
అల్లూరి ఆశయ సాధనకు పాటుపడాలి
మునగపాక: మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడా లని అరకు ఎంపీ జి.తనూజరాణి పిలుపునిచ్చారు. అల్లూరి జయంతిలో భాగంగా శుక్రవారం స్థానిక బొడ్డేడ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన అల్లూరి చిత్రపటానికి వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డేడ ప్రసాద్ తో కలిసి ఆమె పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బ్రిటిష్ పాలకుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన అల్లూరి పోరాటం నేటికీ స్ఫూర్తిదాయకమన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం అల్లూరి చూపిన పోరాట ప్రతిభ మార్గదర్శకం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు దిమ్మల అప్పారావు, బొడ్డేడ శ్రీనివాసరావు, భీశెట్టి గంగప్పలనాయుడు, మాజీ వైస్ ఎంపీపీ దొడ్డి వరహా సత్యనారాయణ, పార్టీ నేతలు దాసరి అప్పారావు, నరాలశెట్టి సూర్యనారాయణ, పిన్నమ రాజు రవీంద్రరాజు, ఆడారి రమణబాబు, జేసీబీ వెంకట్, కన్నుంనాయుడు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
అరకు ఎంపీ తనూజరాణి పిలుపు