విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
ఆదిలాబాద్‌టౌన్: విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌వీ శ్రీకాంత్ అన్నారు. యూనియన్ జిల్లా మహాసభలను జిల్లా కేంద్రంలోని కుమురంభీం భవన్‌లో మంగళవారం నిర్వహించారు. ముందుగా జెండా ఆవిష్కరించి, అమరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఫీజురీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌పై అందక పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర నాయకులు వెంకటేశ్, ఐఎన్‌టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట నారాయణ, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు హరీశ్, గణేశ్, పీఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కళావతి, జిల్లా ఉపాధ్యక్షురాలు దీపలక్ష్మి, దత్తాత్రి, నగేందర్ తదితరులు పాల్గొన్నారు.


