పొన్నూరు మున్సిపల్ సమావేశం రసాభాస
గుంటూరు : గుంటూరు జిల్లా పొన్నూరు మున్సిపల్ సమావేశం బుధవారం రసాభాసగా మారింది. మున్సిపల్ చైర్మన్ అభివృద్ధి కార్యక్రమాలపై తమకు ఎలాంటి సమాచారం అందించకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్ సీపీ సభ్యులు ఆరోపించారు. అందుకు నిరసనగా సమావేశం నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించి... మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. వైఎస్ఆర్ సీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మూడు సమావేశాలకు హాజరుకాకుండా సస్పెండ్ చేస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ వెల్లడించారు. దాంతో నన్ను అక్రమంగా సస్పెండ్ చేశారంటూ చైర్మన్ చాంబర్ ఎదుట డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ధర్నాకు దిగారు.