
పరవాడ కేంద్రంగా కల్తీ మద్యం
● హైదరాబాద్‌లో స్పిరిట్ కొనుగోలు.. పరవాడలో తయారీ ● అచ్యుతాపురం, పరవాడల్లో ఎకై ్సజ్ పోలీసుల దాడులు ● 72 లీటర్ల స్పిరిట్, యంత్ర సామగ్రి స్వాధీనం ● ఇద్దర్ని అరెస్ట్ చేసిన యలమంచిలి ఎకై ్సజ్ పోలీసులు
మీడియా ఎదుట ప్రవేశపెట్టిన కల్తీ మద్యం తయారు చేస్తున్న నిందితులు
హైదరాబాద్ టు పరవాడ
హైదరాబాద్ నుంచి స్పిరిట్‌ను 5 లీటర్ల క్యాన్లలో తెప్పించుకుని, దానిలో కారామిల్ అనే రసాయనం కలిపిన వెంటనే ఏసీ బ్లాక్ విస్కీలా రంగు మారిపోతుంది. దానిని మద్యం ఖాళీ క్వార్టర్ (180 మి.లీ.) బాటిళ్లలో వేసి అసలు విస్కీని పోలేలా స్టిక్కర్లు, మూతలు పెట్టి సీల్ చేస్తున్నారు. ఇలా తయారు చేసిన బాటిళ్లను బెల్టు షాపులకు ఒక్కో బాటిల్ రూ.120 నుంచి రూ.130కి విక్రయిస్తున్నారు. దాన్ని బెల్టు షాపుల వాళ్లు వినియోగదారులకు రూ.150 నుంచి రూ.180 వరకూ సరఫరా చేస్తున్నారు. ఈ కల్తీ మద్యం తయారీతో ఏడు రెట్లు లాభం పొందుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల నుంచి 72 లీటర్ల స్పిరిట్, 455 ఖాళీ బాటిళ్లు, 1389 మూతలు, బాటిళ్లపై అతికించడానికి ముద్రించిన ఏసీ బ్లాక్ స్టిక్కర్లు, కారామిల్ రసాయనం, యంత్ర సామగ్రిని స్వాధీనపర్చుకున్నారు. నిందితులు ఒక లీటర్ స్పిరిట్ రూ.100కి కొనుగోలు చేస్తున్నారని, 5 లీటర్ల స్పిరిట్‌తో 27 కల్తీ మద్యం క్వార్టర్ బాటిళ్లు తయారు చేస్తున్నారని ఆయన తెలిపారు. కల్తీ మద్యం తాగితే కాలేయ సంబంధ వ్యాధుల బారిన పడతారని, చివరకు ప్రాణాంతకంగా మారుతుందని సీఐ తెలిపారు. ఇలాంటి కల్తీ మద్యం తయారీ ముఠాల సమాచారం తమకు అందించాలని ఆయన కోరారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ఇంకా నిందితులెవరైనా ఉంటే వారిపై కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.
యలమంచిలి రూరల్: ఆస్పత్రుల్లో చేతులు శుభ్రపర్చుకునేందుకు ఉపయోగించే స్పిరిట్‌తో కల్తీ మద్యం తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. పరవాడలో స్థావరం ఏర్పాటు చేసుకుని కల్తీ మద్యం తయారు చేస్తున్నారు. బెల్టు షాపులకు యథేచ్ఛగా సరఫరా చేస్తున్నారు. ఎకై ్సజ్ పోలీసులు పలుచోట్ల దాడులు చేసి ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. నిందితుల దగ్గర్నుంచి 72 లీటర్ల స్పిరిట్, కల్తీ మద్యం తయారీకి ఉపయోగిస్తున్న యంత్ర సామగ్రి, ఖాళీ మద్యం బాటిళ్లు, స్టిక్కర్లు, రంగు కోసం కలిపే రసాయనం స్వాధీనపరుచుకున్నారు. యలమంచిలి ఎకై ్సజ్ సీఐ పి.తేజో వెంకటకుమార్ గురువారం సాయంత్రం యలమంచిలిలో ఉన్న తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలియజేసిన వివరాలివి.. మాకవరపాలేనికి చెందిన రుత్తల రాము ఉపాధి నిమిత్తం అచ్యుతాపురంలో ఉంటున్నాడు. అక్రమమార్గంలో డబ్బు సంపాదించడానికి కల్తీ మద్యం వ్యాపారం లాభదాయకంగా ఉంటుందని తెలుసుకున్నాడు. పరవాడకు చెందిన యలమంచిలి వెంకటేశ్వర్రావు అలియాస్ వెంకటేష్‌తో కలిసి కల్తీ మద్యం తయారీ చేస్తున్నాడు. ఇందుకోసం పరవాడలో అద్దెకు ఇంటిని తీసుకున్నారు. ఆ ఇంటిని స్థావరంగా చేసుకుని ఏసీ బ్లాక్ బ్రాండ్ కల్తీ మద్యం తయారు చేసి అచ్యుతాపురం సహా పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ నెల 2వ తేదీ బుధవారం సాయంత్రం అచ్యుతాపురంలో రుత్తల రాము అనే వ్యక్తిపై అనుమానంతో అతని ఇంటి వద్ద తనిఖీ చేయగా 5 లీటర్ల కల్తీ మద్యం క్యాన్లు పట్టుబడ్డాయి. తర్వాత అతడ్ని విచారించగా పరవాడలో ఒక ఇంటిలో కల్తీ మద్యం తయారు చేస్తున్నట్టు తెలుసుకుని అక్కడకు వెళ్లిన ఎకై ్సజ్ పోలీసులు స్పిరిట్‌తో మద్యం తయారు చేస్తున్నట్టు గుర్తించారు.
బెల్టు షాపులకు చాటుమాటున సరఫరా

పరవాడ కేంద్రంగా కల్తీ మద్యం

పరవాడ కేంద్రంగా కల్తీ మద్యం