ఎస్.రాయవరం: స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో నూతన ఎంపీపీగా బాధ్యతలు చేపట్టిన వైఎస్సార్‌సీపీ మండలాధ్యక్షుడు బొలిశెట్టి గోవిందరావుకు పార్టీ నాయకులు గురువారం శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీపీ కేసుబోయిన వెంకటలక్ష్మి గత నెల 6న వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఎంపీపీ ఎన్నిక జరిగే వరకు వైస్ ఎంపీపీ బొలిశెట్టి గోవిందరావుకు ఆ బాధ్యతలు అప్పగిస్తున్నట్టు ఎంపీడీవో సత్యనారాయణ తెలిపారు. మాజీ ఎంపీపీ బొలిశెట్టి శారదాకుమారి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మధువర్మ, జిల్లా కమిటీ సభ్యుడు కొణతాల శ్రీనివాసరావు, యూత్ అధ్యక్షుడు నల్లపరాజు వెంకటరాజు, సర్పంచ్‌లు కర్రి సత్యనారాయణ, దూళి శ్రీనుబాబు, మైలపల్లి శ్రీనివాసరావు, శానాపతి శ్రీరాములు, మల్లే లోవరాజు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.