
విద్యుదాఘాతంతోయువకుడి మృతి
చింతూరు: వాటర్ హీటర్ తీస్తున్న క్రమంలో విద్యుత్‌షాక్‌కు గురై యువకుడు మృతిచెందిన సంఘటన చింతూరు మండలం వంకగూడెంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మడివి కృష్ణ(24) స్నానం చేసేందుకు ఇంటి వెనుకభాగంలో బకెట్లోని నీటిలో వాటర్‌హీటర్ ఉంచాడు. నీరు వేడెక్కిన అనంతరం దానిని తీసేక్రమంలో విద్యుత్‌షాక్ తగలడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. కాగా జ్వరంతో ఇంట్లో పడుకునివున్న అతని తల్లి రాత్రి ఈ విషయాన్ని గమనించలేదు. ఆదివారం ఉదయం ఇంటి వెనుక చూడగా హీటర్ చేతితో పట్టుకుని నిర్జీవంగా పడిఉన్న కన్నకొడుకుని చూసి తీవ్రంగా రోదించింది.