
రేపటి నుంచి పెన్నహోబిలంలో బ్రహ్మోత్సవాలు
ఉరవకొండ రూరల్: ప్రసిద్ద పుణ్యక్షేత్రం పెన్నహోబిలంలో వెలసిన లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 9 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను ఆలయ ఈఓ సాకే రమేష్‌బాబు బుధవారం వెల్లడించారు. 9న శ్రీవారి ఉత్సవమూర్తులను ఆమిద్యాల గ్రామం నుంచి ఊరేగింపుగా ఆలయానికి తీసుకువస్తారు. 10న ప్రాకారోత్సవం, 11న సింహ వాహనం, చంద్రప్రభ ఉత్సవాలు ఉంటాయి. 12న గోవాహన సేవ, శేషవాహనోత్సవం, 13న హంసవాహనం, 14న హనమంత వాహన సేవలు, 15న గరుడ వాహనోత్సవం ఉంటాయి. అదే రోజు శ్రీవారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు. 16న సూర్యప్రభ ఉత్సవం, ఐరావత వాహనోత్సవం, 17న ఉదయం రథోత్సవం, సాయంత్రం ధూళోత్సవం, 18న అశ్వవాహనం, 19న ధ్వజారోహణం, శయనోత్సవం ఉంటాయి. 20న శ్రీవారి ఉత్సవ మూర్తులను ఆమిద్యాల గ్రామానికి చేర్చడంతో ఉత్సవాలు ముగుస్తాయి.

రేపటి నుంచి పెన్నహోబిలంలో బ్రహ్మోత్సవాలు