రిమ్స్ ఎదుట కార్మికుల నిరసన
ఆదిలాబాద్‌టౌన్: సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రిమ్స్ కార్మికులు మంగళవారం రిమ్స్ ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కమిటీ సభ్యు డు రాములు మాట్లాడుతూ, రిమ్స్‌లో ఔట్‌సో ర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం రూ.26వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రతీ కార్మికుడికి 5వ తేదీ లోగా వేతనాలు చెల్లించాలన్నారు. సీనియారిటీ ప్రకారం పేషెంట్‌కేర్ పదోన్నతి ఇవ్వాలని, లేనిపక్షంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో అనుసూయ, రమ పాల్గొన్నారు.


