చేసింది చెప్పేందుకే ‘సంబరాలు’
కై లాస్‌నగర్: రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజాప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజ లకు చెప్పేందుకే విజయోత్సవ సంబరాలు నిర్వహిస్తున్నామని జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఈ నెల 4న పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగసభ కోసం చేపట్టిన ఏర్పాట్లను మంగళవారం ఆయన పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆదిలాబాద్ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధమైందన్నారు. రూ.500 కోట్లతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు చేయనున్నట్లు తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ గత పదేళ్లలో రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారని మండిపడ్డారు. వాటికి నెలనెలా వడ్డి చెల్లిస్తూనే తమ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని కొనసాగిస్తుందన్నారు. రైతు భరోసా, రుణమాఫీ, సన్నబియ్యం, యువతకు ఉద్యోగాలు, ఉచిత కరెంట్, రూ. 500లకే గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సుప్రయాణం వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను రెండేళ్ల ప్రజా పాలనలో అమలు చేశామని తెలిపారు. ఈ పనులను ప్రజలకు తెలిపేందుకే ప్రజాపాలన విజయోత్సవాలు అని అన్నారు. రైజింగ్ తెలంగాణ నంబర్‌వన్–2047 లక్ష్యంగా ముందకు సాగుతున్నామని వెల్లడించారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి సీఎం సభను జయప్రదం చేయాలని కోరారు. ఇందులో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి, మాజీ ఎంపీ సోయం బాపూరావు, ఆదిలాబాద్, బోథ్, ఆసిఫాబాద్, నిర్మల్ అసెంబ్లీ ఇన్‌చార్జీలు కంది శ్రీనివాసరెడ్డి, ఆడె గజేందర్, శ్యాంనాయక్ , శ్రీహరిరావు, మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్‌ఖాన్, గోక గణేశ్‌రెడ్డి, బోరంచు శ్రీకాంత్‌రెడ్డి, గండ్రత్ సుజాత పాల్గొన్నారు.
కంది క్యాంపు కార్యాలయంలో సమీక్ష
పట్టణంలోని కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయాన్ని మంత్రి సందర్శించారు. పార్టీ శ్రేణులతో సమీక్ష నిర్వహించారు. సీఎం సభను జయప్రదం చే యడంతో పాటు రానున్న గ్రామ పంచాయతీతో పాటు పరిషత్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అనుసరి ంచాల్సిన కార్యాచరణపై వారికి దిశానిర్దేశం చేశారు.
సీఎం సభ ఏర్పాట్ల పరిశీలన
సీఎం జిల్లా పర్యటన నేపథ్యంలో పట ణంలోని ఇందిరాప్రియదర్శిని స్టేడియంలో చేపట్టిన ఏర్పాట్లను కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మ హాజన్‌తో కలిసి పరిశీలించారు. మంగళవారం సాయంత్రం మైదా నాన్ని సందర్శించారు. నిర్వాహకులు, అధికారులతో చర్చించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని వా రికి సూచించారు వారి వెంట అదనపు కలెక్టర్ ఎస్. రాజేశ్వర్, ఆర్‌అండ్‌బీ ఈఈ నర్సయ్య తదితరులున్నారు.


