breaking news
School of Planning and Architecture
-
చదివింపులు 10%
న్యూఢిల్లీ: విద్యారంగానికి 2019–20 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం రూ.93,847.64 కోట్లు కేటాయించింది. ఇది గత బడ్జెట్ కంటే 10 శాతం అధికం. ఈ బడ్జెట్లో ఉన్నత విద్యకు రూ.37,461.01 కోట్లు, పాఠశాల విద్యకు రూ. 56,386.63 కోట్లు కేటాయించింది. గత ఏడాది రూ.85,010 కోట్లు విద్యారంగానికి కేటాయించారు. వైద్య సంస్థలతోపాటు ప్రధాన విద్యాసంస్థల్లో పరిశోధనల రంగంలో పెట్టుబడులు, సంబంధిత మౌలిక వసతుల కోసం ‘రివైటలైజింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సిస్టమ్స్ ఇన్ ఎడ్యుకేషన్ (రైజ్)’అనే కొత్త పథకాన్ని తాజా బడ్జెట్లో ప్రతిపాదించారు. ఇందులో 2022నాటికల్లా రూ. లక్ష కోట్లు పెట్టుబడిగా పెడతారు. కొత్తగా ఎస్పీఏలు.. ►‘స్కూల్స్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (ఎస్పీఏ)’పేరుతో రెండు పూర్తిస్థాయి సంస్థలను ఏర్పాటుచేయాలని ప్రతిపాదించారు. దీనికి అదనంగా ఐఐటీ, ఎన్ఐటీల్లో 18 ఎస్పీఏలను స్వయంప్రతిపత్తి గల సంస్థలుగా ఏర్పాటుచేస్తారు. దీనికోసం ఐఐటీ/ఎన్ఐటీల డైరెక్టర్లు, రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు ప్రతిపాదనలను సమర్పించాలని గోయల్ కోరారు. ►ఈసారి ప్రభుత్వం పరిశోధనలు, ఆవిష్కరణల కోసం రూ.608.87 కోట్లు కేటాయించింది. ఇది గత బడ్జెట్లో రూ.350.23 కోట్లుగా ఉంది. ►విద్యలో నాణ్యత పెరగాలంటే సాంకేతికతను వినియోగించుకుంటూ ముందుకెళ్లాలని, ‘బ్లాక్‌బోర్డు’నుంచి ‘డిజిటల్ బోర్డుకు’మారాలని చెప్పారు. టీచర్లు అధునాతన సాంకేతికత ఆధారంగా పరిష్కారాలు సాధించేందుకు, వారికి డిజిటల్ సౌకర్యాలు కల్పించేందుకు ‘దిక్షా’ను అభివృద్ధి చేశామన్నారు. -
దరఖాస్తు చేశారా?
* భోపాల్‌లోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్(ఎస్పీఏ)డాక్టోరల్ అండ్ పీజీ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశాలకు దరఖాస్తు చేయడానికి చివరి తేది: మే 16 * ఎన్హెచ్ఎంలో భాగంగా కరీంనగర్ జిల్లా ప్రాజెక్ట్‌లోని మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్, ఏఎన్ఎం పోస్టులకు దరఖాస్తు చేయడానికి చివరి తేది: మే 18 * ఈఎస్ఐసీ నాచారం (హైదరాబాద్)లో వివిధ విభాగాల్లో సీనియర్ రెసిడెంట్స్ (అల్లోపతి) పోస్టుల దరఖాస్తుకు చివరి తేది: జూన్ 29 -
దరఖాస్తు చేశారా?
భోపాల్‌లోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (ఎస్పీఏ) డాక్టోరల్ అండ్ పీజీ ప్రోగ్రామ్స్‌లలో ప్రవేశానికి దరఖాస్తుకు చివరి తేది: మే 16 న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ సీనియర్ రెసిడెంట్స్/ సీనియర్ డిమానుస్ట్రేటర్స్ పోస్టుల దరఖాస్తుకు చివరి తేది: మే 29 ఉత్తరాఖండ్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో నాన్-టీచింగ్ పోస్టుల దరఖాస్తుకు చివరి తేది: మే 31 -
ఢిల్లీలో కరీంనగర్ జిల్లా విద్యార్థి ఆత్మహత్య
కరీంనగర్ జిల్లా సారంగాపూర్ మండలం నర్సింహులపల్లె గ్రామానికి చెందిన విద్యార్థి చెర్పూరి దినేష్ యూదవ్(22) ఢిల్లీలో ఆత్మహత్య చేసుకున్నాడు. జిల్లాకు చెందిన రవికుమార్, మాధవిల రెండో కుమారుడైన దినేష్ ఢిల్లీలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కాలేజీలో బీఆర్క్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అక్కడి హాస్టల్లో ఉంటూ కాలేజీకి వెళ్తున్నాడు. ఆదివారం సాయంత్రం హాస్టల్‌కు వచ్చిన దినేష్ ఎవరూలేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. ఆత్మహత్య విషయం తెలిసిన వెంటనే దినేష్ తల్లితండ్రులతో పాటు ఇతర కుటుంబసభ్యులు సోమవారం ఢిల్లీ వెళ్లారు. ఇటీవల జరిగిన పరీక్షల్లో వెనకబడిపోవడంతో మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. దినేష్ మొదటి నుంచి చదువులో చురుకైన విద్యార్థి అని బంధువులు తెలిపారు. టెన్త్, ఇంటర్లో టాప్ మార్కులు సాధించాడన్నారు. ఎనిమిదవ తరగతి చదువుతున్న సమయంలోనే డెహ్రడూన్‌లో ఆర్ఐఎంసీ పోటీ పరీక్షలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్కరికే అవకాశం ఉండగా, దీనిని దినేష్ సాధించినట్లు బంధువులు తెలిపారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ నిర్వహించిన పరీక్షల్లో రెండు సార్లు మూడో ర్యాంక్ సాధించాడు. అయితే రెండుసార్లు ఇంటర్వ్యూలో వెనకబడిపోవడంతో బీఈ ఆర్కిటెక్చర్ చదువుతున్నాడు. -
300 ఎకరాల్లోనే అద్భుత రాజధాని
విజయవాడ బ్యూరో: రాజధాని మాస్టర్‌ప్లాన్ డిజైన్ కోసం ప్రభుత్వం సింగపూర్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటే.. మరోవైపు మన విద్యార్థులు అద్భుతమైన డిజైన్లు రూపొందించి అందరినీ విస్మయంలో ముంచెత్తారు. రాజధాని నిర్మాణం పేరిట ప్రభుత్వం 33 వేల ఎకరాల భూ సమీకరణకు నోటిఫికేషన్లు జారీ చేసింది. విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (స్పా) విద్యార్థులు కేవలం 250 నుంచి 300 ఎకరాల్లో రాజధానికి అవసరమైన సచివాలయం, అసెంబ్లీ, రాజ్‌భవన్ ఇతర కీలకమైన పరిపాలనా భవనాలను అత్యంత ఆధునికంగా ఎలా నిర్మించవచ్చో తమ డిజైన్లలో చూపించారు. పలుదేశాల్లోని ఆధునిక నగరాల నిర్మాణ రీతులు, సాంకేతికతను అధ్యయనం చేసి మరీ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పక్కాగా ఈ డిజైన్లు తయారు చేశారు. ఆరు నెలల క్రితం 'స్పా' మేనేజ్మెంట్ బీఆర్క్ (బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్) ఆఖరి సంవత్సరం విద్యార్థులకు అకడమిక్ ప్రాజెక్టు కింద రాజధాని డిజైన్లు తయారు చేయాలని సూచించింది. 72 మంది విద్యార్థులను 16 గ్రూపులుగా విభజించి ఈ మూడు ప్రదేశాలను వారికి కేటాయించింది. ఆ గ్రూపులు రూపొందించిన డిజైన్లను సెలక్షన్ కమిటీ పరిశీలించి వాటిలో ఎనిమిదింటిని వార్షికోత్సవంలో ప్రదర్శించడానికి ఎంపిక చేసింది. అందులో నాలుగు మంగళగిరి ప్రదేశానివి కాగా, మూడు ఆగిరిపల్లి, ఒకటి నాగార్జున వర్సిటీ ప్రాంతానికి చెందినవి. వాటిలో తెలుగుదనం ఉట్టి పడేలా, రాష్ట్ర ఖ్యాతి తెలిసేలా ఆధునిక టెక్నాలజీతో మంగళగిరి ప్రదేశం కోసం రూపొందించిన ఒక డిజైన్ సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్‌ను అమితంగా ఆకర్షించింది. ఈ నమూనాను మరింత అభివృద్ధి చేసి తనకివ్వాలని శ్రీకాంత్ స్పా మేనేజ్మెంట్ను కోరడం విశేషం. మరో బృందం సిడ్నీ ఒపెరా హౌస్ తరహాలో రెండు కొండల మధ్య మట్టిలోంచి మొలకెత్తే మొక్కల ఆకారంలో భవనాలకు రూపకల్పన చేసింది. -
అభివృద్ధే టార్గెట్
సాక్షి, విజయవాడ : కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ, పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ఆదివారం నగరంలో సుడిగాలి పర్యటన చేశారు. విజయవాడలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులపై ఆయన దృష్టి సారించారు. స్థానిక పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో రూ.152 కోట్లతో నిర్మిస్తున్న స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (స్పా) భవన సముదాయాలను ఆయన పరిశీలించారు. వేగవంతంతో, నైపుణ్యంతో, నిర్ధిష్ట సమయంలో నిర్మాణాలను పూర్తి చేయాలని అన్నారు. నాణ్యత విషయం ఏ మాత్రం రాజీ పడవద్దని అధికారులను హెచ్చరించారు. జమ్మి చెట్టు సెంటర్లో హడ్కో ప్రాంతీయ కార్యాలయాన్ని ఆయన ప్రారంభిస్తూ దేశంలోని అందరికి 2022 నాటికి సొంత ఇల్లు ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు. హోటల్పార్చున్ మురళీపార్కులో జాతీయ జలరవాణా అభివృద్ధిపై 13 జిల్లాల ఎంపీలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర ఉపరితల శాఖ మంత్రి పొన్ను రాధాకృష్ణ పాల్గొన్నారు. వెంకయ్యనాయుడు మాట్లాడుతూ కాకినాడ నుంచి పుదుచ్చేరి వరకు జలరవాణాకు సర్వేలు జరుగుతున్నాయని, పార్లమెంట్లోఆమోదం పొందేందుకు ఆంధ్రప్రదేశ్ ఎంపీలంతా సంఘటితంగా కృషి చేయాలన్నారు. ఆకాశవాణి కేంద్రంలో జాతీయపతాకం రూపశిల్పి, స్వాతంత్ర సమరయోధుడు పింగళి వెంకయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ దేశసేవకు అంకితమైన మహానీయుల స్ఫూర్తితో శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. సాయంత్రం బుక్ ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన పుస్తకప్రియుల పాదయాత్ర ముగింపు సభలో పాల్గొని తెలుగులో మంచి రచయితలు ఉన్నారని, వాటి రచనలు ఇతర భాషల్లోకి అనువదించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆదిశగా తాను కృషి చేస్తానని అన్నారు. బందరు ఎంపీ కొనకళ్ల నారాయణ, విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్, స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నిర్వాహకులు ఎన్.శ్రీధరన్ మాట్లాడారు. -
ఉద్యోగాలు
ఎస్పీఏ - విజయవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (ఎస్పీఏ)-విజయవాడ.. వివిధ అడ్హాక్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ప్రొఫెసర్ విభాగాలు: కన్జర్వేషన్, అర్బన్ డిజైన్, ల్యాండ్‌స్కేప్ ఆర్కిటెక్చర్, ఎనర్జీ స్టడీస్ ఇన్ బిల్డింగ్స్, సస్టైనబుల్ ఆర్కిటెక్చర్. అసోసియేట్ ప్రొఫెసర్ విభాగాలు: కన్జర్వేషన్, అర్బన్ డిజైన్, ల్యాండ్‌స్కేప్ ఆర్కిటెక్చర్, ఎనర్జీ స్టడీస్ ఇన్ బిల్డింగ్స్, సస్టైయిన్బుల్ ఆర్కిటెక్చర్. అసోసియేట్ ప్రొఫెసర్ విభాగాలు: స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, డిజైన్ అండ్ టెక్ ఆర్సీసీ, స్టీల్ అండ్ టెన్సిల్ అండ్ ప్రీ ఫ్యాబ్రికేటెడ్ స్ట్రక్చర్. అసిస్టెంట్ ప్రొఫెసర్ విభాగాలు: బీఈ/బీటెక్(సివిల్).. స్ట్రక్చరల్ డిజైన్ ఆఫ్ బిల్డింగ్స్ అండ్ ల్యాబ్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్స్ లేదా ఎంటెక్ (స్ట్రక్చర్స్)... డిజైన్ అండ్ టీచ్ ఆర్సీసీ, స్టీల్ అండ్ టెన్సిల్ అండ్ ప్రీ ఫ్యాబ్రికేటెడ్ స్ట్రక్చర్. అసిస్టెంట్ ప్రొఫెసర్ విభాగాలు: కన్జర్వేషన్, ల్యాండ్‌స్కేప్ ఆర్కిటెక్చర్, అర్బన్ డిజైన్, సస్టైయిన్బుల్ ఆర్కిటెక్చర్, ఎనర్జీ స్టడీస్ ఇన్ బిల్డింగ్స్. దరఖాస్తు విధానం: అర్హులైన అభ్యర్థులు తమ రెజ్యూమ్‌ను ట్ఛఛిటఠజ్టీఝ్ఛ్టఃటఞ్చఠి. ్చఛి.జీ కు పంపొచ్చు. దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 10 వెబ్సైట్: www.spav.ac.in -
కెరీర్ నిర్మాణానికి.. ఆర్కిటెక్చర్!
ఆకాశహర్మ్యాలు.. అందమైన భవంతులు.. ప్రఖ్యాత కట్టడాలు.. చరిత్ర గతిని మార్చిన భారీవంతెనలు, డ్యామ్స్‌కు చిరునామా.. ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్! నిర్మాణాలనుప్రణాళికాబద్ధంగా.. మానవ అవసరాలకు అనుగుణంగా.. ఆకర్షణీయమైన రూపునిచ్చి నిర్మించడంలో శిక్షణనిచ్చే కోర్సు.. ఆర్కిటెక్చర్!! నాటి ఈజిప్టు పిరమిడ్ల నుంచి నేటి ఆధునిక డ్యామ్‌లు, విల్లాలు, అపార్ట్మెంట్స్ వరకూ.. ఎన్నో అద్భుత నిర్మాణాలకు రూపమిచ్చింది ఆర్కిటెక్చర్లే. వందల ఏళ్ల క్రితమే ఆవిష్కృతమైన ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్.. కాలానుగుణంగా రూపుమార్చుకుంటూ ఆధునికత సంతరించుకుంటోంది. కెరీర్ పరంగానూ నేటి యువతకు ఎన్నో అవకాశాలు అందిస్తోంది. ఉజ్వల కెరీర్‌కు బాటలు వేస్తున్న ఆర్కిటెక్చర్ కోర్సు, ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలపై ఈ వారం కవర్ స్టోరీ.. ఆర్కిటెక్చర్.. నిర్మాణాలకు అందమైన ఆకృతినిచ్చే విభాగం. కట్టడాలు, నిర్మాణాలకు సంబంధించి శాస్త్రీయ అవగాహనతోపాటు సాంకేతిక నైపుణ్యాలను అందించే కోర్సు.. ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్. ఈ కోర్సు పూర్తిచేసిన వారే ఆర్కిటెక్ట్‌లు. ప్రపంచీకరణ, ఆధునికీకరణల నేపథ్యంలో.. మౌలిక సదుపాయాల రంగం ముఖ్యంగా నిర్మాణరంగం శరవేగంగా పురోగతి సాధిస్తోంది. దీంతో ఆర్కిటెక్చర్ ఇంజనీర్లకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. అకడెమిక్ అర్హతలతోపాటు సృజనాత్మకత కీలకపాత్ర పోషించే ఈ విభాగంలో అడుగుపెడితే కలర్‌ఫుల్ కెరీర్ ఖాయం. డిమాండ్‌కు కారణాలివే ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్‌కు శతాబ్దాల చరిత్ర ఉన్నప్పటికీ.. గత దశాబ్ద కాలంగా ఈ విభాగానికి, నిపుణులకు భారీగా డిమాండ్ ఉంటోంది. మన దేశంలో గత దశాబ్ద కాలంలో రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాలు భారీగా విస్తరించాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ.. జాతీయ రహదారులు, భారీ ఆనకట్టలు, వంతెనల నిర్మాణాలు చేపడుతున్నాయి. వీటిని కూడా సదరు ప్రాంతీయ పరిస్థితులు, భౌగోళిక సామర్థ్యాలకు అనుగుణంగా నిర్మించాలంటే ఆర్కిటెక్ట్‌ల అవసరం తప్పనిసరి. అలాగే మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్, టాటా గ్రూప్ వంటి ప్రముఖ సంస్థలు కూడా నిర్మాణ రంగంలోకి ప్రధానంగా గ్రూప్ హౌసింగ్ నిర్మాణ విభాగంలో అడుగుపెడుతున్నాయి. దాంతో ఆయా అవసరాలకు అనువైన రీతిలో నిర్మాణాలు చేపట్టాలంటే.. నిపుణులైన ఆర్కిటెక్ట్‌ల అవసరం ఏర్పడుతోంది. ఈ రంగంలోని నిపుణులు, విద్యావేత్తల అభిప్రాయం ప్రకారం- మన దేశంలో ఏటా సుమారు పదివేల మంది ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణుల అవసరం ఉంది. కానీ సర్టిఫికెట్లు అందుకుంటున్న విద్యార్థులు రెండు వేల లోపే ఉంటున్నారు. అంటే.. మానవ వనరుల డిమాండ్-సప్లయ్ వ్యత్యాసం 80 నుంచి 85శాతం మధ్యలో ఉంది. రాయల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ చార్టర్డ్ సర్వేయర్స్ రూపొందించిన ‘రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ ప్రొఫెషనల్స్ ఇన్ ఇండియా బై 2020’ నివేదిక ప్రకారం.. భారత నిర్మాణ రంగ అవసరాలు, వనరుల దృష్ట్యా వచ్చే దశాబ్దంలో దాదాపు నాలుగు లక్షల మంది ఆర్కిటెక్ట్‌ల అవసరం ఉంటుంది. దీన్నిబట్టి రాబోయే రోజుల్లో ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ కోర్సు పూర్తిచేసుకున్న ప్రతి ఒక్కరికీ కొలువు ఖాయం అని చెప్పొచ్చు. బ్యాచిలర్ డిగ్రీ నుంచే కోర్సులు ప్రస్తుతం మన దేశంలో గ్రాడ్యుయేషన్ స్థాయిలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (బీఆర్క్) కోర్సు అందుబాటులో ఉంది. ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు మొదలు.. రాష్ట్ర స్థాయి యూనివర్సిటీలు సైతం బీఆర్క్ కోర్సును అందిస్తున్నాయి. ఎంపీసీ గ్రూప్‌తో ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన వారు ఈ కోర్సుకు అర్హులు. పీజీలో పలు స్పెషలైజేషన్లు ఉన్నత విద్య విషయానికి వస్తే.. పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్(ఎంఆర్క్) కోర్సులో చేరొచ్చు. ఈ విభాగంలో పీజీ స్థాయిలో పలు స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. అర్బన్ డిజైనింగ్, రీజనల్ ప్లానింగ్, బిల్డింగ్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్, ఆర్కిటెక్చరల్ కన్జర్వేషన్, ఇండస్ట్రియల్ డిజైన్, ల్యాండ్‌స్కేప్ ఆర్కిటెక్చర్, నావల్ ఆర్కిటెక్చర్ వంటి స్పెషలైజేషన్లను పలు ఇన్స్టిట్యూట్లు ఆఫర్ చేస్తున్నాయి. ప్రస్తుత అవసరాలను దృష్టిలో పెట్టుకుంటే.. అర్బన్ డిజైనింగ్, బిల్డింగ్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్, ల్యాండ్‌స్కేప్ ఆర్కిటెక్చర్ స్పెషలైజేషన్లకు డిమాండ్ ఉంది. ఇవే విభాగాల్లో పీహెచ్డీ చేసే అవకాశమూ ఉంది. ఇన్స్టిట్యూట్లు- అర్హతలు బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కోర్సులో ప్రవేశ నిబంధనలు వేర్వేరుగా ఉంటున్నాయి. ఐఐటీల్లో బీఆర్క్‌లో చేరాలనుకునే విద్యార్థులు జేఈఈ-మెయిన్‌లో రెండో పేపర్ (బీఆర్క్/బీప్లానింగ్)తోపాటు, జేఈఈ-అడ్వాన్స్‌డ్‌లో ఉత్తీర్ణత సాధించాలి. దీంతోపాటు ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్‌కు కూడా హాజరు కావాల్సి ఉంటుంది. ఈ ఏడాది ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్‌ను జూన్ 26న నిర్వహించనున్నారు. దీనికోసం అడ్వాన్స్డ్ తర్వాత జూన్ 20 నుంచి 24 తేదీల మధ్యలో అడ్వాన్స్డ్ వెబ్సైట్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీల్లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో ప్రవేశానికి జేఈఈ-మెయిన్స్ రెండో పేపర్లో ఉత్తీర్ణత సరి పోతుంది. నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్ ఆర్కిటెక్చర్లో దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఇన్స్టిట్యూట్లలో, రాష్ట స్థాయి యూనివర్సిటీలు-అనుబంధ కళాశాలల్లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష.. నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్ (నాటా). మన రాష్ట్రంలో ఈ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఎన్ఏఎఫ్ఏయూ) క్యాంపస్ కళాశాల సహా మొత్తం 15 కళాశాలల్లో ప్రవేశం పొందొచ్చు. పీజీ కోర్సుల్లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్(గేట్), ఆయా యూనివర్సిటీలు నిర్వహించే పీజీ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్‌లలో ర్యాంకు సాధించాలి. ఆర్కిటెక్చర్లో స్పెషల్.. PA ఆర్కిటెక్చర్ కోర్సులను అందించడంలో ప్రత్యేకతను సంతరించుకుంటున్న ఇన్స్టిట్యూట్... స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్. ఈ రంగంలో నిపుణుల అవసరాన్ని గుర్తించిన కేంద్ర ప్రభు త్వం.. ఐఐటీలు, ఎన్ఐటీలు మాదిరిగానే ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ కోసం ప్రత్యేకంగా స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్‌కు రూపకల్పన చేసింది. ప్రస్తుతం దేశంలో మూడు క్యాంపస్‌లు(న్యూఢిల్లీ, విజయవాడ, భోపాల్) ఉన్నాయి. వీటిలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్/ప్లానింగ్, పీజీ కోర్సులు, పీహెచ్డీ అందుబాటులో ఉన్నాయి. బ్యాచిలర్ కోర్సుల్లో సీట్లను జేఈఈ-మెయిన్ పేపర్-2లో ర్యాంకు ఆధారంగా నిర్వహించే సెంట్రలైజ్డ్ కౌన్సెలింగ్ ద్వారా; పీజీ కోర్సుల్లో సీట్లను గేట్ స్కోర్ ఆధారంగా సెంట్రలైజ్డ్ కౌన్సెలింగ్ ఫర్ ఎం.ప్లాన్/ఎం.ఆర్క్ (సీసీఎంటీ)ద్వారా భర్తీ చేస్తారు. SPA విజయవాడ పీజీ నోటిఫికేషన్ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ - విజయవాడ క్యాంపస్‌లో ఎన్విరాన్మెంటల్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్, అర్బన్ అండ్ రీజనల్ ప్లానింగ్, సస్టెయినబుల్ ఆర్కిటెక్చర్ స్పెషలైజేషన్లలో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ వెలువడింది. ఒక్కో స్పెషలైజేషన్‌లో 20 సీట్లు అందుబాటులో ఉన్నాయి. దీంతోపాటు పలు విభాగాల్లో పీహెచ్డీ ప్రోగ్రామ్‌లకు కూడా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎన్విరాన్మెంటల్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్, అర్బన్ అండ్ రీజనల్ ప్లానింగ్ పీజీ స్పెషలైజేషన్లలో మొత్తం సీట్లలో 50 శాతం సీట్లను సీసీఎంటీ ద్వారా భర్తీ చేస్తారు. మరో 50 శాతం సీట్లకు జాగ్రఫీ/ఎకనామిక్స్/సోషియాలజీల్లో 60 శాతం మార్కు లతో పీజీ ఉత్తీర్ణులు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. దరఖాస్తులకు చివరి తేదీ: మే 30, 2014 ఇంటర్వ్యూ, పరీక్ష తేదీ: జూలై 7-8, 2014 వెబ్సైట్: www.spav.ac.in అవకాశాలు.. హోదాలు ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్, పీజీ కోర్సులు పూర్తి చేసిన వారికి మంచి అవకాశాలు ఖాయం. ప్రారంభంలోనే ట్రైనీ ఆర్కిటెక్ట్ లేదా జూనియర్ ఆర్కిటెక్చర్ ఇంజనీర్‌గా నెలకు రూ.35 వేల నుంచి రూ.40 వేల వేతనం లభిస్తుంది. రెండు, మూడేళ్ల అనుభవంతో నెలకు రూ.60 వేల జీతం అందుకోవచ్చు. వీటితోపాటు ఈ రంగంలో సాఫ్ట్వేర్ నైపుణ్యాలు (క్యాడ్, క్యామ్ తదితర) సొంతం చేసుకుంటే అవకాశాలు, ఆదాయం ఇంకా ఎక్కువగా లభిస్తాయి. అంతేకాకుండా సొంతంగా కన్సల్టెన్సీ ఏర్పాటు చేసుకోవడం ద్వారా స్వయం ఉపాధి పొందొచ్చు. ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేసినవారికి ప్రైవేటు రంగంలో.. రియల్ ఎస్టేట్, నిర్మాణ సంస్థలు, ఆర్కిటెక్చర్ కన్సల్టెన్సీలు ముఖ్యమైన ఉపాధి వేదికలు. ప్రభు త్వ రంగంలో పురాతత్వ శాఖ, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, రైల్వేశాఖ, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అసోసియేషన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ ఎఫైర్స్ వంటి పలు విభాగాల్లో ఆర్కిటెక్చర్ ఇంజనీర్లుగా అవకాశాలు లభిస్తాయి. రాణించాలంటే ఈ నైపుణ్యాలు కావాలి ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ విభాగంలో రాణించి ఉన్నత స్థానాలు అందుకోవాలంటే.. సదరు అకడెమిక్ సర్టిఫికెట్‌తోపాటు స్వీయ లక్షణాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఈ క్రమంలో సృజనాత్మకత, పరిశీలన, విశ్లేషణ, మ్యాథమెటికల్ నైపుణ్యా లు, ఇంటర్ పర్సనల్ స్కిల్స్ అవసరం. ఇవి ఎంత ఎక్కువగా ఉంటే కెరీర్ అంత ఉన్నతంగా ఉంటుంది. సొంతంగా ప్రాక్టీస్ చేయాలనుకునే వారికి ఇంటర్‌పర్సనల్ స్కిల్స్ ఎంతో ప్రధానం. దేశంలో ప్రముఖ ఆర్కిటెక్చర్ ఇన్స్టిట్యూట్లు * స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (న్యూఢిల్లీ, * విజయవాడ, భోపాల్ క్యాంపస్‌లు) * జేఎన్ఏఎఫ్ఏయూ క్యాంపస్ కళాశాల-హైదరాబాద్ * ఎన్ఐటీ-పాట్నా * ఎన్ఐటీ-రాయ్‌పూర్ * సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ ప్లానింగ్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీ * ఎన్ఐటీ- కాలికట్ * విశ్వేశరాయ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- నాగ్‌పూర్ * ఎన్ఐటీ- తిరుచిరాపల్లి * ఐఐటీ-ఖరగ్‌పూర్, రూర్కీ ఆర్కిటెక్చర్ ఇన్స్టిట్యూట్లు, సీట్ల వివరాలకు వెబ్సైట్: www.coa.gov.in అద్భుత కెరీర్‌కు సోపానం దేశంలో పట్టణీకరణ పెరుగుతున్న నేపథ్యంలో.. కెరీర్‌పరంగా ఉజ్వల భవిష్యత్తును అందించే కోర్సు.. ఆర్కిటెక్చర్. ప్రస్తుత అవసరాల దృష్ట్యా వేల సంఖ్యలో ఆర్కిటెక్చర్ కోర్సు ఉత్తీర్ణుల అవసరముంది. ప్రస్తుతం మానవ వనరుల డిమాండ్-సప్లయ్ వ్యత్యాసం భారీగా ఉంది. దాంతో ఐఐటీలు, ఐఐఎంల మాదిరిగా మరిన్ని జాతీయస్థాయి ప్రాముఖ్యమున్న ఆర్కిటెక్చర్ కళాశాలలు ఏర్పాటుచేయాల్సిన ఆవశ్యకత ఉంది. విద్యార్థులు కళాశాలను ఎంపిక చేసుకునేముందు వాటి ట్రాక్ రికార్డ్‌ను పరిశీలించాలి. బోధన, శిక్షణ, మౌలిక సదుపాయాల గురించి తెలుసుకొని మంచి కళాశాలను ఎంచుకోవాలి. మిగతా ఇంజనీరింగ్ సబ్జెక్ట్లతో పోల్చితే ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ వినూత్నమైంది. అకడెమిక్ స్థాయిలోనే నైపుణ్యాలకు నగిషీలు దిద్దుకోవాలి. అప్పుడే చక్కటి భవిష్యత్తు సొంతమవుతుంది. వీటిని దృష్టిలో పెట్టుకునే స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్-విజయవాడ క్యాంపస్‌లో ప్రాక్టికల్స్‌కు పెద్దపీట వేసేలా బోధన సాగిస్తున్నాం. అంతేకాకుండా విద్యార్థులకు అంతర్జాతీయ నైపుణ్యాలు అందేవిధంగా విదేశీ యూనివర్సిటీలతో ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్స్‌కు కూడా రూపకల్పన చేశాం. ఈ విభాగంలో ఉన్నత విద్యకు కూడా ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. పరిశోధనలు చేయడం వల్ల మరిన్ని ఫలితాలు లభిస్తాయి. -ప్రొఫెసర్ ఎన్.శ్రీధరన్, డెరైక్టర్, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్-విజయవాడ