్లీ కూటమి ప్రభుత్వం వచ్చింది. చిత్తశుద్ధి ఉంటే పనులను సకాలంలో పూర్తి చేసి రైతులకు నీరివ్వాలి. శంకుస్థాపనలు చేసి వదిలేస్తే ఊరుకునేది లేదు. రైతులతో కలసి ఉద్యమిస్తాం.
– మెట్టు గోవిందరెడ్డి,
మాజీ ఎమ్మెల్యే, రాయదుర్గం
ప్రజలు నమ్మడం లేదు
ఒకే పనికి ముఖ్యమంత్రి ఓసారి, మంత్రులు మరోసారి శంకుస్థాపనలు చేయడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బీటీపీ ఎత్తిపోతల పథకం కొందరికి బంగారుబాతులా మారింది. రైతులకు మేలు చేకూరితే మొదటగా మేమే సంతోషిస్తాం. అలా కాకుండా శంకుస్థాపనల పేరిట రూ. లక్షల ప్రజాధనం దుర్వినియోగం చేస్తామంటే మాత్రం ఒప్పుకునేది లేదు. మా ప్రభుత్వ హయాంలో భూసేకరణకు సంబంధించి రైతులకు డబ్బులిచ్చాం. మిగిలిన ప్రక్రియను ముందుకు తీసుకెళ్తే సరిపోతుంది.
– తలారి రంగయ్య, మాజీ ఎంపీ

రైతుల్లో నమ్మకం కోల్పోయారు