
కల్తీ మద్యంపై ఉక్కుపాదం మోపాలి
ఐద్వా జిల్లా కార్యదర్శి లక్ష్మి డిమాండ్
అచ్యుతాపురం రూరల్: కల్తీ మద్యం తయారుదారుల వివరాలు బయటపెట్టి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఐద్వా జిల్లా కార్యదర్శి ఆర్.లక్ష్మి డిమాండ్ చేశారు. కల్తీ మద్యం నిర్వాహకులపై ఉక్కుపాదం మోపాలని ఐద్వాతోపాటు మహిళా సంఘాల నాయకులు గురువారం అచ్యుతాపురంలో ఆందోళన చేపట్టారు. కల్తీ మద్యం విక్రయాలతో శరీర అవయవాలు తొందరగా పాడైపోయి పలువురు మరణిస్తున్నారన్నారు. మత్తు పదార్థాలు, మద్యం అక్రమ విక్రయదారులను కఠినంగా శిక్షించాలన్నారు. బ్రాండ్ మద్యంలో స్పిరిట్ కల్తీ చేసి బెల్టుషాపుల ద్వారా విక్రయిస్తున్న వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఐద్వా మండల అధ్యక్షురాలు నారాయణమ్మ, నాయకులు త్రిమూర్తులమ్మ, కాసులమ్మ పాల్గొన్నారు.