జాతీయస్థాయి పోటీలకు ఇద్దరు కానిస్టేబుళ్ల ఎంపిక
ఆదిలాబాద్: జిల్లాకు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు జాతీయస్థాయి పోలీస్ హాకీ పోటీలకు ఎంపికయ్యారు. గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కో ట్‌లో ఈనెల 4నుంచి 15వరకు నిర్వహించను న్న 74వ ఆలిండియా పోలీస్ హాకీ చాంపియన్‌షిప్ పోటీల్లో వీరు పాల్గొననున్నారు. జిల్లాకు చెందిన ఏఆర్ స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ అశోక్‌కుమార్, సెకండ్ బెటాలియన్ కానిస్టేబుల్ నర్సింగ్ ప్రాతినిధ్యం వహించనున్నట్లు హాకీ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బాలూరి గోవర్ధన్‌రెడ్డి, పార్థసారథి తెలిపారు. జిల్లాకు చెందిన పలువురు సీనియర్ హాకీ క్రీడాకారులు అభినందనలు తెలిపారు.
జాతీయస్థాయి పోటీలకు ఇద్దరు కానిస్టేబుళ్ల ఎంపిక


