
ఆర్టీసీ ఉద్యోగులపై సవతి తల్లి ప్రేమ
పాడేరు రూరల్: ఆర్టీసీ ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగుల సంఘ జిల్లా కార్యదర్శి చందు విమర్శించారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం స్థానిక ఆర్టీసీ డిపో వద్ద భోజన విరామ సమయంలో ఉద్యోగులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న పదోన్నతులను అమలు చేయకుండా కాలయాపన చేస్తుండ టం సరికాదన్నారు. పదోన్నతుల కోసం ఎదురు చూస్తూ వందల సంఖ్యలో ఉద్యోగులు పదవీ విరమణ పొంది తీవ్ర నష్టపోతున్నరన్నారు. 12వ పీఆర్సీ 2023 జూన్ నుంచి అమలు జరగాల్సి ఉండ గా ఇంతవరకు దీనికి సంబంధించిన కమిషన్ ఏర్పాటుచేయలేదని ఆరోపించారు. వెంటనే కమిషన్ వేసి ఐఆర్ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎలక్ట్రికల్ బస్సులకు ఆర్టీసీ ఉద్యోగులు వ్యతిరేకం కాదని వాటిని ఆర్టీసీ సంస్థ కొనుగోలు చేసి నడపాలన్నారు. ఉద్యోగులకు నెల వారీ రూ.225 కోత విధిస్తున్నా హెల్త్ స్కీమ్ వర్తించ డం లేదన్నారు. సక్రమంగా వైద్యం అందక ఇప్పటి వరకు 350 మంది ఉద్యోగులు వివిధ వ్యాధుల బారిన పడి మృతి చెందారన్నారు. పెండింగ్‌లో ఉన్న డీఏను తక్షణం చెల్లించాలన్నారు. ఉచిత బస్సు స్కీమ్ విజయవంతం కావాలంటే 2,500 బస్సులు అవసరం ఉండగా 10వేల మంది సిబ్బందిని నియమించాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్ర మంలో ఉద్యోగుల సంఘ ప్రతినిధులు వీహెచ్‌రావు, కేవీనాయుడు, విజయ్, నాగ్రేంద్ర, వీవీఆర్ మూర్తి, ఎంవీ బాబు, కుమారి, పూర్ణమ్మ పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ఆ సంఘ జిల్లా కార్యదర్శి చందు విమర్శ