
ప్రజల పక్షాన నిలిచేది జగన్ ఒక్కరే
● ఒక వైపు మొనగాడు.. మరో వైపు మోసగాళ్లు
● వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు
● బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ పేరిట నూతన కార్యక్రమానికి శ్రీకారం
● క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా ‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’ డౌన్‌లోడ్
● పార్టీ జిల్లా అధ్యక్షుడు విశ్వేశ్వరరాజు
అధ్యక్షతన విసృతస్థాయి సమావేశం
పాడేరు: రాష్ట్రంలో ప్రస్తుతం మోసగాళ్లంతా ఒకవైపు ఉంటే మొనగాడైన వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కరే ప్రజల పక్షాన ఉంటూ వారికి అండగా నిలుస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. జిల్లా కేంద్రమైన పాడేరు పట్టణంలోని వీఆర్ కల్యాణ మండపంలో శుక్రవారం పార్టీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్య్సరాస విశ్వేశ్వరరాజు బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ, క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో డౌన్‌లోడ్‌కు సంబంధించి విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లూరి జయంతి రోజున వైఎస్సార్‌సీపీ జిల్లా స్థాయి సమావేశం నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కాపీకొట్టిన కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ఏ ఒక్క పథకాన్ని సక్రమంగా అమలు చేయలేకపోయిందన్నారు. గత ప్రభుత్వం వ్యవసాయ సీజన్ సమయంలో ఏడాదికి సుమారు 53 లక్షల మందికి రైతు భరోసా అమలు చేసి మేలు చేస్తే కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో పైసా కూడా రైతులకు
మిగతా 8వ పేజీలో