breaking news
The new ruling class
-
‘నలుగురి’తో నడిపిస్తారు
బీసీసీఐకి కొత్త పాలకవర్గం మాజీ ‘కాగ్’ వినోద్ రాయ్ నేతృత్వం నలుగురు సభ్యుల కమిటీలో ఏకైక క్రికెటర్‌గా డయానా ఎడుల్జీ సుప్రీం కోర్టు నిర్ణయం న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వ్యవహారాల పర్యవేక్షణ కోసం కొత్త పాలకవర్గం ఏర్పాటైంది. మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) వినోద్ రాయ్ నేతృత్వంలో నలుగురు సభ్యుల కమిటీని సోమవారం సుప్రీం కోర్టు నియమించింది. జస్టిస్ ఆర్ఎం లోధా ప్యానెల్ సూచించిన ప్రతిపాదనల అమలును కూడా ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది. మిగతా ముగ్గురిలో క్రికెట్ చరిత్రకారుడు రామచంద్ర గుహ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కంపెనీ (ఐడీఎఫ్సీ) మేనేజింగ్ డైరెక్టర్ విక్రమ్ లిమాయే, భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ డయానా ఎడుల్జీ ఉన్నారు. వీరిలో డయానాకు తప్ప క్రికెట్ ఆటతో ఎవరికీ సంబంధం లేకపోవడం గమనార్హం. ప్రస్తుత బోర్డు సీఈవో రాహుల్ జోహ్రి బోర్డుకు చెందిన రోజువారీ కార్యకలాపాల ఇన్చార్జిగా ఉంటారని జడ్జిలు దీపక్ మిశ్రా, ఏఎమ్ ఖన్విల్కర్, డీవై చంద్రచూడ్‌లతో కూడిన బెంచ్ పేర్కొంది. ఈ నియామకం వెంటనే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ‘మార్పును చక్కగా కొనసాగించేందుకు బీసీసీఐలో నా పాత్ర నైట్ వాచ్‌మన్‌గా ఉంటుందని భావిస్తున్నాను. బోర్డు గురించి నాకు అవగాహన లేకపోయినా క్రికెట్ అంటే నాకు ఎంతో ఇష్టం’ అని వినోద్ రాయ్ అన్నారు. వేతనం ఇవ్వాల్సిందే... మరోవైపు కమిటీ సభ్యులుగా ఎంపికైనవారికి ఎటువంటి వేతనం ఇవ్వలేమని బీసీసీఐ తెలిపింది. తమ ఆఫీస్ బేరర్లు, పరిపాలకులు ఉచితంగానే పనిచేస్తారని గుర్తుచేసింది. అయితే వీరి వాదనను కోర్టు తోసిపుచ్చింది. కచ్చితంగా వారికి గౌరవ వేతనం ఇవ్వాల్సి ఉంటుందని, ఎంత ఇవ్వాలనే ప్రతిపాదనలతో రావాలని స్పష్టం చేసింది. ఈ కమిటీలో కేంద్ర క్రీడాశాఖ కార్యదర్శిని కూడా చేర్చాలనే కేంద్ర ప్రభుత్వ విన్నపాన్ని కోర్టు తిరస్కరించింది. లోధా ప్యానెల్ సూచనల అమల్లో నిర్లక్ష్యం వహించినందుకు బోర్డు అధ్యక్షుడిగా ఉన్న అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కేలను పదవుల నుంచి తొలగిస్తూ సుప్రీం కోర్టు గతంలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో బోర్డు పాలన సజావుగా నడిచేందుకు కొందరి పేర్లను సూచించాల్సిందిగా కోర్టు కోరింది. ఈనెల 24న అమికస్ క్యూరీ గోపాల్ సుబ్రమణియమ్, అనిల్ దివాన్ సూచించిన తొమ్మిది మంది సభ్యుల జాబితా కోర్టుకు అందించగా వీటిని తిరస్కరించింది. మరోసారి పేర్లను సూచించాల్సిందిగా ఆదేశించి ఈనెల 30కి విచారణను వాయిదా వేసింది. ఐసీసీ సమావేశానికి అమితాబ్, విక్రమ్ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఎగ్జిక్యూటివ్ సమావేశంలో బోర్డు తరఫున ప్రాతినిధ్యం వహించే వారి పేర్లను కూడా కోర్టు ప్రకటించింది. ఫిబ్రవరి 2న దుబాయ్‌లో జరిగే ఈ మీటింగ్‌కు బీసీసీఐ సంయుక్త కార్యదర్శి అమితాబ్ చౌదరి, విక్రమ్ లిమాయే హాజరవనున్నారు. -
అంకెల గారడీ!
నూతన పాలకవర్గం ఏర్పడిన తర్వాత మొదటి బడ్జెట్ సమావేశం మంగళవారం నగర పాలక సంస్థ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో జరిగింది. ఈ సందర్భంగా 2015-16 బడ్జెట్ రూ.610 కోట్లుగా ప్రవేశపెట్టారు. ప్రారంభ నిల్వను రూ.11.89 కోట్లుగా చూపారు. భూగర్భ డ్రైనేజీకి రూ.125 కోట్లు, తాగునీటికి రూ.100 కోట్లు, మరుగుదొడ్లకు రూ.10 కోట్లు, మాస్టర్‌ప్లాన్‌కు రూ.10 కోట్లు కేటాయించారు. పన్నులు రూపంలో రూ.26 కోట్లు, ఇతర జమలు రూ.112 కోట్లు, డిపాజిట్లు రూ.14 కోట్లు, గ్రాంట్లు రూ.444 కోట్లు వస్తుందని లెక్కల్లో చూపించారు. ఈ ఏడాది బీపీఎస్ రూపంలో కార్పొరేషన్‌కు రూ.60 కోట్లు వస్తుందని అంచనా వస్తున్నారు. నెల్లూరు, సిటీ: నగర పాలక సంస్థ 2015-16 బడ్జెట్ వాస్తవ దూరంగా, అంకెల గారడీలాగా ఉందని ప్రతిపక్ష వైఎస్సార్సీపీ కౌన్సిలర్లతో పాటు ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం తదితరులు నిలదీశారు. అయితే మేయర్ ఏకపక్షంగా వ్వవహరిస్తూ ప్రతిపక్షం గొంతునొక్కే ప్రయత్నం చేశారు. నెల్లూరు కార్పొరేషన్ బడ్జెట్ సమావేశం మంగళవారం మేయర్ అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశం ప్రారంభంకాగానే 12వ డివిజన్ కార్పొరేటర్ రంగ మయూర్‌రెడ్డి అధికారులు పన్నులు వసూలు చేస్తున్న తీరుపై ధ్వజమెత్తారు. ఈ విధంగా పన్నులు వసూళ్లు చేయడం దారుణమన్నారు. పోడియం వద్ద ఆందోళన చేశారు. ఆనం కారణంగానే అప్పులు: మేయర్ ఈ క్రమంలో టీడీపీ వర్గీయులకు, రంగమయూర్‌రెడ్డికి మధ్య వాగ్వాదం నెలకొంది. మేయర్ జోక్యం చేసుకుని ‘నీ కారణంగా, మీ నాన్న కారణంగానే ఈ పరిస్థితి నెలకొందన్నారు. మీ నాన్న పాలనలో చేసిన అక్రమాల కారణంగా కార్పొరేషన్ రూ.40 కోట్ల అప్పుల్లో మునిగిపోయిందన్నారు. మీ ఇంట్లో పనిచేసుకునేందుకు కూడా కార్పొరేషన్ ఉద్యోగులను వాడుకున్న సందర్బాలు ఉన్నాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.’ ఈ సందర్భంలో మంత్రి నారాయణ, మేయర్ అజీజ్‌పై రంగమమూర్రెడ్డి విమర్శలు గుప్పించారు. వెంటనే నూనె మల్లికార్జున్‌యాదవ్ కల్పించుకుని మంత్రిని విమర్శించే హక్కు నీకు లేదన్నారు. ఈక్రమంలో మేయర్, టీడీపీ సభ్యులు రంగమయూర్‌రెడ్డిని సమావేశం నుంచి వెళ్లిపోవాలని పదేపదే అనడం గమనార్హం. దీంతో అతను బడ్జెట్ కాగితాలను చించివేసి సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. అనంతరం కౌన్సిల్ సమావేశం యాథావిధిగా కొనసాగింది. పన్నులు వసూళ్లు, టోల్‌ప్లాజాపై ప్రస్తావన.. వైఎస్సార్సీపీ, మరికొందరు పన్నుల భారం, నగర పరిధిలో ఏర్పాటు చేయనున్న టోల్‌ప్లాజా నిర్మాణం గురించి తమ దృష్టికి తీసుకొచ్చారని మేయర్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. ప్రతిపక్ష సభ్యులు కోరినట్లు టోల్‌ప్లాజా నిర్మాణం అన్యాయమని, దీనికి కౌన్సిల్ ఆమోదం తెలపబోదని స్పష్టం చేశారు. ఇటీవల టోల్‌ప్లాజా నిర్మాణాన్ని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించడాన్ని గుర్తుచేశారు. గత ప్రభుత్వ తప్పిదాలే పునరావృతం: ద్వారకా ఈ ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్లో పేర్కొన్న లెక్కలు తప్పులతడకగా ఉన్నాయి.. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలే పునరావృతమవుతున్నట్లుగా ఉందని డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్ అన్నారు. కౌన్సిల్ నిర్వహణ ఖర్చులు రూ.10లక్షలు చూపించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. చెట్ల పెంపకానికి, ఫాగింగ్, నిర్వహణ ఖర్చులు, వాహనాల మరమ్మతుల ఖర్చులు అత్యధికంగా చూపారన్నారు. వీధిదీపాలకు రూ.6.61కోట్లు లెక్కలు చూపించారని, అయితే ఎక్కడా ఖర్చుపెట్టిన సందర్భాలు లేవన్నారు. కార్పొరేటర్లే సొంత నిధులను ఖర్చుచేశారన్నారు. అయితే ఇంత భారీస్థాయిలో వీధి దీపాలకు ఖర్చుచూపించడంపై అధికారులు అవినీతికి పాల్పడినట్లుగా తెలుస్తుందన్నారు. ఉచ్చి భువనేశ్వరప్రసాద్, టీడీపీ కార్పొరేటర్ పంట కాలువల పూడికలు తీయడానికి రూ. 64 లక్షలు ఖర్చుపెట్టారన్నారు. ఎక్కడా పూడికలు తీసిన పరిస్థితి లేదన్నారు. ఎందుకు ఆలస్యంగా నిర్వహిస్తున్నారు ఏడాది చివరిరోజు బడ్జెట్ కౌన్సిల్ సమావేశం ఇంత ఆలస్యంగా ఎందుకుపెట్టారని వైఎస్సార్సీపీ విప్, బొబ్బొల శ్రీనివాసులు మేయర్‌ను నిలదీశారు. బడ్జెట్‌ను ఎప్పుడు సవరణ చేస్తారు, ప్రభుత్వానికి ఎప్పుడు పంపిస్తారన్నారు. అదేవిధంగా కొంతకాలం క్రితం మంత్రి నారాయణ మాట్లాడుతూ కార్పొరేట్ స్కూల్స్‌కు దీటుగా మున్సిపల్ స్కూల్స్‌ను అభివృద్ధి చేస్తానని హమీ ఇచ్చారని, అయితే ఈ బడ్జెట్‌ను గమనిస్తే రాబోయే కాలంలో విద్యార్థులకు ఇబ్బందులు తప్పవనే పరిస్థితి కనిపిస్తుందన్నారు. వైఎస్సార్సీపీ బాయ్‌కాట్ :రాబడికి, అభివృద్ధి పనుల నిర్వహణకు సంబంధించి వేసిన లెక్కల్లో పొంతనలేదని వైఎస్సార్సీపీ కౌన్సిల్ సభ్యులు ఆరోపించారు. ఈ బడ్జెట్‌ను తాము వ్యతిరేకిస్తున్నామని సమావేశం నుంచి బహిష్కరించి వెళ్లిపోయారు. అనంతరం ప్రతిపక్ష సభ్యుల ఆమోదం లేకనే బడ్జెకు మేయర్ పచ్చజెండా ఊపారు.