
లోతట్టు ప్రాంతాలు జలమయం
హుకుంపేట: మండలంలో ఆదివారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో లోట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మండల కేంద్రం నుంచి అడ్డుమండ ప్రధాన రహదారిలో చీడిపుట్టు వద్ద వంతెన పైనుంచి వరద నీరు పొంగి ప్రవహించింది. దీంతో ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. అడ్డుమండ, జీకేమండ పంచాయతీల ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
డుంబ్రిగుడ: మండలంలోని శనివారం రాత్రి నుంచి చినుకులతో ప్రారంభమైన వర్షం ఆదివారం ఉదయం 4 గంటల నుంచి 9 గంటల వరకు ఏకధాటిగా కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. డ్రైనేజీల్లో భారీగా వరదనీరు చేరింది. వర్షాలు అనుకూలంగా ఉండటంతో రైతులు ఖరీఫ్ వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు.
ఉధృతంగా చాపరాయి గెడ్డ
ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో చాపరాయి గెడ్డ పొంగింది. దీంతో పర్యాటకులు గెడ్డలో దిగేందుకు సాహసించలేదు. ముఖద్వారం వద్ద నుంచి వీక్షించి వెళ్లిపోయారు.
అంతర్ రాష్ట్ర రహదారిలో కూలిన చెట్టు
గూడెంకొత్తవీధి: భారీ వర్షాలకు అంతర్ రాష్ట్ర రహదారిలో ఆర్‌వీనగర్–గూడెంకొత్తవీధి మధ్యలో ఆదివారం ఉదయం భారీ వృక్షం కూలిపోయింది. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ అప్పలసూరి జేసీబీతో చెట్టును పక్కకు తొలగించారు. కూలీలతో చెట్ల కొమ్మలను నరికించి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చేశారు.
డుంబ్రిగుడ ప్రాంతంలోని డ్రైనేజీలో చేరిన వరద నీరు

లోతట్టు ప్రాంతాలు జలమయం

లోతట్టు ప్రాంతాలు జలమయం

లోతట్టు ప్రాంతాలు జలమయం