
అల్లూరి స్ఫూర్తితో జిల్లా అభివృద్ధి
సాక్షి,పాడేరు: భారత స్వాతంత్య్రం కోసం పోరాడిన యోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో జిల్లా అభివృద్ధికి కృషిచేస్తున్నామని కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ అన్నారు. జయంతి సందర్భంగా కలెక్టరేట్‌లో స్వర్గీయ అల్లూరి చిత్రపటానికి కలెక్టర్‌తో పాటు జేసీ డాక్టర్ అభిషేక్‌గౌడ, ఇతర అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్య్ర ఉద్యమంతో పాటు,గిరిజనుల పక్షాన అలుపెరగని పోరాటాలు చేసి, ఉద్యమంలోనే ప్రాణాలు విడిచిన మహనీయుడు అల్లూరి పేరుతో జిల్లా ఏర్పాటు కావడం సంతోషంగా ఉందన్నారు. అల్లూరి పోరాటం,జీవిత చరిత్రపై భావితరాల పిల్లలకు అవగాహన కల్పించాలన్నారు. అలాగే పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు పలు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. కళాకారుడు వడ్డే భాస్కరరావు అల్లూరి చరిత్రపై గీతాలు ఆలపించారు. వీరందరినీ కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో సబ్‌కలెక్టర్ సౌర్యమన్‌పటేల్, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, డీఆర్వో పద్మలత, డ్వామా పీడీ విద్యాసాగర్, ఎంపీపీ రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ ఘన నివాళి : స్వాతంత్య్ర పోరాట యోధుడు అల్లూరి విగ్రహానికి ఎస్పీ అమిత్ బర్దర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎస్పీ కార్యాలయంలో అల్లూరి విగ్రహం వద్ద వేడుక నిర్వహించారు. స్వాతంత్య్ర పోరాటంలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుడు అల్లూరి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ సహబాజ్ అహ్మద్, ఇన్‌స్పెక్టర్లు అప్పలనాయుడు, సంజీవరావు, రాము, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
చింతపల్లి: స్థానిక ఆర్‌ఏఆర్‌ఎస్‌లో అల్లూరి జయంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి ఏడీఆర్ డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.బాల హుస్సేన్‌రెడ్డి, శాస్త్రవేత్తలు డాక్టర్ డి వెంకటేష్‌బాబు,ఽబీఎన్ సందీప్ నాయక్ తదితరులు నివాళులర్పించారు.
కలెక్టర్ దినేష్‌కుమార్
ఘనంగా జయంతి

అల్లూరి స్ఫూర్తితో జిల్లా అభివృద్ధి

అల్లూరి స్ఫూర్తితో జిల్లా అభివృద్ధి