
జపాన్ బృందం పర్యటన
స్టీల్‌ప్లాంట్‌కు కేటాయించిన భూముల పరిశీలన
నక్కపల్లి: ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా లిమిటెడ్‌కు చెందిన జపాన్ ప్రతినిధుల బృందం గురువారం నక్కపల్లి మండలంలో పర్యటించింది. స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుకు భూములు కేటాయించిన రాజయ్యపేట, బోయపాడు, డీఎల్ పురం, అమలాపురం, తదితర గ్రామాలను ఈ బృంద సభ్యులు పరిశీలించారు. తమ ఉత్పత్తులు, ముడిసరుకు ఎగుమతి, దిగుమతుల కోసం క్యాప్టివ్ పోర్టు నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసి, ఇటీవల ప్రభుత్వం కేటాయించిన భూములను కంపెనీ ప్రతినిధుల బృందం పరిశీలించి అక్కడ భౌగోళిక పరిస్థితులను తెలుసుకున్నారు. ఆఏపీఐఐసీ స్టీల్‌ప్లాంట్, బల్క్ డ్రగ్ పార్క్ కోసం చేపట్టిన మౌలిక సదుపాయాలు, రోడ్ల నిర్మాణపు పనులను సైతం ఈ బృందం సభ్యులు పరిశీలించారు. రాజయ్యపేట, బోయపాడు తీరప్రాంతాలకు వెళ్లి పోర్టు నిర్మించే ప్రదేశాలను కూడా పరిశీలించినట్లు తహసీల్దార్ నర్సింహమూర్తి తెలిపారు. వీరి వెంట సీఐ కుమారస్వామి, ఏపీఐఐసీ, రెవెన్యూ అధికారులు ఉన్నారు.