breaking news
mruthunjayam
-
కేటీఆర్ గెలిచింది బాబు దయతోనే
సాక్షి, సిరిసిల్లటౌన్: ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక సీఎం కేసీఆర్ తన ప్రభుత్వాన్ని తొమ్మిది నెలలు ముందుగానే రద్దు చేశారని ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కటుకం మృత్యుం జయం ధ్వజమెత్తారు. మంగళవారం జిల్లాకేంద్రం లోని పార్టీ ఎన్నికల కార్యాలయంలో ఏర్పాటు చే సిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీతో అంటకాగేందుకే కేసీఆ ర్ ముస్లింల ఓట్ల కోసం ముందస్తు నాటకానికి తెరలేపారన్నారు. గతంలో ఎన్నడూలేని దిక్కుమాలిన ప్రభుత్వంగా టీఆర్ఎస్ను ప్రజలు ఛీత్కరిం చుకుంటున్నారన్నారు. కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందని, అందుకే ప్రతిపక్షాలపై, తెలంగాణ ప్రదాత సోనియాగాంధీపై దిక్కుమాలిన భాష మాట్లాడుతున్నాడని అన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో నాలుగేళ్లుగా ఏఒక్క ఎకరాకి కూడా నీరు పారలేదని, మంత్రి కేటీఆర్ సిగ్గుతో తలవంచుకోవాలని అన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, కార్మికరంగాల్లో వెనుకబాటుకు టీఆర్ఎస్ కారణ మన్నారు. కేకే మహేందర్‌రెడ్డితోనే సిరిసిల్ల నియోజకవర్గం అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కేటీఆర్ గెలిచింది బాబు దయతోనే.. 2009 ఎన్నికల్లో టీడీపీతో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుందని, ఆఎన్నికల్లో చంద్రబాబు దయతోనే కేటీఆర్ గెలిచారని, ఆవిషయాన్ని మరిచి మాట్లాడడం సరికాదని సిరిసిల్ల కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్‌రెడ్డి అన్నారు. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురా లు నేరెళ్ల శారద మాట్లాడుతూ, మహిళా సంక్షేమాన్ని నాలుగేళ్లుగా టీఆర్ఎస్ కాలరాసిందన్నారు. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, ప్ర జాసంఘాల రాష్ట్ర అధ్యక్షుడు గజ్జెల కాంతం, ఓ యూ జేఏసీ చైర్మన్ దరువు ఎల్లం, నాయకులు గు డ్ల మంజుల, ఆకునూరి బాలరాజు, గుడ్ల మంజు ల, ఆడెపు చంద్రకళ, నాగుల సత్యనారాయణ, బైరినేని రాము, టోనీ తదితరులు పాల్గొన్నారు. -
ఆ ముగ్గురు నేతలకు షోకాజ్ నోటీసులు!
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు ముగ్గురు తెలంగాణ కాంగ్రెస్ నేతలపై తెలంగాణ పీసీసీ క్రమశిక్షణా సంఘం చర్యలు చేపట్టింది. కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కె. మృత్యుంజయం, ఆరేపల్లి మోహన్‌లకు టీపీసీసీ క్రమశిక్షణా సంఘం నోటీసులు పంపినట్టు తెలుస్తోంది. శనివారం గాంధీభవన్‌లో తెలంగాణ పీసీసీ క్రమశిక్షణా సంఘం సమావేశం అయింది. ఈ నేపథ్యంలో మృత్యుంజయం, ఆరేపల్లి మోహన్ పరస్పర ఆరోపణలపై షోకాజ్ నోటీసులు పంపారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు పాల్వాయి గోవర్థన్ రెడ్డిని వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. అదేవిధంగా మృత్యుంజయం, ఆరేపల్లి మోహన్‌లు చేసిన ఆరోపణలపై కూడా వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. ఈ నెల 17న వివరణ ఇవ్వాల్సిందిగా ముగ్గురు నేతలను టీపీసీసీ క్రమశిక్షణా సంఘం ఆదేశించింది. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీసెల్ మాజీ ఛైర్మన్ శ్యాంసుందర్‌ను కూడా సస్పెండ్ చేసినట్టు తెలిసింది. జిల్లా కాంగ్రెస్ మీటింగ్‌లో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు వేటు వేశారు. శ్వాంసుందర్ను కూడా వారంలోగా వివరణ ఇవ్వాలని టీపీసీసీ నోటీసులు ఇచ్చినస్టు సమాచారం.