
●కళ నింపని కనకాంబరాలు
ట పండితే ధరలుండవు.. ధరలుంటే పంట పండదు’ అన్నట్లుగా తయారైంది రైతుల పరిస్థితి. రూ.లక్షలు పెట్టుబడి పెట్టి, రేయింబవళ్లు కంటికి రెప్పలా కాపాడుకున్న పంట తమకు కనీస గిట్టుబాటు కూడా మిగిల్చని దుస్థితి దాపురిస్తుండటంతో వారి ఆవేదన అంతా ఇంతా కాదు. అనంతపురం రూరల్ మండలం పూలకుంట, పసలూరు, చియ్యేడు తదితర గ్రామాల్లో రైతులు కనకాంబరం పూలు సాగు చేశారు. కాపు బాగానే ఉన్నా మార్కెట్లో సరైన ధరల్లేవు. ప్రస్తుతం కిలో రూ.150 నుంచి రూ.200 మాత్రమే పలుకుతుండటంతో గిట్టుబాటు కావడం లేదని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కిలో కనకాంబరాలు రూ.500 నుంచి రూ.800 పలికితేనే అంతో ఇంతో మిగులుతుందని చెబుతున్నారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం
‘పం