ఓవర్ ఎక్స్పోజ్ చేస్తున్నారు!
‘‘ప్రతి రోజు నేను నిద్ర లేచి పేపర్ చూడగానే ఏదో ఒక పేజీలో నా ఫొటో దర్శనమిస్తుంది. మొదట్లో చాలా ఆనందంగా ఉన్నా, రాను రాను ఈ విషయంలో చాలా అసహనంగా అనిపిస్తోంది. నా సినిమా కబుర్లతో పాటు నా వ్యక్తిగత విషయాలను ప్రతి రోజూ ఓ టాపిక్ చేస్తున్నారు. విరాట్ కొహ్లీతో నా అనుబంధం గురించి, అలాగే నేను ఫలానా విషయంలో తెగ బాధపడ్డానని, అప్పుడు సంతోషపడ్డానని ఇలా లేనిపోనివి ఊహించి రాసేస్తున్నారు. అందులో నిజం ఉన్నా లేకపోయినా సెలబ్రిటీలను చాలా ఓవర్ ఎక్స్పోజ్ చేస్తున్నారని నా అభిప్రాయం. కానీ ఈ విషయంలో మా అమ్మ చాలా సంతోషంగా ఉంది. పేపర్లో నా ఫొటో వస్తే ఇప్పటికీ మా అమ్మ తెగ సంబరపడిపోతుంది. ఎవరి బాధ వాళ్లది. ఏం చేస్తాం చెప్పండి!’’
- అనుష్క శర్మ