breaking news
King Charles -2
-
కత్తి ఇవ్వలేదని.. డైరెక్టర్ని ఉద్యోగం నుంచి ఊడబీకిన ట్రంప్!
వాషింగ్టన్:అమెరికాలోని ప్రసిద్ధ ఐజెన్‌హవర్ ప్రెసిడెన్షియల్ లైబ్రరీ డైరెక్టర్ జాన్ హెన్రీను ట్రంప్ ప్రభుత్వం హఠాత్తుగా పదవి నుంచి తొలగించింది. ఈ నిర్ణయానికి కారణం..బ్రిటన్ రాజు చార్లెస్‌కు ఓ విలువైన చారిత్రక కత్తిని బహుమతిగా ఇవ్వాలన్న ట్రంప్ ఆదేశాలను ఆయన తిరస్కరించడం. ఈ ఘటన అమెరికా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.1945 నాటి రెండవ ప్రపంచ యుద్ధానికి చెందిన ఆ కత్తిని జాతీయ వారసత్వంగా భావించాల్సినదిగా జాన్ హెన్రీ అభిప్రాయపడ్డారు. ‘ఇది ప్రజల ఆస్తి. చారిత్రకంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన వస్తువు. దీన్ని బహుమతిగా ఇవ్వడం సరైనది కాదు’అంటూ ఆయన ట్రంప్ విజ్ఞప్తిని తిరస్కరించారు.అయితే, ట్రంప్ పరిపాలనలో ఉన్న ఉన్నతాధికారులు ఈ కత్తిని అమెరికా-బ్రిటన్ మధ్య స్నేహ బంధానికి ప్రతీకగా ఇవ్వాల్సిన బహుమతిగా పేర్కొన్నారు. కత్తి ఇవ్వండి, లేదంటే ఉద్యోగం నుంచి తొలగిస్తామని జాన్ హెన్రీకి హెచ్చరికలు జారీ చేశారు. ఉన్నతాదికారులు ఒత్తిడి చేస్తున్నప్పటికీ.. మ్యూజియంలో ఉన్న కత్తిని ట్రంప్‌కు ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో ట్రంప్ ఆదేశాల మేరకు ఆయన్ను పదవి నుంచి తొలగించారు. ఈ చర్యపై చరిత్రకారులు, మ్యూజియం నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చారిత్రక సంపదను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదు. ఇది ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే చర్యగా అభివర్ణిస్తున్నారు. ఈ వివాదంపై ఇప్పటివరకు ట్రంప్ లేదా బ్రిటన్ రాజు చార్లెస్ స్పందించలేదు. -
బ్రిటన్ రాజు చార్లెస్-IIIతో జెలెన్స్కీ భేటీ
లండన్: ఉక్రెయిన్ అధ్యక్షు వ్లాదిమిర్ జెలెన్స్కీ (Ukrainian President Zelensky) లండన్‌లోని సాండ్రింగ్‌హామ్ హౌస్‌లో బ్రిటన్ రాజు చార్లెస్- IIIను కలుసుకున్నారు. అంతకుముందు ఆయన బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్తో భేటీ అయ్యారు. దీనికి సంబంధించి రాజకుటుంబం సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో ‘ఈ రోజు సాయంత్రం బ్రిటన్ రాజు చార్లెస్- III ఉక్రెయిన్ అధ్యక్షుడు @ZelenskyyUa ను సాండ్రింగ్‌హామ్ హౌస్‌కు స్వాగతించారు’ అని పేర్కొన్నారు.సాండ్రింగ్‌హామ్ హౌస్ అనేది ఇంగ్లాండ్‌లోని నార్ఫోక్లో ఉన్న ఒక ప్రైవేట్ నివాసం. ఇది సాంప్రదాయకంగా బ్రిటిష్ రాజకుటుంబం ఆధీనంలో ఉంటుంది. ఉక్రేనియన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీని 10 డౌనింగ్ స్ట్రీట్‌కు స్వాగతించారు. ఉక్రెయిన్‌కు బ్రిటన్ మద్దతు ఉంటుందని జెలెన్స్కీకి బ్రిటన్ రాజు చార్లెస్- III (UKs King Charles iii)హామీ ఇచ్చారని అల్ జజీరా నివేదించింది. This evening, His Majesty The King received the President of Ukraine, @ZelenskyyUa, at Sandringham House. 🇺🇦 pic.twitter.com/mhGr7C0BN4— The Royal Family (@RoyalFamily) March 2, 2025అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో వైట్ హౌస్‌లో జెలెన్స్కీ జరిపిన చర్చలు ఉద్రిక్తతలకు దారితీశాయి. వాషింగ్టన్ పర్యటన అనంతరం జెలెన్స్కీ బ్రిటన్ రాజు చార్లెస్- IIIని కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది కూడా చదవండి: సోమనాథుని సన్నిధిలో ప్రధాని మోదీ పూజలు -
ఆవిష్కరణం: శక్తిని అర్థం చేసుకుంటే కుక్కర్ వచ్చింది!
ప్రకృతిలో జరిగే ప్రతి చర్య మనకు కొన్ని విషయాలు నేర్పుతుంది. వాటిని అర్థం చేసుకోవడమే ఇన్వెన్షన్. యాపిల్ కిందపడటం అనేది ఒక్క న్యూటన్ మాత్రమే చూశారా.... లేదు. చాలామంది చూశారు. న్యూటన్ మాత్రమే దాన్ని అర్థం చేసుకున్నారు. ప్రకృతిలో సైన్స్ ఇమిడి ఉంది. ప్రెషర్ కుక్కర్ ఇన్వెన్షన్ కూడా అలాగే జరిగింది. ఆవిరితో ఏకంగా ఇంజిన్ నడిచింది. అది ఆలస్యంగా కనుక్కున్నారు గాని... స్టీమ్‌కు చాలా శక్తి ఉందని అంతకుముందు ఎప్పుడో తేలిపోయింది. డెనిస్ పాపిన్ ఆవిరి శక్తిని అర్థం చేసుకోవడం వల్లే ప్రెషర్ కుక్కర్ కనుక్కోగలిగారు. నీరు వంద డిగ్రీల సెంటీగ్రేడు వద్దకు రాగానే ఆవిరిగా మారి గాల్లో కలిసిపోతుంది. గాల్లో కలిసిపోతే దాని శక్తి వృథా అవుతుంది. కాబట్టి దాన్ని బంధించగలిగితే ఉపయోగం ఉంటుందని భావించారు డెనిస్. ఆయనకు ఆ ఆలోచన రావడమే కుక్కర్ అంకురార్పణ. ఒక పాత్రలో నీరు పోసి దానికి ఒక మూతపెట్టి లాక్ చేశారు. ఆవిరి బయటకు పోయే అవకాశం లేకుండా చర్య తీసుకున్నారు. దీంతో ఆ పాత్రలోని ఉష్ణోగ్రత వందకంటే ఎక్కువ నమోదైంది. అయితే, అత్యధిక ఒత్తిడివల్ల పాత్ర పేలిపోయే ప్రమాదం ఏర్పడింది. దీంతో అతను ఒత్తిడిని ఓ పరిమితిలో ఉంచడానికి ఓ వాల్వును తయారుచేశాడు. దీంతో ప్రెజర్కుక్కర్కు సంబంధించి 1679లోనే ఆవిష్కరణ జరిగినట్లయింది. ఫ్రాన్స్‌కు చెందిన పాపిన్ ఇంగ్లండ్‌లో ఈ పరిశోధనలు చేశారు. ఈ ఆవిరిని బంధించి మరింత వేడిని సృష్టించవచ్చని కనుగొన్న ఆయనకు లండన్ రాయల్ సొసైటీలో సభ్యత్వం వచ్చింది. కింగ్ చార్లెస్-2కు ఆయన 1682 ఏప్రిల్ 12న సాధారణ సమయం కంటే తక్కువ సమయంలో ‘డెయో’గా పదార్థాలను ఉడికించి చూపించారు. అలా మొదటి కుక్కర్ వంట అధికారికంగా రాజు గారు ఆరగించారు.


