
కుళ్లాయిస్వామికి విశేష పూజలు
నార్పల: గూగూడు కుళ్లాయిస్వామి ఉత్సవాలు కనులపండువగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. స్వామి వారిని అర్చకులు హుసేనప్ప ప్రత్యేక పూలు, పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో అలంకరించారు. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తాదులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. ఉత్సవాల సందర్భంగా ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఆదివారం పెద్ద సరిగెత్తు, సోమవారం తెల్లవారుజామున 2 గంటలకు గ్రామోత్సవం, ఉదయం 6 గంటలకు అగ్నిగుండ ప్రవేశం, సాయంత్రం గ్రామోత్సవం, జలధి కార్యక్రమం ఉంటుందని అర్చకులు తెలిపారు. ఉత్సవాల్లో అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ఎస్‌ఐ సాగర్ గట్టి బందోబస్తు నిర్వహించారు.