డీసీసీ అధ్యక్షుడిగా నరేశ్‌జాదవ్ బాధ్యతలు
కై లాస్‌నగర్: జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి(డీసీసీ)గా నరేష్ జాదవ్ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన డీసీసీ అధ్యక్షుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. వారి చేతుల మీదుగా నియామక పత్రం అందుకుని బాధ్యతలు చేపట్టారు. జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం, పార్టీ ప్రత్యేక చొరవ చూపాలని సీఎం, పీసీసీ అధ్యక్షుడిని కోరినట్లుగా ఆయన పేర్కొన్నారు.


