Top Stories
ప్రధాన వార్తలు
కేంద్ర కేబినెట్: మోదీ 3.0 మంత్రులు వీరే..
సాక్షి, ఢిల్లీ: కేంద్ర కేబినెట్ ఖరారైంది. ఆదివారం ఉదయం నరేంద్ర మోదీ తన నివాసంలో కొత్త మంత్రులకు తేనీటి విందు ఇచ్చారు. బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీలకు మరోసారి కేబినెట్ పదవులు దక్కాయి. వాళ్లకు పాత శాఖల్నే కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక.. కీలక శాఖల్ని కూడా బీజేపీ తన వద్దే ఉంచుకోనున్నట్లు సమాచారం.రాష్ట్రపతి భవన్లో ఈరోజు(ఆదివారం) రాత్రి 7.15 గంటలకు ప్రధానిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మూడుసార్లు ప్రధానిగా చేసిన జవహర్లాల్ నెహ్రూ రికార్డును సమం చేయనున్నారు. బీజేపీకి సొంతంగా 240 సీట్లు మాత్రమే రాగా... మిత్రపక్షాలతో కలిపి ఎన్డీయే 293 సీట్లతో మెజారిటీ సాధించింది. సంకీర్ణ సర్కార్ కేబినెట్లో భాగస్వామ్య పార్టీల ఎంపీలు కూడా భాగం కానున్నారు.కేబినెట్లో బీజేపీ నుంచి రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, జ్యోతిరాదిత్య సింధియా, శివరాజ్ సింగ్ చౌహాన్, అనురాగ్ ఠాకూర్, కిరణ్ రిజిజు, అశ్విని వైష్ణవ్, ప్రహ్లాద్ జోషి, మన్సుక్ మండవియ,రావు ఇంద్రజిత్ సింగ్‌లకు చోటు దక్కింది. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి వర్గంలోకి కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కు చోటు దక్కింది. ఒకే వాహనంలో ఈ ఇద్దరూ మోదీ నివాసానికి వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ నుంచి నర్సాపూర్ ఎంపీ భూపతి రాజు శ్రీనివాస్ వర్మకు కేబినెట్ బెర్త్ దక్కింది. మోదీ నివాసంలో తేనీటి విందుకు ఈయన కూడా హాజరయ్యారు. రామ్మోహన్ నాయుడు,పెమ్మసాని చంద్రశేఖర్(టీడీపీ), కుమార స్వామి (జేడీఎస్), లలన్ సింగ్(జేడీయూ), సహాయ మంత్రిగా రామ్ నాత్ ఠాకూర్(జేడీయూ), జితిన్ రామ్ మాంజీ( హిందూస్తాన్ ఆవం మోర్చా), జయంత్ చౌదరి(ఆర్ఎల్డీ) ప్రతాప్ రావ్ జాదవ్(శివసేన), ప్రఫుల్ పటేల్(అజిత్ పవార్ ఎన్సీపీ), అనుప్రియా పాటిల్(అప్నాదళ్), రామ్‌దాస్ అత్వాలే(ఆర్పీఐ)లకు చోటు దక్కింది. సాయంత్రం కల్లా కేంద్ర కేబినెట్‌పై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
టీడీపీ Vs జనసేన.. పిఠాపురంలో మరో రచ్చ..
సాక్షి, కాకినాడ జిల్లా: పిఠాపురం టీడీపీ-జనసేన మధ్య మరోసారి విభేదాలు బయటపడ్డాయి. తాటిపర్తి గ్రామంలో ఆ పార్టీల మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది. అపర్ణ దేవి అమ్మవారి ఆలయ బాధ్యతలను గత పాలక కమిటీ జనసేన నాయకులకు అప్పగించింది. ఆలయ బాధ్యతల కోసం జనసేన-టీడీపీ పార్టీల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది.సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. పవన్ గెలుపు కోసం పని చేసిన మమ్మల్ని జనసేన నీచంగా చూస్తుందంటూ టీడీపీ నేతలు ఆవేదన వ్యక్త చేస్తున్నారు. జనసేన దుశ్చర్యలను జనం చూస్తున్నారని మండిపడ్డారు. ఆలయ తాళాలు గ్రామ కమిటికి ఇవ్వాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది.ఇదిలా ఉండగా, పిఠాపురం టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మపై జనసేన కార్యకర్తలు దాడికి దిగిన సంగతి తెలిసిందే.. రాళ్లు, కొబ్బరికాయలతో దాడి చేయడంతో ఆయన కారు అద్దాలు పగిలిపోయాయి. ఈ ఘటనలో వర్మతో సహా పలువురికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం రాత్రి కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం వన్నెపూడిలో స్థానిక సర్పంచ్‌తో మంతనాలు జరిపేందుకు వర్మ వెళ్లారు.ఈ విషయం తెలుసుకున్న ఆ గ్రామ జనసేన నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడకు వచ్చి వర్మను అడ్డుకున్నారు. ‘మాకు తెలియకుండా మా గ్రామం ఎందుకు వచ్చారు.. మాకు తెలియకుండా మా గ్రామంలో ఇతర పారీ్టల వాళ్లను ఎందుకు కలుస్తున్నారు’ అంటూ వర్మను నిలదీశారు. మీకు చెప్పాల్సిన పని లేదంటూ వర్మ వారికి బదులివ్వడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన జనసేన నేతలు, కార్యకర్తలు ఒక్కసారిగా ఆయనపై దాడికి దిగారు.
550 సార్లు రీ-రిలీజ్ అయిన ఏకైక సినిమా.. ఈ విషయాలు తెలుసా..?
టాలీవుడ్లో ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట రీ-రిలీజ్... ఒకప్పుడు బ్లాక్ బస్టర్ అయిన సినిమాలను మళ్లీ వెండితెరపై చూసేందుకు ప్రేక్షకులు కూడా బాగా ఆసక్తి చూపుతున్నారు. అప్పటి సినిమాలకు కొత్త టెక్నాలజీ అప్‌గ్రేడ్ చేసి మరీ విడుదల చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని సినిమాలు అయితే రెండు నుంచి మూడు సార్లు రీ-రిలీజ్ అయ్యాయి. అయితే, ఒక సినిమాను ఏకంగా 550 సార్లకు పైగానే రీరిలీజ్ చేశారంటే నమ్ముతారా..? ఆశ్చర్యం అనిపించినా ఈ వార్త నిజమే. కన్నడలో ఉపేంద్ర డైరెక్ట్ చేసిన 'ఓం' ఈ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో శివరాజ్‌కుమార్ హీరోగా నటించారు. ఇందులో ప్రేమ హీరోయిన్గా మెప్పించింది. 1995 మే 19న ఈ చిత్రం విడుదలైంది. సుమారు 30 ఏళ్లు అవుతున్నా ఈ చిత్రానికి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటి వరకు ఏకంగా 550 సార్లు రీ-రిలీజ్ చేసిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. అత్యధికసార్లు రీ-రిలీజ్ అయిన భారతీయ చిత్రంగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో కూడా స్థానం దక్కించుకుంది.ఈ సినిమా కోసం అండర్‌వరల్డ్‌లో పనిచేసిన అనేక మంది నేరస్థులతో పాటు నిందితులను కూడా తీసుకొచ్చారు. ఓం సినిమా కోసమే జైలు నుంచి బెయిల్‌పై వారిని బయటకు తీసుకొచ్చారు. అందులో కొంతమంది కరుడుగట్టిన నురస్థులు కూడా ఉన్నారు. అప్పట్లో ఇదొక సంచలనంగా మారింది. అప్పట్లో ఈ సినిమా నిర్మించేందుకు రూ. 70లక్షలు ఖర్చు అయినట్లు సమాచారం. బెంగళూరులోని కపిల్ థియేటర్లో 'ఓం'చిత్రాన్ని అత్యధికంగా 35సార్లు రీ-రిలీజ్ చేయడం అనేది ఆల్‌టైమ్ రికార్డుగా ఉంది. 1996 కర్ణాటక స్టేట్ అవార్డ్స్‌లో ఉత్తమ నటుడిగా శివరాజ్‌కుమార్, నటిగా ప్రేమ అందుకున్నారు. ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితగా ఉపేంద్రకు కూడా అవార్డు దక్కింది. ఓం సినిమాతో సౌత్ ఇండియా నుంచి ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్‌ను శివరాజ్‌కుమార్ దక్కించుకున్నారు. 2015లో 'ఓం' డిజిటల్ రైట్స్‌ను అమ్మకానికి మేకర్స్ పెట్టగా రూ.10కోట్లకు ఉదయ్ టీవీ కొనుగోలు చేసింది. ఇంతటి హిస్టరీ క్రియేట్ చేసిన ఈ సినిమా తెలుగులోనూ 'ఓంకారమ్' పేరుతోనే రాజశేఖర్ రీమేక్ చేశారు. ఇక్కడ కూడా ఈ సినిమా మంచి విజయాన్నే అందుకుంది. ఇందులో రాజశేఖర్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. బాలీవుడ్లో 'అర్జున్‌పండిట్' పేరుతో సన్నీ డియోల్, జుహీచావ్లా రీమేక్ చేశారు.
దాయాదుల సమరానికి సర్వం సిద్దం.. అందరి కళ్లు పిచ్‌పైనే?
టీ20 వరల్డ్‌కప్-2024లో అసలు సిసలు సమరానికి రంగం సిద్దమైంది. క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. 8 నెలల తర్వాత క్రికెట్ మైదానంలో యుద్దానికి ఆ రెండు జట్లు తమ అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకున్నాయి.ఓ జట్టు ఐసీసీ టోర్నీల్లో తమ ఆధిపతాన్ని కొనసాగించాలని భావిస్తుంటే.. మరో జట్టు చరిత్రను తిరిగి రాయాలని ఉవ్విళ్లూరుతోంది. మీరు క్రికెట్ అభిమానులు అయితే ఈ ఉపోధ్గాతం అంతా ఎవరి కోసమో ఈపాటికే అర్థం అయిపోయింటుంది. అవును మీరు అనుకుంటుంది నిజమే.ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం(జూన్ 9)న న్యూయర్క్ వేదికగా చిరకాల ప్రత్యర్ధులైన భారత్-పాకిస్తాన్ జట్లు అమీతుమీ తెల్చుకున్నాయి. సాధరణంగా దాయాదుల పోరు అంటే అందరూ ఎవరు గెలుస్తారు? ఏ జట్టు బలమెంత? బలహీనతలు ఏంటి? అంటూ పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంటుంది. కానీ ఇప్పుడు ఈ దాయాదుల పోరుకు వేదికైన నసావు కౌంటీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలోని పిచ్‌పైనే అందరి కళ్లు ఉన్నాయి. ఈ వికెట్ ఎలా ప్రవర్తిస్తుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అది పిచ్ కాదు.. భూతంఈ ఏడాది పొట్టి వరల్డ్‌కప్‌నకు వెస్టిండీస్‌తో పాటు అమెరికా కూడా ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ మెగా టోర్నీ ఆరంభానికి మూడు నెలల ముందు అమెరికాలోని న్యూయర్క్‌లో కొత్తగా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని నిర్మించారు. అదే నసావు కౌంటీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం. ఈ వరల్డ్‌కప్‌లో నసావు మైదానం వేదికగా మొత్తం 8 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇప్పటివరకు ఈ మెగా టోర్నీలో శ్రీలంక-దక్షిణాఫ్రికా, ఐర్లాండ్-ఇండియా, ఐర్లాండ్- కెనడా, దక్షిణాఫ్రికా-నెదర్లాండ్స్ మ్యాచ్‌లు జరిగాయి. ఈ స్టేడియంలోని పిచ్ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తోంది. ఈ వికెట్ ఎప్పుడు ఎలా స్పందిస్తుందో ఎవరికి ఆర్ధం కావడం లేదు. ఈ వికెట్‌పై అనూహ్య బౌన్స్ కారణంగా బ్యాటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నసావు స్టేడియంలో ఇప్పటివరకూ జరిగిన మ్యాచుల్లో 150 పరుగులు కూడా దాటలేదు.ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో కెనడా చేసిన 137 పరుగులకే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. పిచ్‌పై ఇప్పటి వరకు జరిగిన మూడు మ్యాచ్‌ల్లోని ఆరు ఇన్నింగ్స్‌ల్లో రెండుసార్లు మాత్రమే జట్లు 100 పరుగుల మార్కును అధిగమించాయి. నసావు వికెట్ ఎలా ఉందో ఈ గణాంకాలు చూస్తే మనకు అర్ధమవుతుంది. అస్సలు బ్యాటింగ్‌కు అనుకూలంగా లేదు. దక్షిణాఫ్రికా, భారత్ వంటి మేటి జట్లు కూడా స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.అంతేకాకుండా ఆటగాళ్లు గాయాల బారిన కూడా పడుతున్నారు. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓ రాకసి బౌన్సర్ వల్ల టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మోచేతికి గాయమైంది. దీంతో మ్యాచ్ మధ్యలోనే రోహిత్ మైదానాన్ని వీడాడు. అయితే ఈ పిచ్‌పై రోహిత్ శర్మ సైతం అసహనం వ్యక్తం చేశాడు. ఈ వికెట్‌పై 140-150 వరకూ స్కోరు చేయడమే చాలా కష్టమని రోహిత్ చెప్పుకొచ్చాడు. అయితే భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు కొత్త పిచ్ ఉపయెగించనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ కొత్త పిచ్‌ను ఉపయోగిస్తే అది బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుందా లేక బౌలర్లకే సహకరిస్తుందా అన్నది వేచి చూడాలి.
మళ్లీ ‘చెత్త’ పని చేసిన నార్త్ కొరియా కిమ్!
ఇప్పటి వరకు ఉత్తర కొరియా తన దగ్గరున్న క్షిపణులు, అణుబాంబులతో దక్షిణ కొరియాను బెదిరిస్తూ వచ్చింది. అయితే తాజాగా ఆ దేశం దక్షిణ కొరియాను ‘చెత్త బెలూన్ల’తో కవ్విస్తోంది. ఉత్తర కొరియా ఇటీవల 150 బెలూన్లకు చెత్తను కట్టి దక్షిణ కొరియాలోకి విడుదల చేసింది. దీనిపై దక్షిణ కొరియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో ఖఠినవైఖరి అవలంబిస్తామని ఉత్తర కొరియాను హెచ్చరించింది.ఉత్తరకొరియా తీరును ఎండగడుతూ లౌడ్ స్పీకర్ల ద్వారా మరోసారి వ్యోంగ్యాంగ్ (ఉత్తర కొరియాలోని ప్రధాన నగరం)నకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని సియోల్(దక్షిన కొరియాలోని ప్రధాన నగరం) పరిపాలనా అధికారులు హెచ్చరించారు. జాతీయ భద్రతా సమావేశంలో ఈమేరకు ఒక నిర్ణయం తీసుకున్నారు. సౌత్ కొరియా అధ్యక్ష కార్యాలయం వెలుపల లౌడ్ స్పీకర్లను ఏర్పాటు చేసి ఉత్తరకొరియాకు వ్యతిరేకంగా ప్రసారాలు ప్రారంభిస్తామని జాతీయ భద్రతా అధికారులు హెచ్చరించారు.కొద్ది రోజులుగా ఉత్తర కొరియా చెత్తతో కూడిన వందలాది బెలూన్లను పంపిందని దక్షిణ కొరియా సైన్యం మీడియాకు తెలిపింది. ఈ బెలూన్లు తెస్తున్న చెత్తలో ఉత్తర కొరియా ప్రచార సామాగ్రి ఉందా లేదా అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నామని సైన్యం తెలిపింది. కాగా సరిహద్దు ప్రాంతాల్లో కరపత్రాలు, ఇతర చెత్తను పారవేస్తున్న దక్షిణ కొరియా కార్యకర్తలపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇటీవల ఉత్తర కొరియా తెలిపింది. ఈ ప్రటన తరువాతనే దక్షిణ కొరియాకు చెత్త కట్టిన బెలూన్లు రావడం ప్రారంభమయ్యింది.1950లలో కొరియా యుద్ధం జరిగినప్పటి నుండి ఉత్తర, దక్షిణ కొరియాలు తమ ప్రచార కార్యక్రమాలలో బెలూన్లను ఉపయోగిస్తూ వస్తున్నాయి. ఇదిలా ఉండగా 2018- అంతర్-కొరియా ఒప్పందాన్ని రద్దు చేయాలని నిర్ణయించినట్లు దక్షిణ కొరియా జాతీయ భద్రతా మండలి తెలిపింది. ఈ ఒప్పంద ఉద్దేశ్యం ఇరు కొరియా దేశాల మధ్య పరస్పర నమ్మకం ఏర్పడే వరకూ సరిహద్దు శత్రుత్వాన్ని తగ్గించడం.ఈ ఒప్పందాన్ని ఎత్తివేడం వల్ల ఉత్తర కొరియా సరిహద్దులో దక్షిణ కొరియా మళ్లీ సైనిక విన్యాసాలు ప్రారంభించేందుకు వీలు కలుగుతుందని, పొరుగు దేశం కవ్వింపు చర్యలని తిప్పొకొట్టవచ్చని భద్రతా మండలి పేర్కొంది. ఒప్పందపు రద్దు ప్రతిపాదనను ఆమోదం కోసం క్యాబినెట్ కౌన్సిల్‌కు సమర్పించనున్నారు. కాగా ఉత్తర కొరియా ఇప్పటివరకు దక్షిణ కొరియాలోని వివిధ ప్రాంతాల్లో వెయ్యికి పైగా చెత్తతో కూడిన బెలూన్లను ఎగరేసింది. వీటిలో పేడ, సిగరెట్ పీకలు, గుడ్డ ముక్కలు, వ్యర్థ కాగితాలు ఉన్నట్లు గుర్తించారు. దక్షిణ కొరియా సైన్యం తెలిపిన వివరాల ప్రకారం ఈ బెలూన్లలో ఎటువంటి ప్రమాదకర పదార్థాలు లేవు.
రామోజీరావు అంత్యక్రియలు పూర్తి
హైదరాబాద్, సాక్షి: రామోజీగ్రూప్ సంస్థల అధిపతి చెరుకూరి రామోజీరావు అంత్యక్రియలు ముగిశాయి. ఆదివారం ఉదయం ఫిల్మ్ సిటీలోని స్మృతి వనంలో తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాల నడుమ అంతిమ సంస్కారాలు జరిగాయి. రామోజీరావుకు గౌరవ వందనంగా గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపారు పోలీసులు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ముగ్గురు అధికారులు అంత్యక్రియలకు హాజరయ్యారు. ఇక.. అంత్యక్రియలకు భారీ సంఖ్యలో రామోజీ సంస్థల ఉద్యోగులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అంతకు ముందు ఫిల్మ్‌సిటీలోని నివాసం నుంచి స్మృతి వనం దాకా అంతిమయాత్ర కొనసాగింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రామోజీరావు అంతిమ యాత్రలో పాల్గొని పాడె మోశారు. ఆయన కుటుంబ సభ్యుల కూడా ఇందులో పాల్గొన్నారు.మరోవైపు ఈ ఉదయం కూడా పలువురు ప్రముఖులు రామోజీ పార్థివదేహానికి నివాళులర్పించారు. అంతిమ సంస్కారాలను వీక్షించేందుకు స్మృతివనంలో ఎల్ఈడీ స్క్రీన్లతో ప్రత్యేక ఏర్పాట్లు చేయడం గమనార్హం. ఇదీ చదవండి: పెదపారుపూడి టు ఫిలింసిటీ
ఓటీటీలో 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'.. అధికారిక ప్రకటన
టాలీవుడ్ ప్రముఖ హీరో విశ్వక్ సేన్ నటించిన సినిమా 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'. పలుమార్లు వాయిదా పడి ఎట్టకేలకు మే 31న థియేటర్స్‌లోకి వచ్చేసింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ఒక వర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ముఖ్యంగా విశ్వక్ అభిమానులకు విజిల్స్ కొట్టించే సినిమా అని కూడా చెప్పవచ్చు. తాజాగా విశ్వక్ ఫ్యాన్స్‌కు శుభవార్త వచ్చేసింది. ఇప్పుడు 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయిపోయింది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.విష్వక్ సేన్, అంజలి, నేహాశెట్టి, నాజర్, పి.సాయికుమార్ ప్రధాన పాత్రలో నటించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' జూన్ 14న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ఈమేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది. తెలుగు,తమిళ్,కన్నడ,మలయాళంలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ తెలిపింది.గోదావరి నేపథ్యంలో సినిమా అంటే పచ్చటి పల్లెసీమల్లో కనిపించే వాతావరణమే గుర్తొస్తుంది. అయితే, అందుకు భిన్నంగా ఈ సినిమా ఉంటుంది పగ, ప్రతీకారాలతో ఓ యువకుడి ప్రయాణాన్ని దర్శకుడు కృష్ణచైతన్య అద్భుతంగా తెరకెక్కించాడు. ఇందులు అంజలి పాత్రకు కాస్త ఎక్కువ మార్కులే పడుతాయి. విష్వక్ నటనకు ఏమాత్రం పేరు పెట్టాల్సిన పనిలేదని చెప్పవచ్చు. సినిమా విడుదలయిన వారంలోనే రూ. 20 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌తో థియేటర్లో రన్ అవుతుంది. అయితే, కేవలం రెండు వారాల్లోనే ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో మరోసారి సినిమా చూడొచ్చని ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in)
‘ఏథర్’లో ఉన్నదంతా అమ్మేసుకున్న సచిన్ బన్సాల్
ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు సచిన్ బన్సాల్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీలో తనకున్న 7.5 వాటానంతా అమ్మేసుకుని ఆ సంస్థ నుంచి వైదొలిగారు. 2014 నుంచి ఏథర్ కంపెనీలో దాదాపు రూ.400 కోట్లు ఇన్వెస్ట్ చేసిన తొలి ఇన్వెస్టర్లలో బన్సాల్ ఒకరు.ఎకనామిక్స్ టైమ్స్ కథనం ప్రకారం.. తన వాటాలో 2.2 శాతం భాగాన్ని హీరో మోటోకార్ప్‌కు రూ .124 కోట్లకు విక్రయించిన సచిన్ బన్సాల్ మిగిలిన 5.3 శాతం వాటాను జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్‌కు సుమారు రూ .282 కోట్లకు విక్రయించారు. ఈ డీల్ తర్వాత ఈవీ స్టార్టప్‌లో హీరో మోటోకార్ప్ వాటా 40 శాతానికి పెరగనుంది.2024 ఆర్థిక సంవత్సరంలో ఏథర్ టర్నోవర్ రూ.1,753 కోట్లుగా ఉందని, అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో నమోదైన రూ.1,784 కోట్లతో పోలిస్తే ఇది 1.7 శాతం తగ్గిందని హీరో మోటోకార్ప్ తెలిపింది.
కలిసి బతకలేమని కడతేరిపోయారు!
జీడిమెట్ల, జగద్గిరిగుట్ట: వారిద్దరూ ప్రేమించుకున్నారు.. జీవితాంతం కలిసి ఉండాలని బాసచేసి పెళ్లి చేసుకున్నారు.. వీరి కాపురం కొన్నాళ్లు సాఫీగానే సాగింది. ఇటీవల ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఏం జరిగిందో ఏమో భార్య హెచ్‌ఏఎల్‌లోని తల్లి గారింట్లో, భర్త చింతల్ హెచ్ఎంటీలో ఒకేరోజు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. జీడిమెట్ల, జగద్గిరిగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాజులరామారం హెచ్ఏఎల్ కాలనీకి చెందిన కృష్ణమూర్తి చిన్న కుమారుడు మంచూరి రెశ్వంత్ (26), గాజులరామారం హెచ్ఏఎల్ కాలనీకి చెందిన సాయిశ్రేయ (22)ను ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. అనంతరం గాజులరామారం ద్వారకా నగర్లో కాపురం పెట్టారు. రెశ్వంత్ బిగ్‌బాస్కెట్‌లో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. కొన్నాళ్లు దంపతులిద్దరూ బాగానే ఉన్నారు. ఇటీవల ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. శనివారం రెశ్వంత్ హెచ్ఎంటీ నిర్మానుష్య ప్రదేశంలో చెట్టుకు చున్నీతో ఉరి వేసుకుని మృతిచెందాడు. సాయిశ్రేయ హెచ్ఏఎల్ కాలనీలోని తల్లిగారింట్లో ఉరి వేసుకుని మృతిచెందింది. మృతుడి సోదరుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
‘బలి’ కోరుతున్న సాంకేతిక విజయం!
‘ది హ్యాండ్ ఆఫ్ గాడ్’ గోల్ గురించి క్రీడా ప్రియులందరూ వినే ఉంటారు. 1986 ఫుట్‌బాల్ వరల్డ్ కప్ సందర్భంగా అర్జెంటీనా – ఇంగ్లండ్ మ్యాచ్‌లో డీగో మారడోనా చేసిన తొలి గోల్ వివాదాస్పదమైంది. డీగో చేసిన హెడర్ గోల్‌ను వాస్తవానికి చేత్తో నెట్టాడని ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో రికార్డింగ్ సౌకర్యం లేకపోవడం వల్ల రెఫరీ దాన్ని గోల్‌గానే ప్రకటించాడు. తర్వాత నాలుగు నిమిషాలకే ‘గోల్ ఆఫ్ ది సెంచరీ’ని కొట్టిన మారడోనా, అదే ఊపులో వరల్డ్ కప్‌ను గెలుచుకోవడమే గాక ఫుట్‌బాల్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించారు. వివాదాస్పద గోల్‌పై ఆ తర్వాత స్పందించిన మారడోనా అది ‘సగం మారడోనా హెడ్, సగం హ్యాండ్ ఆఫ్ గాడ్’ ఫలితమని ప్రకటించాడు.దుబాయ్‌లో ఇటీవల కురిపించిన కృత్రిమ వర్షం ఎంత బీభత్సాన్ని సృష్టించిందో ప్రపంచమంతా చూసింది. క్లౌడ్ సీడింగ్ ఓవర్‌డోస్‌కు వాతావరణ మార్పులు కూడా తోడైన ఫలితంగా రెండేళ్లలో కురవాల్సిన వర్షమంతా ఒకేరోజు కురిసి ఎమిరేట్‌ను అతలాకుతలం చేసింది.ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి జరిగిన ఎన్నికల ఫలితాలను చూస్తుంటే ఏదో ‘అదృశ్య హస్తం’ (హ్యాండ్ ఆఫ్ గాడ్) పనిచేసినట్టుగా, కృత్రిమ ఓట్ల వర్షం కురిపించినట్టుగా అనిపించక మానదు. లేదంటే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఇటువంటి ఫలితాలు రావాలంటే రష్యా నాయకుడు పుతిన్ లేదా తుర్కియే పాలకుడు ఎర్డోగాన్ లేదా మయన్మార్ మిలిటరీ జుంటా ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగి ఉండాలి. అలా జరగలేదు కాబట్టి ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ ప్రమేయం ఉండాలి. ఎవరా గాడ్? కేంద్ర ప్రభుత్వమా? ఎన్నికల సంఘమా... ఎవరు? కృత్రిమ ఓట్ల వర్షానికి క్లౌడ్ సీడింగ్ ఎవరు చేశారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ జనసామాన్యం మెదళ్లను తొలుస్తున్న ప్రశ్నలివి.ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషిన్లను ట్యాంపరింగ్ చేయడం ద్వారా ఫలితాలను తారుమారు చేయడం సాధ్యమేనని స్వయంగా చంద్రబాబే పలుమార్లు ప్రకటించారు. ఆయన అభిమాని వేమూరి రవి ఇంకొంచెం ముందుకెళ్లి ఈవీఎమ్‌లను ఎలా హ్యాక్ చేయవచ్చో మీడియా సమక్షంలోనే ప్రదర్శించి చూపెట్టారు. అందువల్ల ఈవీఎమ్‌ల ట్యాంపరింగ్ అనే ఆర్ట్‌పై కూటమికి స్పష్టమైన అవగాహన ఉన్నది.రాష్ట్రవ్యాప్తంగా సాయంత్రం 5 గంటలకు 68 శాతం ఓట్లు పోలయ్యాయని ఎన్నికల సంఘం ప్రకటించింది. కానీ తుది వివరాలను ప్రకటించడానికి దాదాపు మూడు రోజుల సమయాన్ని తీసుకున్నది. ఈ అసాధారణ జాప్యంపై సందేహాలను లేవనెత్తుతూ ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ పత్రిక సైతం కథనాన్ని ప్రచురించింది. ఆ గడువు ముగిసిన తర్వాత పోలయిన ఓట్ల సంఖ్య కూడా అనుమానాలను రేకెత్తించే విధంగానే ఉన్నది.తుది పోలింగ్ శాతాన్ని సుమారు 81గా నిర్ధారిస్తూ మూడు రోజుల తర్వాత ఈసీ తాపీగా ప్రకటన విడుదల చేసింది. మామూలుగా పోలింగ్ సమయం ముగిసిన తర్వాత పోలింగ్ కేంద్రం ఆవరణలో నిలబడి ఉన్నవారికి స్లిప్స్ పంపిణీ చేస్తారు. వారికి మాత్రమే ఓటువేసే అవకాశం కల్పిస్తారు. అలా నిలబడిన వారికి ఈసారి ఎందుకనో స్లిప్స్ లేదా టోకెన్లు పంపిణీ చేయలేదనే వార్తలు వినవస్తున్నాయి. ఇది అనుమానించదగ్గ అంశం.పోలింగ్ గడువు ముగిసిన తర్వాత ప్రాంగణంలో నిలబడి ఉన్నవారి సంఖ్య మనకున్న సమాచారం మేరకు ఎక్కడా యాభై నుంచి వంద దాటలేదు. వీరు ఓట్లు వేయడానికి ఇంకో రెండు, మూడు గంటలు చాలు. అంటే తొమ్మిది గంటలకల్లా పోలింగ్ పూర్తి కావాలి. కానీ అర్ధరాత్రి దాటిందాకా పోలింగ్ జరుగుతూనే ఉందట! అంటే ఆ యాభైమందే అంతసేపూ సైక్లింగ్ చేస్తున్నారా? వేలాది పోలింగ్ బూత్‌లలో గడువు ముగిసే సమయానికి 65 నుంచి 70 శాతం మధ్యనున్న పోలింగ్ శాతం తుది ప్రకటన వచ్చేసరికి 85 నుంచి 95 శాతం దాకా ఎగబాకింది.పోలింగ్‌కు ముందు జరిగిన రాజకీయ పరిణామాలను కూడా గమనంలోకి తీసుకోవాలి. ఎన్డీఏ కూటమిలో చేరడం కోసం చంద్రబాబు పడిన పాట్లు, భరించిన అవమానాలు తెలిసినవే. కూటమిగా కుదురుకున్న తర్వాత వారు ‘ఎలక్షనీరింగ్’ మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. అనేక ప్రాంతాల్లోని ప్రభుత్వాధికారులను బదిలీ చేశారు. కనీవినీ ఎరుగని విధంగా ఏ ప్రాంతంలో ఏ అధికారిని నియమించాలో కూడా ఎన్నికల సంఘానికి సూచించారు. ఈసీ కూడా కూటమి కోర్కెలన్నింటినీ మారుమాట్లాడకుండా నెరవేర్చింది. సాధారణంగా తెలుగు రాష్ట్రాల ఎన్నికలు ఎప్పుడూ తొలి ఫేజ్‌లోనే ఉంటూ వచ్చాయి. కానీ కూటమి కోరిక మేరకు ఈసారి నాలుగో ఫేజ్‌కు నెట్టివేశారు.మొదటి మూడు దశల పోలింగ్ తర్వాత జాతీయ స్థాయిలో ఎన్డీఏలో అభద్రతా భావం మొదలైందట. పోలింగ్ సరళి తమకు అనుకూలంగా లేదనే నిర్ధారణకు ఎన్డీఏ పెద్దలు వచ్చారు. నాలుగో దశకు ఎన్నికలను వాయిదా వేయించుకున్న చంద్రబాబు అదనంగా లభించిన సుమారు నెల రోజుల సమయాన్ని ప్రత్యేక ‘ఏర్పాట్ల’ కోసం ఉపయోగించుకున్నారు. ఈ ఏర్పాట్లకు ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ పూర్తిగా సహకరించింది. దేశవ్యాప్తంగా 19 లక్షల ఈవీఎమ్‌ల మిస్సింగ్‌పై ఇప్పటికీ కేంద్రం నుంచి స్పష్టమైన సమాధానాలు రాలేదు. ఇవెక్కడున్నాయి? ఏ పనికి వినియోగిస్తున్నారు? ఎవరి సేవల కోసం ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ వీటిని వినియోగిస్తున్నారో తేలవలసి ఉన్నది.గడచిన ఐదేళ్లుగా ప్రత్యర్థులపై లేని దాడులను ఉన్నట్లుగా చూపించి గగ్గోలు పెట్టినవారు పోలింగ్ రోజు సాయంత్రం, మరునాడు – మళ్లీ కౌంటింగ్ రోజు నుంచి గత నాలుగు రోజులుగా జరిగిన హింసాకాండపై మౌనం వహించారు. ఈ హింసాకాండ కూడా అప్పటికప్పుడు ఆవేశంతో చెలరేగినట్టు లేదు. జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక క్రమం కనిపిస్తున్నది. కృత్రిమ ఓట్ల వర్షం కురిసే సమయానికి ఎవరూ పోలింగ్ కేంద్రాల వైపు వెళ్లకుండా బెదరగొట్టేందుకు దాడులు జరిగాయి. మరుసటి రోజు కూడా చాలాచోట్ల ఇవి కొనసాగాయి. మళ్లీ కౌంటింగ్ పూర్తవుతున్న సమయం నుంచి నాలుగు రోజులుగా యథేచ్ఛగా రాష్ట్రవ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయి. అసాధారణమైన ఓటింగ్ సరళిని సమీక్షించడానికి ప్రత్యర్థులు గ్రామాల్లో పర్యటించే అవకాశం లేకుండా బెదరగొట్టడానికి ఈ దాడులు జరిగాయి. పోలీసు యంత్రాంగం పూర్తిగా కూటమి వ్యూహానికి తోడుగా నిలబడింది.విచక్షణారహితంగా జరుగుతున్న ఈ దాడులు మన ప్రజాస్వామ్య భవిష్యత్తు మీద ప్రశ్నార్థకాన్ని రచిస్తున్నాయి. ఈ దాడులను ఖండించకపోగా ‘వైఎస్సార్సీపీ కవ్వింపు చర్యలకు రెచ్చిపోకండ’ని ముఖ్యమంత్రి కాబోయే చంద్రబాబు ట్వీట్ చేశారు. గత రెండేళ్లుగా లోకేశ్ ఒక రెడ్‌బుక్‌ను సభల్లో ప్రదర్శిస్తూ హెచ్చరికలు జారీ చేసేవారు. తాను రెడ్‌బుక్‌లో పేర్లు ఎక్కించిన వారి సంగతి అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తానని చెప్పేవారు. ఇప్పుడా రెడ్‌బుక్ హోర్డింగ్‌లను కూడళ్లలో ఏర్పాటు చేశారు. దాని సందేశమేమిటో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.సందేశం గూండాతండాలకు స్పష్టంగానే అర్థమైంది. టీడీపీ వారికి చాలాచోట్ల జనసైనికులు కూడా తోడయ్యారు. ప్రత్యర్థులపై దాడులు చేస్తున్న సందర్భాల్లో పోలీసులు మౌన ప్రేక్షక పాత్రను పోషించారు. కొన్నిచోట్ల పారిపోతూ కనిపించారు. ఇప్పటివరకు బయటకొచ్చిన వీడియోల్లో ఇటువంటి దృశ్యాలెన్నో కలవరం కలిగించాయి.నూజివీడులో వైసీపీకి చెందిన ముసినిపల్ కౌన్సిలర్‌ను వెంబడించి కత్తులతో పొడుస్తున్న దృశ్యం పిండారీల దండయాత్రను తలపించింది. ఒక హాస్టల్ నిర్వాహకుడి ఇంటిపై దాడిచేసి గృహాన్ని ఛిద్రం చేసి, ఆ పెద్దమనిషిని మోకాళ్లపై కూర్చోబెట్టి కాళ్లు పట్టించుకున్న పైశాచికత్వం భయానకంగా కనిపించింది. రాళ్ల దాడులు, కర్రలతో దాడులు, కత్తులతో దాడులు, కిడ్నాప్‌లు... ఎన్నెన్ని దృశ్యాలు? వైసీపీకి చెందిన వారి కార్యాలయాలను పెట్రోల్ పోసి తగలబెట్టారు. వాహనాలను తగులబెట్టారు. జెండా దిమ్మెలను సుత్తులతో పగులగొట్టారు. శంకుస్థాపన ఫలకాలను ధ్వంసం చేశారు. గ్రామ సచివాలయాల మీద దాడులు చేశారు. వైఎస్సార్ విగ్రహాలను తొలగించి ఈడ్చుకుంటూ అవమానించారు.వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయంపై వైఎస్సార్ అక్షరాలు తొలగించారు. ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్‌ల వంటి విప్లవాత్మక కార్యక్రమాలను ప్రారంభించిన వైఎస్సార్ పేరు ఆరోగ్య విశ్వవిద్యాలయానికి బాగుంటుందని భావించిన ప్రభుత్వం చట్టసవరణ ద్వారా ఎన్టీఆర్ పేరును మార్చి వైఎస్సార్ పేరు పెట్టారు. బదులుగా విజయవాడ కేంద్రంగా ఏర్పడిన కొత్త జిల్లాకు ఎన్టీఆర్ పేరును పెట్టారు. ఒక అల్లరిమూక దాడి చేసి ఇప్పుడా అక్షరాలను తొలగించింది..విశ్వవిద్యాలయాల మీద కూడా దాడులకు తెగబడ్డారు. వీసీలు, రిజిస్ట్రార్లు తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభు త్వం మారితే యూనివర్సిటీ పాలకవర్గాలను కూడా మార్చాలనే ఓ కొత్త ఆచారానికి శ్రీకారం చుట్టబోతున్నట్టు కనిపిస్తున్నది. నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారు రాజీనామాలు చేయడం సంప్రదాయం కానీ, ఇవి నామినేటెడ్ పదవులు కావు. సెర్చ్ కమిటీ సిఫారసుల మేరకు గవర్నర్ చేసిన నియామకాలు. అయినా సరే తమ పార్టీవాడే వీసీగా కూర్చోవాలనే దుందుడుకుతనం ప్రజాస్వామిక పద్ధతులను దెబ్బతీస్తున్నది.భయానక వాతావరణాన్ని కల్పించడం ద్వారా ప్రతిపక్షాలను కట్టడి చేయాలని కొత్త ప్రభుత్వం భావిస్తే అది నెరవేరే అవకాశం ఉండదు. నాలుగు రోజులు ఆలస్యమైనా సరే ఎన్నికల అవకతవకలపై వారు దృష్టి సారించకుండా ఉండరు. నిజానిజాలు తవ్వితీయకుండా ఉండరు. అలాగే కొత్త ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం జనంతో కలిసి విపక్షాలు కచ్చితంగా ఉద్యమిస్తాయి. కూటమికి లభించిన విజయం సాంకేతికమైనదే. అయినా సరే, ప్రభుత్వాన్ని అదే ఏర్పాటు చేస్తుంది. అడ్డంకులేమీ ఉండవు. చేసిన హామీలను నెరవేర్చి, ప్రజాస్వామిక వాతావరణాన్ని పునరుద్ధరించితే కొత్త ప్రభుత్వం ప్రజల మన్నన పొందుతుంది.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com
తప్పక చదవండి
- ఆమెతో జోడీయే ఇష్టపడ్డారు.. నేను ప్రేమించిన నటిని తిట్టిపోశారు!
- WI Vs UGA: 5 వికెట్లతో చెలరేగిన అకిల్.. పసికూనపై విండీస్ ఘన విజయం
- ఘోరం: వివాహిత మిస్సింగ్, మూడురోజల తర్వాత..
- కొన్ని గంటల్లో 'కల్కి' ట్రైలర్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడేనా..?
- రెండో రోజు.. చేప ప్రసాదం కోసం పోటెత్తిన జనాలు
- తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రారంభం
- మోదీ ప్రమాణా స్వీకారోత్సవానికి అతిధులుగా మహిళా లోకో పైలట్లు!
- 15 నెలల చిన్నారిపై వీధి కుక్కల దాడి
- Weekly Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి కాగలవు
- ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్.. వెల్లయన్ సుబ్బయ్య
సినిమా
హీరో శివ రాజ్‌కుమార్‌పై సొంత బామ్మర్ది సంచలన ట్వీట్!
సాక్షి, బెంగళూరు(శివాజీనగర): ప్రముఖ నటుడు శివ రాజ్‌కుమార్‌ను బావమరిది కించపరిచేలా మాట్లాడడం చర్చనీయాంశమైంది. ఈ లోక్‌సభ ఎన్నికల్లో శివమొగ్గలో శివ భార్య గీత కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ బాధలో ఉండగానే బావమరిది, బీజేపీ నేత కుమార బంగారప్ప హేళనలు ఆయన అభిమానులను మరింత వేదనకు గురిచేశాయి. కుమార బంగారప్ప ఇంటిని హీరో శివరాజ్ కుమార్ అభిమానులు శనివారం ముట్టడించారు. కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్, శివరాజ్ కుమార్ కుటుంబాల గురించి కుమార ఇటీవల చులకనగా మాట్లాడారు. అది తమకు బాధకు గురి చేసిందని, ఆయన బయటికి వచ్చి క్షమాపణ చెప్పాలని అభిమానులు పట్టుబట్టారు. బెంగళూరులో సదాశివనగరలో ఉన్న కుమార బంగారప్ప ఇంటి గేట్ లోపలికి చొరబడి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శివ రాజ్‌కుమార్ ఫొటోలను ప్రదర్శించారు. పరిస్థితి తీవ్రస్థాయికి చేరుతుండగా స్థలానికి చేరుకుని వారిని అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. ఇంటి నుంచి వెళ్లాలని పోలీసులు అభిమానులను హెచ్చరించారు. ఆ తరువాత కేఎస్ఆర్పీ పోలీసులతో అధిక భద్రత కల్పిపించారు. ఈ సందర్భంగా పలువురు అభిమానులను పట్టుకొని పోలీసులు అరెస్ట్ చేశారు. సమీప పార్కు చుట్టుపక్కల నిల్చున్నవారిని సైతం నిర్బంధించారు. హేళనగా కుమార పోస్టు తన సోదరుడు, మంత్రి మధు బంగారప్ప, సోదరి గీతాను, గీతా భర్త శివరాజ్‌కుమార్ గురించి సోషల్ మీడియాలో హేళనగా రాశారు. శివరాజ్‌కుమార్ నిరుద్యోగిగా ఉండాల్సిన అవసరం లేదు. మా గ్రామ జాతరలో నృత్యం చేసే పనికి దరఖాస్తు వేసుకోవచ్చని ఎద్దేవా చేశారు. నా చెల్లెలు గీతా.. సినిమా డ్యాన్సర్ కాబట్టి ఊరికే ఉండాల్సిన పని లేదు. దొడ్డమనె వ్యవహారం చాలా ఉంటుంది. వేరేవారికి అవకాశం లభించరాదు. బెదిరించడం, భయపెట్టడం, హుషార్ అనే మాటలు ఏమున్నా గొంతు లోపలే, నాలుగు గోడల లోపలే ఉండాలి. మా సైన్యం ఆన్‌లోనే ఉంటుంది అని హెచ్చరికలు చేశారు.pic.twitter.com/6YPDJcjkmh— Kumar Bangarappa (@kumarbangarappa) June 4, 2024
550 సార్లు రీ-రిలీజ్ అయిన ఏకైక సినిమా.. ఈ విషయాలు తెలుసా..?
టాలీవుడ్లో ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట రీ-రిలీజ్... ఒకప్పుడు బ్లాక్ బస్టర్ అయిన సినిమాలను మళ్లీ వెండితెరపై చూసేందుకు ప్రేక్షకులు కూడా బాగా ఆసక్తి చూపుతున్నారు. అప్పటి సినిమాలకు కొత్త టెక్నాలజీ అప్‌గ్రేడ్ చేసి మరీ విడుదల చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని సినిమాలు అయితే రెండు నుంచి మూడు సార్లు రీ-రిలీజ్ అయ్యాయి. అయితే, ఒక సినిమాను ఏకంగా 550 సార్లకు పైగానే రీరిలీజ్ చేశారంటే నమ్ముతారా..? ఆశ్చర్యం అనిపించినా ఈ వార్త నిజమే. కన్నడలో ఉపేంద్ర డైరెక్ట్ చేసిన 'ఓం' ఈ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో శివరాజ్‌కుమార్ హీరోగా నటించారు. ఇందులో ప్రేమ హీరోయిన్గా మెప్పించింది. 1995 మే 19న ఈ చిత్రం విడుదలైంది. సుమారు 30 ఏళ్లు అవుతున్నా ఈ చిత్రానికి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటి వరకు ఏకంగా 550 సార్లు రీ-రిలీజ్ చేసిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. అత్యధికసార్లు రీ-రిలీజ్ అయిన భారతీయ చిత్రంగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో కూడా స్థానం దక్కించుకుంది.ఈ సినిమా కోసం అండర్‌వరల్డ్‌లో పనిచేసిన అనేక మంది నేరస్థులతో పాటు నిందితులను కూడా తీసుకొచ్చారు. ఓం సినిమా కోసమే జైలు నుంచి బెయిల్‌పై వారిని బయటకు తీసుకొచ్చారు. అందులో కొంతమంది కరుడుగట్టిన నురస్థులు కూడా ఉన్నారు. అప్పట్లో ఇదొక సంచలనంగా మారింది. అప్పట్లో ఈ సినిమా నిర్మించేందుకు రూ. 70లక్షలు ఖర్చు అయినట్లు సమాచారం. బెంగళూరులోని కపిల్ థియేటర్లో 'ఓం'చిత్రాన్ని అత్యధికంగా 35సార్లు రీ-రిలీజ్ చేయడం అనేది ఆల్‌టైమ్ రికార్డుగా ఉంది. 1996 కర్ణాటక స్టేట్ అవార్డ్స్‌లో ఉత్తమ నటుడిగా శివరాజ్‌కుమార్, నటిగా ప్రేమ అందుకున్నారు. ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితగా ఉపేంద్రకు కూడా అవార్డు దక్కింది. ఓం సినిమాతో సౌత్ ఇండియా నుంచి ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్‌ను శివరాజ్‌కుమార్ దక్కించుకున్నారు. 2015లో 'ఓం' డిజిటల్ రైట్స్‌ను అమ్మకానికి మేకర్స్ పెట్టగా రూ.10కోట్లకు ఉదయ్ టీవీ కొనుగోలు చేసింది. ఇంతటి హిస్టరీ క్రియేట్ చేసిన ఈ సినిమా తెలుగులోనూ 'ఓంకారమ్' పేరుతోనే రాజశేఖర్ రీమేక్ చేశారు. ఇక్కడ కూడా ఈ సినిమా మంచి విజయాన్నే అందుకుంది. ఇందులో రాజశేఖర్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. బాలీవుడ్లో 'అర్జున్‌పండిట్' పేరుతో సన్నీ డియోల్, జుహీచావ్లా రీమేక్ చేశారు.
కొన్ని గంటల్లో 'కల్కి' ట్రైలర్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడేనా..?
ప్రభాస్ హీరోగా నటించిన సైన్స్ ఫిక్షన్ అండ్ ఫ్యూచరిస్టిక్ ఫిల్మ్ ‘కల్కి 2898 ఏడీ’. అమితాబ్ బచ్చన్ , కమల్ హాసన్ , దీపికా పదుకొనె, దిశా పటానీ ఇతర పాత్రల్లో నటించారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 27న విడుదల కానుంది. ఈ చిత్రంలో భైరవ పాత్రలో ప్రభాస్ నటిస్తున్నారు. ఇందులో బుజ్జి వాహనం చాలా ప్రత్యేకంగా ఉండనుంది. అయితే, మరికొన్ని గంటల్లో కల్కి ట్రైలర్ విడుదల కానుంది. ఈ క్రమంలో ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.కల్కి ట్రైలర్ జూన్ 10న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో థియేటర్స్‌లలో కూడా కల్కి ట్రైలర్‌ను విడుదల చేసే ఛాన్స్ ఉంది. అందుకు ఇప్పటికే ఆ థియేటర్స్ లిస్ట్‌ను కూడా మేకర్స్ రెడీ చేసినట్లు సమాచారం.కల్కి సినిమా జూన్ 27న విడుదల కానున్నడంతో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్‌ను ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. ఈ వేడుక కోసం పెద్ద ఎత్తున నిర్వహిస్తుండటంతో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖలను ఆహ్వానించే పనిలో కల్కి టీమ్ ఉందట. జూన్ 23న కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనున్నట్లు సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది.
ప్రదీప్ రంగనాథన్‌తో ఆ ఇద్దరు హీరోయిన్లు రొమాన్స్
ఏ రంగంలోనైనా లక్ ఉంటే ఆ కిక్కే వేరబ్బా. సహాయ దర్శకుడిగా ఎలాంటి కష్టాలు పడ్డారో తెలియదుగానీ, దర్శకుడైన తరువాత ప్రదీప్ రంగనాథన్‌కు లక్ తేనె తుట్టులా పట్టుకుంది. ఈయన జయంరవి కథానాయకుడిగా నటించిన కోమాలి అనే చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాత రెండో చిత్రంతోనే కథానాయకుడిగా అవతారమెత్తి స్వీయ దర్శకత్వంలో లవ్ టుడే చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ చిత్రం అనూహ్య విజయాన్ని సాధించింది. అంతే వరుసగా హీరో అవకాశాలు తలుపు తడుతున్నాయి. ప్రస్తుతం ఒకేసారి రెండు చిత్రాలు చేస్తున్నారు. అందులో ఒకటి విఘ్నేశ్‌శివన్ దర్శకత్వంలో నటిస్తున్న ఎల్ఐసీ చిత్రం. ఈ చిత్రానికి ప్రదీప్ రంగనాథన్ రూ.20 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు ప్రచారం హోరేత్తుతోంది. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తున్న మరో చిత్రం డ్రాగన్. ఈ చిత్ర షూటింగ్ పూర్తి కాకముందే అశ్వంత్ మారిముత్తు దర్శకత్వంలో డ్రాగన్ అనే చిత్రంలో నటించడానికి కమిట్ అయ్యారు. ఈ చిత్ర షూటింగ్ ఇటీవల ప్రారంభమై తొలి షెడ్యూల్‌ను పూర్తిచేసుకుంది. ఈ చిత్రంలోనే ఆయన సరసన ఇద్దరు సెన్సేషనల్ హీరోయిన్లు రొమాన్స్ చేయనున్నారని తాజా సమాచారం. అందులో ఒకరు అనుపమా పరమేశ్వరన్, మరొకరు మమితా బైజు అని తెలిసింది. వీరిద్దరూ ఇటీవల మంచి హిట్ కొట్టి మంచి జోరుమీద ఉన్నారన్నది గమనార్హం. అనుపమా పరమేశ్వరన్ తెలుగు చిత్రం టిల్లు స్క్వేర్ చిత్ర సక్సెస్ జోష్‌లో ఉంటే మమితా బైజు మలయాళ చిత్రం ప్రేమలు చిత్ర హిట్ క్రేజ్‌లో ఉన్నారు. డ్రాగన్ చిత్రం కళాశాల నేపథ్యంలో సాగే వైవిధ్యభరిత ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కుతోందని సమాచారం. ఈ చిత్ర షూటింగ్ రెండో షె డ్యూల్ త్వరలో చైన్నె, హైదరాబాద్ ప్రాంతాల్లో జరగనుందని సమాచారం.
ఫొటోలు
క్రీడలు
తొలి ఎమ్ఎమ్ఎ ఫైటర్‌గా రికార్డు.. ఎవరీ పూజా తోమర్?
భారత మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ పూజా తోమర్ సరికొత్త చరిత్ర సృష్టించింది. అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్షిప్ (UFC)లో బౌట్ గెలిచిన మొట్టమొదటి భారతీయురాలిగా పూజా తోమర్ రికార్డులకెక్కింది. లూయిస్విల్లే వేదికగా శనివారం జరిగిన గేమ్‌లో బ్రెజిల్ ఫైటర్ రేయాన్నే అమండా డోస్ శాంటోస్‌ను 30-27, 27-30, 29-28 తేడాతో ఓడించి పూజా విజేతగా నిలిచింది. తొలి రౌండ్లో ప్రత్యర్ధిపై పూజా పై చేయి సాధించగా.. రెండో రౌండ్లో మాత్రం అమండా డోస్ శాంటోస్ అద్బుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చింది. ఇక ఫలితాన్ని తేల్చే మూడో రౌండ్లో ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. అయితే ఫైనల్ బెల్ మ్రోగే సమయానికి పూజా వరుస కిక్‌లతో అమండా డోస్ శాంటోస్‌ను వెనక్కి నెట్టింది. దీంతో మూడు రౌండ్‌ను 29-28తో సొంతం చేసుకున్న పూజా.. యూఎఫ్‌సీ ఛాంపియన్‌గా నిలిచింది.ఎవరీ పూజా?28 ఏళ్ల పూజా ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లోని బుధానా గ్రామంలో జన్మించింది. పూజా వుషు( చైనీస్ యుద్ధ కళ)తో తన పోరాట క్రీడా ప్రయాణాన్ని పూజా ప్రారంభించింది. వుషు గేమ్‌లో పూజ జాతీయ టైటిళ్లను సొంతం చేసుకుంది. ఆ తర్వాత 2012 లో సూపర్ ఫైట్ లీగ్‌తో మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌లో ఎంట్రీ ఇచ్చింది. HISTORY CREATED BY PUJA TOMAR. 🇮🇳- She becomes the first ever Indian woman to win the UFC match. pic.twitter.com/j4PkN04z8k— Mufaddal Vohra (@mufaddal_vohra) June 9, 2024
WI Vs UGA: 5 వికెట్లతో చెలరేగిన అకిల్.. పసికూనపై విండీస్ ఘన విజయం
టీ20 వరల్డ్‌కప్-2024లో వెస్టిండీస్ అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ మెగా టోర్నీలో భాగంగా గయానా వేదికగా ఉగండాతో జరిగిన మ్యాచ్‌లో 134 పరుగుల తేడాతో వెస్టిండీస్ ఘన విజయం సాధించింది.174 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పసికూన ఉగండా.. విండీస్ బౌలర్ల దాటికి కేవలం 39 పరుగులకే కుప్పకూలింది. విండీస్ స్పిన్నర్ అకిల్ హుస్సేన్ 5 వికెట్లతో ఉగండా పతనాన్ని శాసించగా.. జోషఫ్ రెండు, మోటీ, రస్సెల్, షెఫెర్డ్ తలా వికెట్ సాధించారు. ఉగండా బ్యాటర్లలో జుమా మియాగీ(13) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిగితా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. అంతకముందు బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 173 పరుగుల భారీ స్కోర్ సాధించింది. విండీస్ బ్యాటర్లలో ఓపెనర్ జాన్సన్ చార్లెస్(44) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రస్సెల్(30 నాటౌట్), పావెల్(23), పూరన్(22) పరుగులతో రాణించారు. ఉగండా బౌలర్లలో కెప్టెన్ మసాబా రెండు వికెట్లు పడగొట్టగా.. నక్రాని, కెవాటియా, రామ్‌జనీ తలా వికెట్ సాధించారు.
దాయాదుల సమరానికి సర్వం సిద్దం.. అందరి కళ్లు పిచ్‌పైనే?
టీ20 వరల్డ్‌కప్-2024లో అసలు సిసలు సమరానికి రంగం సిద్దమైంది. క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. 8 నెలల తర్వాత క్రికెట్ మైదానంలో యుద్దానికి ఆ రెండు జట్లు తమ అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకున్నాయి.ఓ జట్టు ఐసీసీ టోర్నీల్లో తమ ఆధిపతాన్ని కొనసాగించాలని భావిస్తుంటే.. మరో జట్టు చరిత్రను తిరిగి రాయాలని ఉవ్విళ్లూరుతోంది. మీరు క్రికెట్ అభిమానులు అయితే ఈ ఉపోధ్గాతం అంతా ఎవరి కోసమో ఈపాటికే అర్థం అయిపోయింటుంది. అవును మీరు అనుకుంటుంది నిజమే.ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం(జూన్ 9)న న్యూయర్క్ వేదికగా చిరకాల ప్రత్యర్ధులైన భారత్-పాకిస్తాన్ జట్లు అమీతుమీ తెల్చుకున్నాయి. సాధరణంగా దాయాదుల పోరు అంటే అందరూ ఎవరు గెలుస్తారు? ఏ జట్టు బలమెంత? బలహీనతలు ఏంటి? అంటూ పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంటుంది. కానీ ఇప్పుడు ఈ దాయాదుల పోరుకు వేదికైన నసావు కౌంటీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలోని పిచ్‌పైనే అందరి కళ్లు ఉన్నాయి. ఈ వికెట్ ఎలా ప్రవర్తిస్తుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అది పిచ్ కాదు.. భూతంఈ ఏడాది పొట్టి వరల్డ్‌కప్‌నకు వెస్టిండీస్‌తో పాటు అమెరికా కూడా ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ మెగా టోర్నీ ఆరంభానికి మూడు నెలల ముందు అమెరికాలోని న్యూయర్క్‌లో కొత్తగా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని నిర్మించారు. అదే నసావు కౌంటీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం. ఈ వరల్డ్‌కప్‌లో నసావు మైదానం వేదికగా మొత్తం 8 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇప్పటివరకు ఈ మెగా టోర్నీలో శ్రీలంక-దక్షిణాఫ్రికా, ఐర్లాండ్-ఇండియా, ఐర్లాండ్- కెనడా, దక్షిణాఫ్రికా-నెదర్లాండ్స్ మ్యాచ్‌లు జరిగాయి. ఈ స్టేడియంలోని పిచ్ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తోంది. ఈ వికెట్ ఎప్పుడు ఎలా స్పందిస్తుందో ఎవరికి ఆర్ధం కావడం లేదు. ఈ వికెట్‌పై అనూహ్య బౌన్స్ కారణంగా బ్యాటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నసావు స్టేడియంలో ఇప్పటివరకూ జరిగిన మ్యాచుల్లో 150 పరుగులు కూడా దాటలేదు.ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో కెనడా చేసిన 137 పరుగులకే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. పిచ్‌పై ఇప్పటి వరకు జరిగిన మూడు మ్యాచ్‌ల్లోని ఆరు ఇన్నింగ్స్‌ల్లో రెండుసార్లు మాత్రమే జట్లు 100 పరుగుల మార్కును అధిగమించాయి. నసావు వికెట్ ఎలా ఉందో ఈ గణాంకాలు చూస్తే మనకు అర్ధమవుతుంది. అస్సలు బ్యాటింగ్‌కు అనుకూలంగా లేదు. దక్షిణాఫ్రికా, భారత్ వంటి మేటి జట్లు కూడా స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.అంతేకాకుండా ఆటగాళ్లు గాయాల బారిన కూడా పడుతున్నారు. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓ రాకసి బౌన్సర్ వల్ల టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మోచేతికి గాయమైంది. దీంతో మ్యాచ్ మధ్యలోనే రోహిత్ మైదానాన్ని వీడాడు. అయితే ఈ పిచ్‌పై రోహిత్ శర్మ సైతం అసహనం వ్యక్తం చేశాడు. ఈ వికెట్‌పై 140-150 వరకూ స్కోరు చేయడమే చాలా కష్టమని రోహిత్ చెప్పుకొచ్చాడు. అయితే భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు కొత్త పిచ్ ఉపయెగించనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ కొత్త పిచ్‌ను ఉపయోగిస్తే అది బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుందా లేక బౌలర్లకే సహకరిస్తుందా అన్నది వేచి చూడాలి.
అలా మొదలై.. 'డి' ఫర్ దినేశ్ వరకూ..
‘పడిపోవడంలో తప్పు లేదు కాని, పడ్డ ప్రతిసారి పైకి లేవడమే గొప్ప’... కన్ఫ్యూషియస్ చెప్పిన ఈ మాట అతనికి సరిగ్గా సరిపోతుంది. రెండు దశాబ్దాల క్రితం తొలిసారి భారత జట్టు తరఫున అతను అంతర్జాతీయ క్రికెట్లో అడుగు పెట్టాడు. ఈ ఇరవై ఏళ్ల అతని ప్రయాణం అందరికంటే ఎంతో భిన్నంగా సాగింది. ఆటలో ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నాడు. ఎంతో ప్రతిభ ఉన్నా అనివార్య కారణాలతో అతడికి జట్టులో చోటు దక్కలేదు. అయినా, ఏనాడూ ఆశ కోల్పోలేదు. ఎప్పుడూ సాధన మానలేదు. ఇక ముగించాలని భావించలేదు.స్థానం కోల్పోయిన ప్రతిసారి పట్టుదలగా పోరాడి పునరాగమనం చేశాడు. ఎప్పుడు వచ్చినా కొత్తగా ఏదో ఒకటి నేర్చుకొని తన ప్రత్యేకతను ప్రదర్శిస్తూ వచ్చాడు. మరోవైపు వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురయ్యాయి. మరొకరైతే అలాంటి స్థితిలో అన్నింటినీ వదిలేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయేవారేమో! కానీ అతను ధైర్యంగా నిలబడ్డాడు. ఎక్కడా తన కెరీర్‌పై ఆ ప్రభావం లేకుండా స్థితప్రజ్ఞతో ముందుకు సాగాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఆగిపోయినా ఐపీఎల్లో సత్తా చాటి తన విలువేంటో చూపించాడు. ఆడే అవకాశం లేని సమయంలో వ్యాఖ్యాతగా తన మాట పదునును ప్రదర్శించాడు.39 ఏళ్ల వయసులోనూ యంగ్‌గా, మైదానంలో చురుగ్గా ఆడుతూనే ఇటీవలే ఐపీఎల్‌కు ముగింపు పలికిన ఆ క్రికెటరే దినేశ్ కార్తీక్. గత ఇరవై ఏళ్లలో భారత జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా మారిన పెద్ద సంఖ్యలో మ్యాచ్‌లు ఆడిన ఇతర ఆటగాళ్లందరితో పోలిస్తే కార్తీక్ ప్రస్థానం వైవిధ్యభరితం, ఆసక్తికరం. దిగ్గజ ఆటగాళ్ల మధ్య కూడా తన ప్రత్యేకతను నిలుపుకోవడంలో అతను సఫలమయ్యాడు.భారత క్రికెట్లో వికెట్ కీపింగ్‌కు సంబంధించి అన్ని రుతువులతో పాటు ‘మహేంద్ర సింగ్ ధోని కాలం’ కూడా ఒకటి నడిచింది. వికెట్ కీపర్లను ధోనికి ముందు, ధోని తర్వాతగా విభజించుకోవచ్చు. ‘ధోని కాలం’లో ఎంతో మంది యువ వికెట్ కీపర్లు తెర వెనక్కి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఎంతో ప్రతిభ ఉన్నా, దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా ఆడుతూ వచ్చినా ధోని హవా, అతని స్థాయి ముందు అవన్నీ చిన్నవిగా మారిపోయాయి.అలాంటి బాధితుల జాబితాలో అగ్రస్థానం దినేశ్ కార్తీక్‌దే. 2008–2016 మధ్య ఐదు సీజన్ల పాటు అతను దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారించడంతో పాటు వికెట్ కీపర్‌గా కూడా రాణించాడు. కానీ ఈ ప్రదర్శన కూడా అతడికి టీమిండియాలో రెగ్యులర్‌గా చోటు ఇవ్వలేకపోయింది. నిజానికి ధోనికి ఏడాది ముందే భారత్ తరఫున టెస్టు మ్యాచ్ ఆడిన కార్తీక్...ధోని అరంగేట్రానికి మూడు నెలల ముందే వన్డేల్లోకి అడుగు పెట్టాడు.కానీ ఒక్కసారి ధోని పాతుకుపోయిన తర్వాత కార్తీక్‌కు అవకాశాలు రావడం గగనంగా మారిపోయింది. కానీ అతను ఎప్పుడూ నిరాశ పడలేదు. తన ఆటనే నమ్ముకుంటూ ముందుకు సాగాడు. కీపర్‌గా స్థానం లభించే అవకాశం లేదని తెలిసిన క్షణాన తన బ్యాటింగ్‌ను మరింతగా మెరుగుపరచుకున్నాడు. తన ప్రదర్శనలతో స్పెషలిస్ట్ బ్యాటర్‌గా తనకు చోటు కల్పించే పరిస్థితిని సృష్టించుకోగలిగాడు.అలా మొదలై...సెప్టెంబర్ 5, 2004... అంతర్జాతీయ క్రికెట్లో దినేశ్ కార్తీక్ తొలి మ్యాచ్. ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్‌తో జరిగిన ఈ పోరులో అద్భుత వికెట్ కీపింగ్‌తో అతను ఆకట్టుకున్నాడు. భూమికి దాదాపు సమాంతరంగా గాల్లో పైకెగిరి మైకేల్ వాన్‌ను అతను స్టంపౌట్ చేసిన తీరు ఈ కొత్త ఆటగాడి గురించి అందరూ చర్చించుకునేలా చేసింది. మరో రెండు నెలల తర్వాత ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్‌లో అరంగేట్రం.2007లో ధోని సారథ్యంలో భారత జట్టు సాధించిన టి20 ప్రపంచకప్ విజయాన్ని ఎవరూ మరచిపోలేరు. ఈ మెగా టోర్నీకి దాదాపు పది నెలల ముందు భారత జట్టు ఒకే ఒక అంతర్జాతీయ టి20 మ్యాచ్ ఆడింది. ఇందులో కూడా ధోని ఉన్నా, బ్యాటర్‌గా దినేశ్ కార్తీక్‌కు స్థానం లభించింది. దక్షిణాఫ్రికాపై మన టీమ్ నెగ్గిన ఈ పోరులో కార్తీక్కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ పురస్కారం దక్కడం విశేషం. చారిత్రాత్మక వరల్డ్ కప్ విజయంలో కూడా కార్తీక్ తన వంతు పాత్ర పోషించాడు.అలా మూడు ఫార్మాట్లలో కూడా అతను భారత జట్టులో భాగంగా మారాడు. టెస్టుల్లో కార్తీక్ హైలైట్ ప్రదర్శన 2007లోనే వచ్చింది. స్వింగ్‌కు విపరీతంగా అనుకూలిస్తూ అగ్రశ్రేణి బ్యాటర్లకే కొరుకుడు పడని ఇంగ్లండ్ గడ్డపై అతను సత్తా చాటాడు. కొత్త బంతిని ఎదుర్కొంటూ అక్కడి పరిస్థితుల్లో ఓపెనర్‌గా రాణించడం అంత సులువు కాదు. కానీ తాను ఎప్పుడూ ఆడని ఓపెనింగ్ స్థానంలో జట్టు కోసం ఆడేందుకు సిద్ధమయ్యాడు. నాటింగ్‌హామ్‌లో అతను చేసిన 77 పరుగులు, ఆ తర్వాత ఓవల్‌లో సాధించిన 91 పరుగులు భారత జట్టు 1986 తర్వాత ఇంగ్లండ్‌లో టెస్టు సిరీస్‌ను గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాయి.జట్టులోకి వస్తూ పోతూ...ఇంగ్లండ్‌లో రాణించిన తర్వాత కూడా కార్తీక్ కెరీర్ వేగంగా ఊపందుకోలేదు. తర్వాతి మూడేళ్లలో అతను 7 టెస్టులు మాత్రమే ఆడగలిగాడు. కీపర్ స్థానానికి అసలు అవకాశమే లేకపోగా, రెగ్యులర్ బ్యాటర్ స్థానం కోసం తన స్థాయికి మించిన అగ్రశ్రేణి ఆటగాళ్లతో పోటీ పడాల్సి రావడంతో తగినన్ని అవకాశాలే రాలేదు. వన్డేల్లోనైతే వరుసగా రెండు మ్యాచ్‌లలో ఆడే అవకాశం వస్తే అదే గొప్ప అనిపించింది. 2010లో వన్డే జట్టులోనూ స్థానం పోయింది. కానీ కార్తీక్ బాధపడలేదు.పునరాగమనం చేయాలంటే ఏం చేయాలో తనకు బాగా తెలుసని నమ్మాడు. అందుకే మూడేళ్ల పాటు దేశవాళీ క్రికెట్లో చెలరేగాడు. ఫలితంగా 2013లో ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ ట్రోఫీ టీమ్‌లో మళ్లీ స్థానం లభించింది. ధోని ఉన్నా సరే, బ్యాటర్‌గా చోటు దక్కించుకొని విజేతగా నిలిచిన జట్టులో సభ్యుడయ్యాడు. మరో ఏడాది తర్వాత టీమ్‌లో మళ్లీ చోటు పోయింది. ఇప్పుడూ అదే పని. దేశవాళీలో బాగా ఆడటంతో మూడేళ్ల తర్వాత వెస్టిండీస్ పర్యటనకు ఎంపికయ్యాడు.ఆ తర్వాత కొన్ని చక్కటి ప్రదర్శనలతో తర్వాతి రెండేళ్లు నిలకడగా రాణించిన అనూహ్యంగా 2019 వన్డే వరల్డ్ కప్ టీమ్‌లోనూ చోటు దక్కించుకొని అందరినీ ఆశ్చర్యపరచాడు. టెస్టుల్లో ధోని రిటైర్మెంట్ తర్వాత కూడా దురదృష్టవశాత్తూ కార్తీక్ పేరును పరిశీలించకుండా సెలక్టర్లు సాహాను ప్రధాన కీపర్‌గా తీసుకున్నారు. అయినా అతను కుంగిపోలేదు. ఏకంగా ఎనిమిదేళ్ల విరామం తర్వాత 2018లో మళ్లీ టెస్టు మ్యాచ్ బరిలోకి దిగగలిగాడంటే అతని పట్టుదల ఎలాంటితో అర్థమవుతుంది.2021 ముస్తక్ అలీ ట్రోఫీతో...మరచిపోలేని ప్రదర్శనతో...అంతర్జాతీయ టి20ల్లోనూ కార్తీక్ ప్రస్థానం పడుతూ లేస్తూనే సాగింది. వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడే అయినా ఎక్కువ అవకాశాలు రాలేదు. అన్నింటికీ ఒకటే సమాధానం...ధోని ఉండగా చోటెక్కడుంది? 2010లో భారత్ తరఫున టి20 ఆడిన మరో ఏడేళ్లకు 2017లో అతను తన తర్వాతి మ్యాచ్ ఆడాడంటే అతని కమ్‌బ్యాక్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అయితే 2018లో నిదాహస్ ట్రోఫీలో కార్తీక్ ప్రదర్శన అతనికి కొత్త అభిమానులను తెచ్చి పెట్టింది.సరిగ్గా చెప్పాలంటే 14 ఏళ్ల కెరీర్ తర్వాత ఇది కార్తీక్ మ్యాచ్ అనే గుర్తింపును తెచ్చి పెట్టింది. శ్రీలంకతో జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో భారత్ విజయానికి చివరి 12 బంతుల్లో 34 పరుగులు అవసరమయ్యాయి. ఈ దశలో కేవలం 8 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో అతను జట్టును గెలిపించాడు. ఆఖరి బంతికి అతను కొట్టిన సిక్సర్ హైలైట్‌గా నిలిచింది. ఎప్పుడో కెరీర్ ముగిసింది అనుకున్న దశలో 2022 టి20 వరల్డ్ కప్ జట్టులో కూడా అతను చోటు దక్కించుకొని 37 ఏళ్ల వయసులో అంతర్జాతీయ టి20 మ్యాచ్ ఆడటం మరో విశేషం. మరో వైపు ఐపీఎల్లో కూడా ఎన్నో మంచి ప్రదర్శనలు కార్తీక్‌కు గుర్తింపును తెచ్చి పెట్టాయి. ఐపీఎల్లో 6 టీమ్‌లకు ప్రాతినిధ్యం వహించిన కార్తీక్ విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ టీమ్‌లో సభ్యుడిగా ఉన్నాడు. ఐపీఎల్ మొదలైన 2008నుంచి 2024 వరకు కార్తీక్ 257 మ్యాచ్‌లు ఆడి అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంతో తన లీగ్ కెరీర్ ముగించాడు. ఈ టోర్నీలో 4842 పరుగులు చేసిన అతను అత్యధిక పరుగులు చేసినవారిలో పదో స్థానంలో నిలిచాడు.ఫ్యామిలీతో...ఆటుపోట్లు ఎదురైనా...కార్తీక్ స్వస్థలం చెన్నై. మాతృభాష తెలుగు. తండ్రి ఉద్యోగరీత్యా బాల్యం కువైట్‌లో గడిపినా... తర్వాత మద్రాసులోనే స్థిరపడ్డాడు. తండ్రి నేర్పించిన ఆటతో దిగువ స్థాయి క్రికెట్లో మంచి ప్రదర్శనలు ఇస్తూ సీనియర్ జట్టు వరకు ఎదిగాడు. అయితే ఆటగాడిగా భారత జట్టులో సుస్థిర స్థానం కోసం ప్రయత్నిస్తున్న సమయంలో కార్తీక్ వ్యక్తిగత జీవితంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. 2007లో అతను తన మిత్రురాలు నికితను పెళ్లి చేసుకున్నాడు.ఐదేళ్ల తర్వాత వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. అయితే తనతో వివాహ బంధంలో ఉండగానే భారత జట్టు, తమిళనాడు జట్లలో తన సహచరుడైన మురళీ విజయ్ను ప్రేమించడం, ఆపై తనకు దూరం కావడం అతడిని తీవ్రంగా బాధించాయి. ఆ డిప్రెషన్ నుంచి బయటపడేందుకు చాలా సమయం పట్టింది. ఎట్టకేలకు భారత స్టార్ స్క్వాష్ క్రీడాకారిణి దీపిక పల్లికల్‌తో పరిచయం అతని జీవితంలో కొత్త ఉత్సాహాన్ని తెచ్చింది. 2015లో వీరిద్దరు పెళ్లి చేసుకోగా, వీరికి మూడేళ్ల వయసు ఉన్న కవల అబ్బాయిలు ఉన్నారు. –మొహమ్మద్ అబ్దుల్ హాది
బిజినెస్
పెరగనున్న ఫర్నిచర్ ధరలు.. కారణం ఇదే..
దేశంలో ఫర్నిచర్ ధరలు వచ్చే ఏడాది పెరిగే అవకాశం ఉంది. వచ్చే ఏడాది నుంచి ప్లైవుడ్ తయారీదారులందరికీ ఐఎస్ఐ (ఇండియన్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూషన్) సర్టిఫికేషన్‌ను తప్పనిసరి చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు వార్తా సంస్థ ‘మింట్’ నివేదించింది. బాయిలింగ్ వాటర్ ప్రూఫ్‌గా ప్రచారం చేసే ప్లైవుడ్‌కు ఆ మేరకు ఐఎస్ఐ సర్టిఫికేషన్ కూడా అవసరముంటుందని ఇద్దరు అధికారులను ఉటంకిస్తూ పేర్కొంది.ఫర్నిచర్, ఇతర వస్తువుల్లో ఉపయోగించే ప్లైవుడ్ నాణ్యత, మన్నికను మెరుగుపరచడం, సవాళ్లతో కూడిన వాతావరణంలో కూడా అవి ఎక్కువ కాలం ఉండేలా చూడటం లక్ష్యంగా ఈ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఇండోనేషియా, వియత్నాం, మలేషియా, నేపాల్ నుంచి నాసిరకం ప్లైవుడ్ దిగుమతిని అరికట్టవచ్చని భావిస్తున్నారు. కొత్త ప్రమాణాల ప్రకారం ప్లైవుడ్ తయారీదారులు అన్ని గ్రేడ్ల ప్లైవుడ్‌కు ఫంగల్ నిరోధకత కోసం మైకోలాజికల్ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.ఈ నిబంధనపై ప్లైవుడ్ మేకర్స్ నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొత్త ప్రమాణాలు ప్లైవుడ్ నాణ్యతను మెరుగుపరుస్తాయని, వినియోగదారులతో పాటు తయారీదారులకు ప్రయోజనం చేకూరుస్తుందని కొందరు చెబుతుండగా మరికొందరు దీన్ని ఈ చర్యను వ్యతిరేకిస్తున్నారు.అయితే ఈ నిర్ణయం వల్ల వచ్చే ఏడాది ప్లైవుడ్ ధరలు 15 శాతం పెరుగుతాయని ఆల్ ఇండియా ప్లైవుడ్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ చైర్మన్ నరేష్ తివారీ తెలిపారు. నాసిరకం ప్లైవుడ్ ఉత్పత్తుల దిగుమతిపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన ప్లైవుడ్ తయారీదారులందరూ బీఐఎస్ నిబంధనలను పాటించాలని కోరారు. కాగా దీనిపై అటు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి గానీ, బీఐఎస్ ప్రతినిధుల నుంచి గానీ ఎలాంటి స్పందన లేదు.
ఎర్త్ రైజ్ ఫోటోతో ప్రపంచాన్నే మార్చేసిన నాసా ఆస్ట్రోనాట్ దుర్మరణం
అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా)లో విషాదం చోటు చేసుకుంది. నాసా రిటైర్డ్ వ్యోమగామి విలియం ఆండర్స్ (90) ఘోర విమాన ప్రమాదంలో మరణించారు.1968న నాసా అపోలో 8లో ముగ్గురు వ్యోమగాములు ఫ్రాంక్ బోర్మాన్, జేమ్స్ లోవెల్, విలియం ఆండర్స్ చంద్రుడి మీదకు పంపించింది.అయితే ఈ ముగ్గురు వ్యామగాములు డిసెంబర్ 24, 1968న చంద్ర కక్ష్యలోకి వెళ్లి తిరిగి డిసెంబర్ 27న భూమికి తిరిగి వచ్చారు. అప్పుడే భూమి మూలాలతో చంద్రుడికి సంబంధం ఉన్నట్లు వెల్లడించారు.ఆ ఫోటో తీసింది ఈయనే అపోలో 8లో చంద్రుడి చుట్టు తిరిగే సమయంలో ముగ్గురి ఆస్ట్రోనాట్స్‌లో ఒకరైన విలియం ఆండర్స్ చంద్రుడి ఉపరితలంపై నుంచి వెలుగుతూ కనిపిస్తున్న భూమి ఫోటోని తీశారు.ఈ ఫోటోకు ‘ఎర్త్ రైజ్’గా పేరు పెట్టారు. అంతరిక్షం నుంచి భూమికి తీసిన తొలి కలర్ ఫోటో ఇదీ.విమానంలో సాంకేతిక లోపంతాజాగా ఎర్త్రైజ్ ఫోటోతీసిన విలియం అండర్స్ జోన్స్ ద్వీపం తీరానికి చేరే సమయంలో ఆండర్స్ ప్రయాణిస్తున్న విమానం కుప్పకూలింది. ఈ విమానం ప్రమాదంలో అండర్స్ మరణించారని, ఆ విమానంలో తన తండ్రి మాత్రమే ఉన్నారంటూ అండర్స్ కుమారుడు గ్రెగ్ చెప్పారంటూ ది సీటెల్ టైమ్స్ నివేదించింది.ఆకాశం నుంచి అనంతలోకాల్లోకి కేసీపీక్యూ-టీవీ కథనం ప్రకారం..అండర్స్ పాతకాలపు ఎయిర్ ఫోర్స్ సింగిల్ ఇంజిన్ టీ-34 విమానంలో ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో లోపం తలెత్తడంతో ఆయన ప్రయాణిస్తున్న విమానం ఆకాశం నుంచి నిటారుగా సముద్ర తీర ప్రాంతాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అండర్స్ ప్రాణాలు కోల్పోవడంతో నాసాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఐఫోన్ ఇక్కడ కొంటే భారీ డిస్కౌంట్..
ఐఫోన్లు, యాపిల్ ఉత్పత్తులపై డిస్కౌంట్ల కోసం ఎదురుచూస్తున్నవారికి గుడ్‌న్యూస్ ఇది. ప్రముఖ భారతీయ ఎలక్ట్రానిక్స్ రిటైల్ చైన్ విజయ్ సేల్స్ జూన్ 8 నుంచి 17 వరకు "యాపిల్ డేస్" సేల్ ను నిర్వహిస్తోంది. ఆన్లైన్, ఇన్-స్టోర్ రెండింటిలోనూ యాపిల్ ఉత్పత్తులపై అద్భుతమైన డీల్స్‌ను అందిస్తోంది.ఐఫోన్లపై డిస్కౌంట్లు ఇవే..ఐఫోన్ 15 సిరీస్: ఐఫోన్ 15 ప్రారంభ ధర రూ.64,900, ఐఫోన్ 15 ప్లస్ ధర రూ.74,290, ఐసీఐసీఐ, ఎస్బీఐ బ్యాంక్ కార్డులపై రూ.6,000 వరకు తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది.ఐఫోన్ 15 ప్రో సిరీస్: ఐఫోన్ 15 ప్రో రూ .123,990, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ రూ .145,990 నుంచి ప్రారంభమవుతాయి. ఇందులో రూ .3,000 తక్షణ డిస్కౌంట్లు ఉన్నాయి.పాత ఐఫోన్ మోడల్స్: ఐఫోన్ 14, ఐఫోన్ 13 వంటి పాత మోడల్స్‌పై డీల్స్ వరుసగా రూ .57,990, రూ .50,999 నుంచి ప్రారంభమవుతాయి.ఇతర యాపిల్ ఉత్పత్తులపై.. ఐప్యాడ్లు: ఐప్యాడ్ 9వ జనరేషన్, ఐప్యాడ్ ఎయిర్, ఐప్యాడ్ ప్రో సహా వివిధ ఐప్యాడ్ మోడళ్లపై అద్భుతమైన ఆఫర్లు ఉన్నాయి. వీటి ధర రూ .24,990 నుంచి ప్రారంభమవుతుంది.మ్యాక్‌బుక్స్: శక్తివంతమైన ఎం1, ఎం2, ఎం3 చిప్‌లతో కూడిన మ్యాక్‌బుక్ ఎయిర్, మ్యాక్‌బుక్ ప్రో మోడళ్ల ధర రూ.67,490 నుంచి ప్రారంభమవుతుంది.యాపిల్ వాచ్: ఫిట్నెస్ను ట్రాక్ చేసే యాపిల్ వాచ్ సిరీస్ 9, ఎస్ఈ, అల్ట్రా మోడళ్ల ధరలు రూ .25,900 నుంచి ప్రారంభం.ఎక్స్‌క్లూజివ్ బెనిఫిట్స్ఇన్ స్టంట్ డిస్కౌంట్లు: ఐసీఐసీఐ, ఎస్బీఐ బ్యాంక్ కార్డుదారులు తమ కొనుగోళ్లపై రూ.10,000 వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు.ఎక్స్ఛేంజ్ బోనస్: ఇన్-స్టోర్ కస్టమర్లు క్యాషిఫై ద్వారా రూ .12,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ పొందవచ్చు.మైవీఎస్ లాయల్టీ ప్రోగ్రామ్: అన్ని కొనుగోళ్లపై 0.75 శాతం లాయల్టీ పాయింట్లను పొందవచ్చు. వీటిని తర్వాత రీడీమ్ చేసుకోవచ్చు.
ప్రపంచంలో 7000 ‘జాంబీ కంపెనీలు’.. ఏంటివి?
అప్పుల ఊబిలో కూరుకుపోయి మనుగడ అంచున కొట్టుమిట్టాడుతూ రుణాలపై వడ్డీని కూడా చెల్లించలేని స్థితిలో ఉన్న కంపెనీలను జాంబీ కంపెనీలుగా వ్యవహరిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి జాంబీ కంపెనీల సంఖ్య గత పదేళ్లలో గణనీయంగా పెరిగింది.అసోసియేటెడ్ ప్రెస్ విశ్లేషణలో జాంబీ కంపెనీల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా దాదాపు 7,000 పబ్లిక్ ట్రేడెడ్ కంపెనీలకు పెరిగింది. ఒక్క యునైటెడ్ స్టేట్స్లోనే ఇలాంటి కంపెనీలు 2,000 లకు చేరాయి. ఏళ్ల తరబడి చౌక రుణాలు పేరుకుపోవడం, మొండి ద్రవ్యోల్బణం రుణ వ్యయాలను దశాబ్ద గరిష్టాలకు నెట్టింది.వీటిలో అనేక చిన్న, మధ్య తరహా కంపెనీలు త్వరలోనే తమ లెక్కల రోజును ఎదుర్కోవలసి రావచ్చు. వందల బిలియన్ డాలర్ల రుణాలను వారు తిరిగి చెల్లించలేకపోవచ్చు. గత మూడేళ్లలో కార్యకలాపాల ద్వారా తమ రుణాలపై వడ్డీని కూడా చెల్లించడానికి తగినంత డబ్బు సంపాదించడంలో విఫలమైన కంపెనీలను సాధారణంగా జాంబీలుగా నిర్వచిస్తారు.కార్నివాల్ క్రూయిజ్ లైన్, జెట్ బ్లూ ఎయిర్ వేస్, వేఫేర్, పెలోటన్, ఇటలీకి చెందిన టెలికాం ఇటాలియా, బ్రిటిష్ సాకర్ దిగ్గజం మాంచెస్టర్ యునైటెడ్ లను నడుపుతున్న కంపెనీలతో సహా ఆస్ట్రేలియా, కెనడా, జపాన్, దక్షిణ కొరియా, యునైటెడ్ కింగ్డమ్, యూఎస్‌లలో గత దశాబ్దంలో ఇలాంటి కంపెనీల సంఖ్య 30 శాతం పెరిగిందని అసోసియేటెడ్ ప్రెస్ విశ్లేషణలో తేలింది.మార్చిలో ఫెడరల్ రిజర్వ్ కోత ప్రారంభిస్తుందనే అంచనాతో రుణదాతలు తమ వాలెట్లను తెరవడంతో ఈ ఏడాది మొదటి కొన్ని నెలల్లో వందలాది జాంబీ కంపెనీలు తమ రుణాలను రీఫైనాన్స్ చేసుకున్నాయి. దీంతో గత ఆరు నెలల్లో 1,000 కి పైగా జాంబీ కంపెనీల స్టాక్స్ 20 శాతానికి పైగా పెరగడానికి సహాయపడింది. కానీ చాలా కంపెనీలు రీఫైనాన్స్ పొందలేకపోయాయి. ఇప్పుడు ఈ సంవత్సరం మొదటి, ఏకైక ఫెడ్ కోతను ఆశిస్తున్న నేపథ్యంలో జాంబీ కంపెనీలు 1.1 ట్రిలియన్ డాలర్ల రుణాలను చెల్లించాల్సి ఉంది.
వీడియోలు
కేంద్రం నుండి రామ్మోహన్ రాయుడు, పెమ్మసాని ఫోన్ కాల్
డ్రాగన్ కంట్రీ కుట్రలో మాల్దీవులు..!?
మహేష్ బాబును మార్చేస్తున్న రాజమౌళి..
వాజపేయి సమాధి వద్ద మోదీ నివాళులు
మంత్రి పదవి ఎవరెవరికి ?
మోడీ ప్రమాణ స్వీకారానికి దేశాధినేతలు
కేంద్రమంత్రివర్గంలో చోటుపై ఏపీ కూటమి నేతల లెక్కలు
డోనాల్డ్ ట్రంప్ కు అమెరికన్ల నుంచి ఊహించని షాక్
చేప ప్రసాదం కోసం భారీ క్యూ
మహాత్ముడికి మోడీ నివాళి
ఫ్యామిలీ
బ్యాడ్ లాంగ్వేజ్ ఉపయోగిస్తున్నారా? పరిశోధనలో షాకింగ్ విషయాలు
పట్టరాని కోపం, చిరాకు వచ్చినప్పుడు మాట్లాడే భాష, వైఖరీ మారిపోతుంది. అనాలనుకున్న నాలుగు మాటలు అనేస్తా గానీ ఆ కోపం తగ్గిన ఫీలింగ్ రాదు. కోపం, భాధ, ఆవేదన వంటి భావోద్వేగాలను కొందరూ ఆపుకోలేరు. ఏదైన ఎక్స్‌ప్రెస్ చేసేయాల్సిందే. అయితే ఇలా మనసులో బాధ, కోపాన్ని వెళ్లగక్కడమే మంచిదంటున్నారు. ఆ టైంలో పరుషంగా లేదా బ్యాడ్ లాంగ్వేజ్‌లో మాట్లాడటం వంటివి చేస్తాం. ఇలా చేయడమే మంచిదంటున్నారు శాస్త్రవేత్తలు. ఇలా చేస్తే మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని చెబుతున్నారు. ఇదేంటీ..బ్యాడ్ లాంగ్వేజ్ మాట్లాడమని ప్రోత్సహిస్తున్నారా అని కోప్పడకండి. ఇలా అనడానకి కారణం ఏంటంటే..కోపం, ఒత్తిడి, ఆందోళనకు గురైనప్పుడూ బ్యాడ్ లాంగ్వేజ్‌లో మాట్లాడుతుంటారు. కొందరూ ఆ వ్యక్తి మీద లేదా పని మీద కోపాన్ని ఇలా పరుష పదజాలం రూపంలో బయటకు వెళ్లగక్కేస్తారు. ఇలా చేస్తే మనసులో ఉన్న బాధ, కోపం, ఒత్తిడి తగ్గిపోయి రీలిఫ్ అయిపోతారట. ఒత్తిడి లేదా ఆందోళనను వదిలించుకోవడానికి ఇదో ఒక గొప్ప మార్గం అని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. అందుకోసం పాక్ వైద్యుడు వకార్ హుస్సేన్ పది మంది పెద్దలు, దాదాపు 98 మంది పురుషులు, 155 మంది స్త్రీలపై వివిధ దశల వారిగా అధ్యయనం చేశారు. వారిలో కొందరూ భావోద్వేగాలను అణుచుకుని బయటకు ఎక్స్ప్రెస్చేయకపోవడంతో..వారిలో ఆందోళన, ఒత్తిడి ఎక్కువగా ఉన్నట్లు వెల్లడయ్యింది. తమ కోపాన్ని, చిరాకుని వెళ్లగక్కేలా బ్యాడ్ లాంగ్వేజ్‌లో మాట్లాడే పురుషులు, స్త్రీలల్లో ఆందోళన, ఒత్తిడి తక్కువగా ఉన్నట్లు తేలింది. అంతేగాదు పరిశోధనలో భావోద్వేగాలను అణిచివేయడం లేదా దాచేసుకునే వారిలో మానసిక ఆరోగ్యం క్షీణించిపోయి వివిధ రకాల అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని వెల్లడించారు వైద్యుడు హుస్సేన్.అయితే ప్రతిసారి ఇలా అగ్రెసివ్‌గా లేదా కోపంగా చిరాకులో మాట్లాడే కఠిన పరుష పదజాలం.. మన స్నేహితులు, బంధువుల మనసులు గాయపడేలా చేస్తాయి. ఒక రకంగా బంధాలు దూరమవుతాయి. అందుకే మన పెద్దలు కోపంలో వచ్చే ప్రతి మాట మనిషి వినాశనానికి హేతువు అని నొక్కి చెబుతుంటారు. కోపంగా ఉన్నప్పుడూ ఏదో ఒక పని చేయడం లేదా అక్కడ నుంచి దూరంగా వెళ్లిపోవడం వంటివి చేయమంటారు. సైంటిఫిక్‌గా ఇలా వెళ్లగక్కడం వల్ల లోపలున్న బాధ లేదా కోపం తీరిపోయి ఆ క్షణం మీరు బాగున్నట్లు ఉన్నా దీర్ఘకాలంలో..అదే మన బాంధవ్యాలను విచ్ఛిన్నం చేసి మనల్ని ఒంటరిని చేసే అవకాశం ఉందని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఈ కోపం, బాధ, ఆందోళన, ఒత్తిడి, చిరాకులను తగ్గించుకునే ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోమని సూచిస్తున్నారు. అవేంటంటే..స్మార్ట్ఫోన్లు, గాడ్జెట్లు, కంప్యూటర్లతో గడిపే సమాయాన్ని ఏదో విధంగా తగ్గించడంకెఫిన్ ఎక్కువగా తీసుకోవడం తగ్గించండియోగా, మెడిటేషన్ వంటివి చేయండిబ్రీథింగ్ ఎక్సర్సైజులు కూడా ఈ భావోద్వేగాలను జయించగలిగేలా చేస్తుంది. అతిగా కాఫీ లేదా టీ, ఎనర్జీ డ్రింక్స్ వంటివి కేంద్ర నాడీ వ్యవస్థను ప్రేరేపిస్తాయి. ఇవి ఆందోళనకు, నిద్రలేమికి కారణమవుతాయి. అన్ని వయసుల వారు వ్యాయామం చేయడానికి కనీసం 30 నిమిషాలు కేటాయించడం మంచిది. దీని వల్ల బ్రెయిన్లో కార్డిసాల్ స్థాయిలు తగ్గి శ్వాసపై ధ్యాస పెరుగుతుంది. ఇలాంటి వాటితో భావోద్వేగాలను జయించి.. ఆరోగ్యకరమైన ఆనందకర జీవితాన్ని గడపండి అని చెబుతున్నారు నిపుణులు.(చదవండి: మోదీ ప్రమాణా స్వీకారోత్సవంలో పాల్గొననున్న మహిళా లోకో పైలట్లు వీరే..!)
ఈ 'ట్రే గార్డెన్' ని ఎప్పుడైనా చూశారా?
చిన్న చిన్న ఎడ్లబండ్లు వాటిలో గ్రామీణ మహిళల బొమ్మలు, చెక్క కుర్చీలు వాటి ముందు చిట్టి చిట్టి బొమ్మలు, హంసలు, పక్షులు, గూళ్లు, గుడిసెలు.. ఇలా ముచ్చటైన వస్తువుల కూర్పుతో ట్రే గార్డెన్‌ను ఎవరికి వారు తయారు చేసుకోవచ్చు. ఇంట్లో చిన్నపాటి స్థలంలో కూడా వీటిని అందంగా అలంకరించవచ్చు.ఈ విషయాన్ని తన కళతో నిరూపిస్తోంది హర్యానాలోని ఫరీదాబాద్ వాసి యాభై ఐదేళ్ల శారదా గోదారా. తోటలు, పార్కులను పోలిన మినియేచర్ ట్రే గార్డెన్స్‌ను రూపొందిస్తోందామె. నడివయసులో ఒంటరితనం పోగొట్టుకోవడానికి చేసిన ఆలోచన ఆమెను ఇలా అందమైన లోకంలో విహరించేలా చేసింది. తన ఇంటిలో వెయ్యి మొక్కలతో మినీ జంగిల్‌ను క్రియేట్ చేసింది.‘మా ఇంటి బయట, మెట్లు, బాల్కనీలు, పెరడు వరకు రకరకాల అందమైన మొక్కలతో నింపేశా. ఆ తర్వాత చిన్న ట్రే గార్డెన్ల తయారీని మొదలుపెట్టాను. అభిరుచి ఉంటే చాలు ఒంటరితనానికి ఎదర్కోవడానికి, ఇంటిని అందంగా అలంకరించడానికి ఇదొక మంచి మార్గం. ఒక గంటలోపు ఒక మినీ ట్రే గార్డెన్‌ను రూపొందించుకోవచ్చు. రంగు రంగుల గులకరాళ్లు, చిట్టి పొట్టి మొక్కలు, చిన్న చిన్న మెట్లు, గుడిసెలు.. ఇతర అలంకరణ వస్తువులతో తయారైన ఈ మినీ ట్రే గార్డెన్లను చూస్తుంటే ఎంతో ఆనందంగా కలుగుతుంది’ అని తన గార్డెన్ పెంపకం విషయాలను ఆనందంగా చెబుతుందామె.ట్రే గార్డెన్‌ని మీరూ ఇలా సృష్టించుకోవచ్చు...ముందుగా గార్డెన్ థీమ్‌ను దృష్టిలో ఉంచుకొని, కాగితం మీద స్కెచ్ వేసుకోవాలి. పరిమాణం, ఆకారం, మట్టి, ఇతర అలంకార వస్తువులను బట్టి తగిన సిరామిక్ ట్రేని ఎంచుకోవాలి.గార్డెన్‌కు బేస్‌ను సృష్టించడానికి పాటింగ్ మిక్స్‌తో ట్రేని నింపాలి. సారవంతమైన మట్టిలో 15 శాతం ఆవుపేడ, 15 శాతం కోకోపిట్ కలపాలి.వీటిలో స్నేక్‌ప్లాంట్, స్పైడర్ వంటి చిన్న చిన్న మరుగుజ్జు మొక్కలను నాటాలి. పైనుంచి మట్టిని గట్టిగా నొక్కి, నీళ్లు పోయాలి. తర్వాత రంగు రంగుల గులకరాళ్లు, గంటలు, బొమ్మలు వంటి అలంకరణ వస్తువులతో ట్రే తోటను అలంకరించాలి. స్ప్రే బాటిల్‌ను ఉపయోగించి ట్రేలోని మొక్కలకు నీళ్లు పోయాలి.ఫంగల్ దాడుల నుంచి మొక్కలను కాపాడుకోవడానికి అరటి, వెల్లుల్లి, అల్లం, ఉల్లిపాయ తొక్కలు.. వంటి వంటగది వ్యర్థాలను ఉపయోగించి చేసే ద్రవ కంపోస్ట్‌ను పిచికారీ చేసుకోవచ్చు..ఇవి చదవండి: ఫోటోగ్రాఫర్..!
ఫోటోగ్రాఫర్..!
చాలా ఏళ్ళ నా కల FRAMES ఫొటో స్టూడియో. ఆ రోజే ఓపెనింగ్. మా గురువుగారు విచ్చేసి స్టూడియోకి ఒక కాప్షన్‌ని కానుకగా ఇచ్చారు.‘There's more to life that meets the camera eye!’. ‘ఈ కాప్షన్కి అర్థమేంటి గురువు గారు?’ అడిగాను నేను.'You don't have to know everything. You'll know it when you see it' అన్నారాయన.ఆయన ఎందుకలా అన్నారో నాకు అప్పుడు అర్థం కాలేదు. ఎప్పటికైనా సరే, ఈ కాప్షన్ ఎందుకు పెట్టారో తెలుసుకోవాలనిపించింది. స్టూడియో ఓపెనింగ్ రోజున గంగిరెద్దుల్ని ఆడించే ఆయనొచ్చాడు. నాకు శుభసూచకంగా అనిపించింది. చిన్నప్పటి నుండి సంక్రాంతి వచ్చిందంటే చాలు వారితో వీధులు కళకళలాడిపోయేవి. అందుకే వారిని చూసినప్పుడల్లా శుభానికి చిహ్నాలుగా నా స్మృతిపథంలో మిగిలిపోయారు. ఆ గంగిరెద్దులాయన నా ముందు తన కోరికను వెలిబుచ్చాడు.‘బాబయ్యా, మా బసవణ్ణతో ఒక్క ఫొటో తీసిపెట్టవా? బసవడితో ఒక్క ఫోటో దిగాలన్న కోరిక అలాగే మిగిలిపోయుండాది.’నేను సమాధానం ఇచ్చేలోపే మా గురువుగారు అడ్డుపడ్డారు. ‘ఫ్రేమ్ అప్పర్స్ అని ఫ్రేమ్ డౌనర్స్ అని ఉంటారు. ఫొటోగ్రాఫర్ మొదటి ఫ్రేమ్ అందంగా ఉండాలి. రోజూ చూసే మొహాల్ని ఏం తీస్తాం చెప్పు’అంటూ నవ్వాడు ఆయనొక్కడే.ఆ గంగిరెద్దులాయనే కాదు నేను కూడా ఎంతగానో నొచ్చుకున్న సందర్భం అది. కానీ గురువుగా ఆయననే ఆహ్వానించాను కాబట్టి, ఆ రోజున ఆయన మాటకు ఎదురు చెప్పలేకపోయాను. బాధతో నిష్క్రమించిన ఆ గంగిరెద్దులాయన మాత్రం నా మస్తిష్కం అనే ఫొటోస్టూడియోలో ఫ్రేమ్‌గా మిగిలిపోయాడు.నేనొక ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్‌ని. పైగా నాస్తికుడిని కూడా. నాకు ఫొటోగ్రఫీ నేర్పించిన గురువుగారి ప్రభావం నాపై చాలా ఉండేది. ఆయన ఏం చేస్తే అది చేస్తూ ఉండేవాణ్ణి. ఆయన ఎథీస్ట్ అని తెలిసింది ఒక రోజున. ఆ ఇంగ్లిష్ పదానికి అర్థం తెలియకపోయినా నేనూ అదేనంటూ ప్రగల్భాలు పలికా నా మిత్రుడితో. అతను పరమ భక్తుడు. వెంటనే నవ్వేశాడు.‘ఎందుకు నవ్వుతున్నావ్?’ ‘ఆ పదానికి అర్థం కూడా తెలీకుండా నేనూ అదే అంటూవుంటే నవ్వొచ్చిందిరా!’‘అయినా దేవుడు ఎక్కడున్నాడురా? క్లాస్‌లో మన సర్ చెప్పింది వినలేదా? ఆయన లాజిక్ నూటికి నూరు శాతం కరెక్ట్. కనిపించని వాటిని నమ్మకపోవటమే నయం.’ ‘ఒకటి లేదు అంటున్నావంటేనే దాని ఉనికిని నువ్వు అంగీకరిస్తున్నట్టే లెక్క కదరా..‘‘అర్థం కాలేదు!’ ‘ఒకప్పుడు ఉండటం అంటూ జరిగితేనే కదా ఇప్పుడు లేకపోవటం అంటూ జరిగేది. ఒక వస్తువు ఇక్కడ పెట్టావు. అదిప్పుడు లేదు. ఒక అరగంట క్రితం ఇక్కడే ఉంది. ఇప్పుడు నీ ముందు లేదంతే. ఎక్కడో ఉంది. అది నీకు కనబడట్లేదు.’‘అర్థం అవుతున్నట్టే ఉంది. కానీ నువ్వు భక్తుడివి కాబట్టి నేను కన్విన్స్ అవ్వట్లేదురా..’ ‘ఉంది అన్నా, లేదు అన్నా దాని ఉనికిని అంగీకరిస్తున్నట్టే అవుతుంది కదరా! అసలు ఆ బ్రహ్మ పదార్థం ఉందో లేదో అనుభవం ఉన్నవాళ్లు చెప్పాలి. దైవత్వం అనుభవంలోకి వస్తే ఇంకా మాటలెందుకు మిగులుతాయి చెప్పు..? కాబట్టి వ్యర్థమైన వాదనలతో కాలాన్ని వృథా చేసుకోకు. ఆయన గురువే కావొచ్చు. ఆయన చెప్పిన దాంట్లో నీకు పనికొచ్చే విషయాల్ని మాత్రమే తీసుకో! అనవసరం అయిన వాటి జోలికి వెళ్ళకు. మిత్రుడిగా నీ మంచి కోరి చెబుతున్నా. ఇక నీ ఇష్టం!’వాడి మాటల్లో ఏం మాయ ఉందో తెలీదు కానీ, కేవలం ఫొటోగ్రఫీ పైనే దృష్టి పెడుతూ మిగతా విషయాల్ని పక్కన పెట్టేశాను. అప్పటి నుండి మంచి ఫొటోగ్రాఫర్ అవ్వటమే లక్ష్యంగా పనిచేశాను. అలాంటి నేను ఇప్పుడు చేతిలో పనిలేకుండా అయిపోయాను. రోజూ స్టూడియోకి వెళుతున్నాను. పని ఉండట్లేదు. దానికి కారణం స్మార్ట్‌ఫోన్ డిజిటల్ ఫొటోగ్రఫీ అని నా ప్రగాఢ నమ్మకం.ఇన్నేళ్లల్లో స్మార్ట్‌ఫోన్‌ని నేనెప్పుడూ వాడలేదు. ఎందుకో ఆ స్మార్ట్‌ఫోన్ భూతాన్ని చూస్తేనే చిరాకు. నాలాంటి ఎంతోమంది ఫొటోగ్రాఫర్లకు పనిలేకుండా చేస్తోంది. ఒకప్పుడు పాస్‌పోర్ట్ సైజు ఫొటో కోసం ఎగబడేవాళ్లు. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌తోనే తీసి అప్లోడ్ చేసి పంపించేస్తున్నారు చాలామంది. ఒకప్పుడు ఫ్రెండ్స్ కలిసి గుర్తుగా ఫొటోలు దిగేవాళ్ళు మా స్టూడియోలో. మా స్టూడియోకొచ్చిన వాళ్లతో ఎటువంటి సంబంధం లేని ఒక ఫొటోగ్రాఫర్ తన నిర్మలమైన దృష్టితో ఒక ఫొటో తీస్తాడు. అంటే ఆ కాలాన్ని తన కంటితో బంధిస్తున్నాడు. ఆ క్షణానికి సొంతమైన ఒక నిజాన్ని ఫ్రేమ్ చేస్తున్నాడు. ఇది ఒక ఘనతే అనుకోవచ్చు. అలాంటి కళను మా నుండి దూరం చేసిన భావన కలిగింది ఈ స్మార్ట్‌ఫోన్ డిజిటల్ ఫొటోగ్రఫీ ఎక్కువైపోయాక! అందుకే నా జీవితంలో ఈ స్మార్ట్‌ఫోన్ భూతాన్ని దరిజేరనివ్వను అని శపథం చేశాను. అలాంటి నేను ఆ స్మార్ట్‌ఫోన్ చేతిలోనే అంత ఘోరంగా ఓడిపోతానని కలలో కూడా ఊహించలేదు.నాకు పొద్దున్నే న్యూస్ పేపర్ చదవటం అలవాటు. న్యూస్‌లో కూడా క్రైమ్ సెక్షన్ అంటే ప్రత్యేకమైన ఇంట్రెస్ట్. ఒకరోజు పొద్దున్నే ఒక క్రైమ్ న్యూస్ కవరేజ్ నన్ను అమితంగా ఆకర్షించింది. పుణేలోని ఒక డెలివరీ బాయ్ దాదాపు 15 లక్షలు విలువ చేసే 18 స్మార్ట్‌ఫోన్స్ చోరీ చేశాడు అన్నది ఆ వార్త. ఇదంతా ఒక రెండు నెలల వ్యవధిలో జరిగిందట.కస్టమర్స్ స్మార్ట్‌ఫోన్ ఆర్డర్ చేశాక రీప్లేస్మెంట్ పెట్టుకునే ఆప్షన్ ఒకటుంది. వాళ్లకి హ్యాండ్ సెట్ నచ్చని పక్షంలో! ఈ సదుపాయాన్ని ఆ డెలివరీ బాయ్ దుర్వినియోగం చేశాడు. ఆ డెలివరీ బాయ్ స్మార్ట్‌ఫోన్‌ని తనే దోచేసి, కస్టమర్ రీప్లేస్మెంట్ పెట్టినట్టుగా సృష్టించాడట! అలా హ్యాండ్ సెట్ రీప్లేస్మెంట్ ఉన్న కస్టమర్ల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూపోయే సరికి ఈ అబ్బాయి మీద అనుమానం పెరిగి చివరికి అరెస్ట్ చేశారు.క్రైమ్ న్యూస్ ఇప్పటికి చాలాసార్లు చదివాను. కానీ ఎప్పుడూ కలగని ఓ ఆలోచన ఈసారి మాత్రమే కలిగింది. నాకు కూడా స్మార్ట్‌ఫోన్ చోరీ చేద్దాం అనిపించింది. నేను ఇంతవరకు స్మార్ట్‌ఫోన్ వాడలేదు. ఇంట్లో వాళ్ళని కూడా అడగలేదు. ఇన్నేళ్లల్లో స్మార్ట్‌ఫోన్‌కు, నాకూ మధ్యనున్న ఒక తెలియని దూరం శతృత్వంగా స్థిరపడిపోయింది నా మదిలో. నాకు పనిలేకుండా చేసిన ఆ స్మార్ట్‌ఫోన్‌ని ఇంకొకరికి దూరం చేసి దానిపై నాకుండిపోయిన పగ సాధిద్దాం అనిపించింది.నాకు తెలిసిన ఒక డెలివరీ బాయ్ ఒకరోజు తను డెలివరీ చెయ్యాల్సిన ఐటమ్స్‌లో ఆ ఖరీదైన ఒక స్మార్ట్‌ఫోన్‌ని తీసుకుని అదేదో నా కోసమే అన్నట్టుగా మా స్టూడియోకొచ్చాడు. ‘అన్నా, ఇవ్వాళ వర్క్ లోడ్ ఎక్కువైపోయింది. అన్ని ఆర్డర్లు డోర్ డెలివరీ చేయగలిగాను కానీ చివరిగా ఒక్క స్మార్ట్‌ఫోన్ మిగిలిపోయింది. ఇది మీరు ఇంటికెళ్ళే దారిలోనే ఉన్న అడ్రస్. చాలా సందులు, గొందులు తిరగాలి. దయచేసి ఈ ఒక్కసారికి ఇచ్చేస్తావా?’ అని అడిగాడు. ‘సరే.. అడ్రస్ ఎక్కడన్నావ్?’‘అదే అన్నా.. మీ ఇంటి దగ్గర నేతి గారెల షాప్ బాగా ఫేమస్ కదా! ఆ సందులోనే చివరి ఇల్లు. శివుడి ఇల్లు అని అడిగితే ఎవరైనా చెబుతారంట మరి!’‘శివుడి ఇల్లా? అది కైలాసం కదా..’ అన్నాను.‘ఇంటి దొంగను ఈశ్వరుడు అయినా పట్టలేడు అంటారు. వీళ్ళ ఇంటికి ఆ ఇబ్బందేం లేదనుకుంటా’ అంటూ నవ్వాడు వాడు.స్మార్ట్‌ఫోన్ కొట్టేద్దామనే నా ఆలోచన పసిగట్టినట్టే సామెత చెప్పాడేంటీ అని ముచ్చెమటలు పట్టాయి నాకు. దేవుడనే వాడుండి.. జరగబోయేదాన్ని ఇలా ముందుగానే పలికిస్తాడా ఏంటీ.. అనిపించింది. ‘శివుడు ఆయన పేరా?’ మళ్ళీ అడిగాను.‘అదే తెలియట్లేదన్నా.. శివుడి ఇల్లు అని అడిగితే ఎవరైనా చెబుతారని ఇందాక కస్టమరే చెప్పాడు ఫోన్లో అక్కడికెళ్ళాక డౌట్ వస్తే నాకు కాల్ చెయ్’ అన్నాడు.నేను ధైర్యం చేశాను. స్టూడియో కట్టేసి ఆ స్మార్ట్‌ఫోన్ తీసుకుని రోజూ నేను వెళ్లే దారిలోనే వెళుతున్నాను. కానీ, అవ్వాళ నా మనసు మనసులో లేదు. ధ్యాస అంతా దొంగతనంపైనే ఉంది. నేను వెళ్లే దారిలో శివుడి గుడి ఒకటుంటుంది. ప్రతిరోజూ, అక్కడి నుండి ఏదో ఒకటి వినిపిస్తూనే ఉంటుంది. ఆరోజు మొట్టమొదటిసారి చెవులు రిక్కించి వింటున్నానో.. మరేంటో తెలియదు కానీ గుడిలో జరుగుతున్న ప్రవచనంలో నుండి కొన్ని మాటలిలా వినబడ్డాయి.. ‘ఎదుటివాడికి మోసం చెయ్యాలనే బుద్ధి పుట్టినప్పుడే మనం మోసం చేసేసినట్టు.ఏ కర్మ చెయ్యాలన్నా అది మనసులో నుండి పుట్టాలి. అలాంటి కర్మ చెయ్యాలి అనే ప్రేరణను బుద్ధి మనకిస్తుంది. అది మంచి అయినా.. చెడు అయినా! ఆ బుద్ధికి ప్రేరణను దేవుడే కలిగిస్తున్నాడనుకుంటాడు మనిషి. అందుకే, చెడు కూడా ఆయనే చేయిస్తున్నాడన్న భ్రమలో బతుకుతాడు. నిజానికి నువ్వు చేసే మంచికి ఆయన కారణం కాదు. నువ్వు చేస్తున్న చెడుకి ఆయన కారణం కాదు. ఎవరి కర్మానుసారం వారు ప్రవర్తిస్తూంటారు. భగవంతుడు మనలో ఉండే ఆత్మ చైతన్య శక్తి మాత్రమే!’ఆగి ఒక్క నిమిషం అటు వైపుగా చూశాను. నాలో ఉదయించబోయే కాంతికి ఆయన వాక్యాలు సంకేతాలుగా కనబడ్డాయి. అనుకోకుండా ఆ ప్రవచనకర్త వైపు చూశాను. లిప్త కాలమైనా సరే ఏదో తెలియని అలౌకిక స్థితి నెలకొన్నది నాలో. ఆ భావాన్ని ఏమంటారో చెప్పలేని మనఃస్థితి నాది. ఇన్ని విషయాలు నా గుండెకేం తెలుస్తాయి.. కన్నీటి రూపంలో వెల్లడయ్యాయి.జ్ఞానం వచ్చే లోపే అహం అడ్డొస్తుంది. అహం దహనం అయితే తప్ప అజ్ఞానం తొలగదు. అజ్ఞానం పూర్తిగా తొలిగితే తప్ప జ్ఞానం రాదు. అప్పుడు నాకదే జరిగింది. కన్నీళ్లు తుడుచుకుని సరాసరి ఆ నేతి గారెల షాప్ వరకు వెళ్లాను.. ఏ ఆలోచనను రానివ్వకుండా! అక్కడ ఒకతను కనిపించాడు. ‘శివుడి గారిల్లు తెలుసా అండి?’ అడిగానో లేదో ‘నేను ఆయనింటికే వెళుతున్నానండీ.. ఇంతకీ మీరెవరు?’ తిరిగి ప్రశ్నించాడు. ‘ఆయనకో పార్సెల్ ఇవ్వటానికి వచ్చానండీ..’ అని చెప్పేసి ఆ వస్తువును అక్కడే పెట్టేసి అక్కడి నుండి వెళ్ళిపోయాను భయం భయంగా. ఆయన నన్ను పిలుస్తున్నా సరే వెనక్కి తిరిగి చూడలేదు. కొంత దూరం నడిచాక మళ్ళీ వెనక్కి తిరిగొచ్చాను. నేతి గారెల షాప్‌లో చుట్టూ చూశాను. ఆయన కనబడలేదు. ఈసారి షాప్ ఓనర్ని శివుడి ఇల్లు చిరునామా అడిగాను. చెప్పాడు.ఆయన చెప్పిన వీధిలో వెళుతూంటే శివుడి ఇల్లు కనబడింది దూరం నుంచి. ఎవరో ఒకాయన ఒక వస్తువును ఆ ఇంటి ప్రహరీగోడపై ఉంచి మాట్లాడుతూన్నాడు. శివుడితోటే కాబోలు. ఆ వస్తువును గోడపై ఉంచిన విషయం మరిచిపోయి ఆయన, శివుడు ఇరువురూ ఇంట్లోకి కదిలారు. వెంటనే నేను నా ముఖం కనిపించకుండా చొక్కాని పైకి లాక్కుని.. మెల్లగా ఆ వస్తువును తీసుకుని అక్కడి నుండి పరిగెత్తాను. వెనక్కి తిరిగి చూడకుండా అలా చీకట్లో ఎంత సేపు పరిగెత్తానో తెలీదు. ఇంటికి చేరిపోయాను.శివుడి దగ్గరుండాల్సిన ఆ వస్తువు ఇప్పుడు నా దగ్గరుంది. తెరిచి చూశాను. స్మార్ట్‌ఫోన్.. నిజంగానే నా కంటికి భూతంలా కనిపించింది. చార్జింగ్ పెట్టి వాడదామనుకున్నాను. ఇప్పుడు దాన్ని చూస్తూంటే పరమశివుడి చేతిలో ఉండే డమరుకం గుర్తుకొస్తోంది. శివుడు అనే ఆ కస్టమర్ ఎలా ఉంటాడో తెలీదు. ఆయన దగ్గరుండాల్సిన వస్తువును నేను తస్కరించాను అనే భావనే నాకు నిద్రపట్టనివ్వట్లేదు. వెనక్కి తిరిగొచ్చి దొంగతనం చేసింది కేవలం స్మార్ట్‌ఫోన్ పై నాకున్న పగ, ద్వేషం వల్లనే. దొంగలించిన తర్వాత మాత్రం స్మార్ట్‌ఫోన్ మీదున్న నా పగ ఏమైందో నాకు అర్థం కాలేదు. దొంగతనం చేశానన్న భావన నన్ను కుంగదీయసాగింది.దేవుడిపై నమ్మకం లేకపోయినా ఈ రాత్రి గడిస్తే చాలురా దేవుడా అనుకున్నాను. అతికష్టం మీద నిద్రపట్టింది. నిద్రలో కల.. గంగిరెద్దులాయన నా ఫొటోస్టూడియోకొచ్చాడు. ‘బాబయ్యా, నా ఫొటో వచ్చినాది’ అన్నాడు.‘అవునా? ఎక్కడ? చూపించు..?’ అడిగాను. ‘ఇదిగో..’ అంటూ తన స్మార్ట్‌ఫోన్‌లో తను దిగిన సెల్ఫీని చూపిస్తూ ఆనందబాష్పాలతో నన్ను చూశాడు. ‘నేను, నా బసవడు’ అంటూ నా ముందే మరొక సెల్ఫీ దిగాడు. కెమెరా షట్టర్ సౌండ్ వచ్చింది. ‘రోజూ కనిపించే మేము ఎంత అందంగా వచ్చామో చూడయ్యా’ అన్నాడు నాతో.ఆ మాట ఎక్కడో గుచ్చుకుంది నాకు. సమాధానం బలంగా తెలుస్తున్నట్టు అనిపించినా ‘నీ పేరేంటి?’ అడిగాను.‘శివుడు’ నిండుగా నవ్వాడు. ‘ఇదే నా సిత్రం’ అంటూ ఆ సెల్ఫీని చూపించాడు. ‘వెళ్ళొస్తాను’ అంటూ నవ్వుతూ తన బసవడితో వెళ్తూ ఒకసారి వెనక్కి తిరిగి.. మా ఫొటోస్టూడియో బోర్డు చూసి ఆగిపోయాడు. నా దగ్గరికొచ్చి నాకు మాత్రమే వినబడేలా.. ‘There's more to life that meets the camera eye!’ అన్నాడు.మా గురువుగారు ఇచ్చిన ఆ కాప్షన్కి అర్థం ఇన్నాళ్లకి.. అది కలలో తెలిసింది. దిగ్గున లేచాను. మధ్యరాత్రని కూడా చూడకుండా నేతి గారెల షాప్ మీదుగా శివుడి ఇల్లున్న వీధికి చేరుకున్నాను. చీకటిగా ఉండటంతో శివుడి ఇల్లు అంత త్వరగా కనబడలేదు. నంబర్ 10 అన్న సంఖ్య గుర్తుండటంతో పదో నెంబర్ ఇల్లు కనబడే దాకా వెళ్లాను. అలా ఇంటి గేట్ దగ్గరికి వెళ్ళానో లేదో ఇంటి వరండా ముందరి జీరో బల్బ్ వెలిగింది. తలుపు తీస్తూ మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ ఒక వ్యక్తి గేట్ వైపుగా వస్తున్నాడు. నేను భయపడుతూన్నాను. నా ముఖం కనిపించకుండా గుడ్డ అడ్డుపెట్టుకుని ఉన్నాను. ఆ వ్యక్తి సరిగ్గా గేట్ దగ్గరికి చేరగానే స్ట్రీట్ లైట్ వెలిగింది. గేట్‌కి అటువైపునున్న ఆయన.. చేయి చాచాడు. నా చేతిలోని స్మార్ట్ ఫోన్‌ని ఆయనకు అందించాను.‘ఎప్పటి నుండో పాడైన మా వీధి దీపం ఇప్పుడే వెలిగింది. పోయిన వస్తువు తిరిగి చేరాల్సిన చోటికే చేరింది. చీకటి పడింది. ఇక వెళ్ళిపో బాబయ్యా..’ అన్నాడు. ఆ గంగిరెద్దులాయనే ఈ శివుడన్న విషయం నిర్ధారణయ్యి వెనుదిరుగుతున్న నాకు అప్పుడే జ్ఞానోదయం అయ్యింది. – ఈశ్వరచంద్రఇవి చదవండి: ఇది.. 'మట్టిదిబ్బ' అనుకుంటున్నారా!?
ఇది.. 'మట్టిదిబ్బ' అనుకుంటున్నారా!?
దూరం నుంచి చూస్తే భారీ మట్టిదిబ్బలా కనిపిస్తుంది గాని, ఇది పురాతన రాతి కట్టడం. ఇది సామూహిక సమాధి. కొత్తరాతి యుగం నాటి ఈ భారీ సమాధి ఐర్లండ్‌లోని డ్రోహడా పట్టణానికి చేరువలో బోయన్ నదీ తీరాన ఉంది. దీనిని క్రీస్తుపూర్వం 3200 ప్రాంతంలో నిర్మించి ఉంటారని అంచనా.ఈ పురాతన నిర్మాణాన్ని యునెస్కో చారిత్రక వారసత్వ కట్టడంగా గుర్తించింది. న్యూగ్రేంజ్ మాన్యుమెంట్ పేరుతో ప్రసిద్ధి పొందిన ఈ కట్టడాన్ని 1.1 ఎకరాల విస్తీర్ణంలో 39 అడుగుల ఎత్తున నిర్మించారు. దీని లోపలకు చేరుకోవడానికి ప్రవేశ ద్వారం, అక్కడి నుంచి అరవై అడుగుల నడవ దారి ఉంటాయి. లోపలి భాగంలో ఉన్న మూడు గదుల్లో పురాతన మానవ అస్థికలు కనిపిస్తాయి.ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని ఆ కాలంలోనే నిట్టనిలువుగా రాళ్లను నిలిపి, వాటిని కలుపుతూ వృత్తాకారంలో ఈ సమాధిని నిర్మించడం విశేషం. పురాతత్త్వ శాస్త్రవేత్తలు దీనిలోపల జరిపిన తవ్వకాల్లో దహనం చేసిన మానవ అస్థికలు, దహనం చేయని మానవ అస్థికలు కూడా దొరికాయి. వాటితో పాటు ఆనాటి మానవులు ఉపయోగించిన పలు వస్తువులు కూడా దొరికాయి.ఇవి చదవండి: పూర్వం 'ధ్రువసంధి' అయోధ్యకు.. రాజుగా..
న్యూస్ పాడ్‌కాస్ట్
ప్రధానమంత్రిగా నేడే నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం.. మంత్రివర్గం కూర్పుపై కొనసాగుతున్న కసరత్తుతి.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయి.. గవర్నర్ జోక్యం చేసుకోవాలి.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి.. ఇంకా ఇతర అప్డేట్స్
ప్రధానమంత్రిగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్ర మోదీ... నేడు ఎన్డీఏ ఎంపీల సమావేశం.. ఇంకా ఇతర అప్డేట్స్
ఎన్డీయే నేతగా నరేంద్ర మోదీ ఏకగ్రీవ ఎన్నిక.. శనివారం లేదా ఆదివారం ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం.. ఇంకా ఇతర అప్డేట్స్
లోక్‌సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించిన ఎన్డీయే.. బీజేపీకి కూటమికి 292 స్థానాలు, ఇండియా కూటమికి 234 స్థానాలు.. 240 సీట్లకే పరిమితమైన బీజేపీ, మెజారిటీ కంటే 32 స్థానాలు తక్కువ.. 99కి పెరిగిన కాంగ్రెస్ బలం.. ఇంకా ఇతర అప్డేట్స్
నేడే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు.. ఏపీ, ఒడిశా అసెంబ్లీ ఫలితాలు కూడా ఈరోజే వెల్లడి.. ఇంకా ఇతర అప్డేట్స్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి, రీప్లేస్మెంట్ మనమే.. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెల్లడి.. ఇంకా ఇతర అప్డేట్స్
కేంద్రంలో ఎన్డీఏ హ్యాట్రిక్, 350 నుంచి 400 స్థానాలు ఖాయం, తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటాపోటీ, ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వైఎస్సార్సీపీ ప్రభంజనం... ఎగ్జిట్ పోల్స్ అంచనా.. ఇంకా ఇతర అప్డేట్స్
సార్వత్రిక ఎన్నికల్లో నేడే ఆఖరి విడత పోలింగ్.. చండీగఢ్ సహా ఏడు రాష్ట్రాల్లోని 57 లోక్‌సభ స్థానాల్లో జరుగనున్న పోలింగ్.. ఇంకా ఇతర అప్డేట్స్
మళ్లీ విజయం మనదే, ప్రజలందరి దీవెనలతో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం... ‘ఎక్స్’లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్.. ఇంకా ఇతర అప్డేట్స్
క్రైమ్
కలిసి బతకలేమని కడతేరిపోయారు!
జీడిమెట్ల, జగద్గిరిగుట్ట: వారిద్దరూ ప్రేమించుకున్నారు.. జీవితాంతం కలిసి ఉండాలని బాసచేసి పెళ్లి చేసుకున్నారు.. వీరి కాపురం కొన్నాళ్లు సాఫీగానే సాగింది. ఇటీవల ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఏం జరిగిందో ఏమో భార్య హెచ్‌ఏఎల్‌లోని తల్లి గారింట్లో, భర్త చింతల్ హెచ్ఎంటీలో ఒకేరోజు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. జీడిమెట్ల, జగద్గిరిగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాజులరామారం హెచ్ఏఎల్ కాలనీకి చెందిన కృష్ణమూర్తి చిన్న కుమారుడు మంచూరి రెశ్వంత్ (26), గాజులరామారం హెచ్ఏఎల్ కాలనీకి చెందిన సాయిశ్రేయ (22)ను ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. అనంతరం గాజులరామారం ద్వారకా నగర్లో కాపురం పెట్టారు. రెశ్వంత్ బిగ్‌బాస్కెట్‌లో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. కొన్నాళ్లు దంపతులిద్దరూ బాగానే ఉన్నారు. ఇటీవల ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. శనివారం రెశ్వంత్ హెచ్ఎంటీ నిర్మానుష్య ప్రదేశంలో చెట్టుకు చున్నీతో ఉరి వేసుకుని మృతిచెందాడు. సాయిశ్రేయ హెచ్ఏఎల్ కాలనీలోని తల్లిగారింట్లో ఉరి వేసుకుని మృతిచెందింది. మృతుడి సోదరుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఆస్తి కోసమే బాలిక హత్య
కంభం: ఆస్తి కోసం తొమ్మిదేళ్లు పెంచుకున్న బాలికను పెంపుడు తల్లి అతి కిరాతకంగా గొంతు కోసి హత్య చేసింది. ఈ నెల 6న ప్రకాశం జిల్లా అర్థవీడులో చోటుచేసుకున్న ఈ ఘటనపై నమోదైన కేసును పోలీసులు ఛేదించారు. శనివారం మార్కాపురం డీఎస్పీ బాలసుందరరావు మీడియాకు కేసు వివరాలను వెల్లడించారు. రాచర్ల మండలం అనుమలవీడుకు చెందిన పుచ్చకాయల వెంకట రమణ, పుచ్చకాయల లక్ష్మీపద్మావతికి పిల్లలు లేకపోవడంతో అతని సోదరుడు వెంకట రంగారెడ్డి కుమార్తె పుచ్చకాయల శాన్విరెడ్డిని ఆరునెలల వయసు ఉన్నప్పుడే.. అనగా 9 ఏళ్ల నాడు దత్తత తీసుకున్నారు.ప్రస్తుతం ఆ బాలిక 3వ తరగతి చదువుతోంది. ఇటీవల శాన్విరెడ్డి కన్నతల్లిదండ్రులకు, పెంచిన తల్లిదండ్రులకు ఆస్తుల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. కన్నతల్లిదండ్రులు శాన్విరెడ్డిపై ఎక్కువ ప్రేమ చూపిస్తుండటాన్ని గమనించిన పెంపుడు తల్లి..ఎంతబాగా పెంచినా కన్నతల్లిదండ్రులం కాలేమని భావించింది. బాలికను చంపేస్తే తమ ఆస్తి ఎవరికీ ఇవ్వాల్సిన అవసరం ఉండదని, తామే అనుభవించుకోవచ్చని ఆలోచించింది. ఈ నెల 6న శాన్విరెడ్డి ఒంటరిగా బెడ్రూంలో ఫోన్ చూసుకుంటున్న సమయంలో పెంపుడు తల్లి అయిన లక్ష్మీపద్మావతి బాలిక వద్దకు వెళ్లి మొహంపై దిండు వేసి గట్టిగా నొక్కిపట్టి గొంతుకోసి హత్య చేసింది. ఆ సమయంలో ఆమె భర్త గేటు వద్ద నిలబడి ఎవరూ రాకుండా చూసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆ తర్వాత ఓ పథకం ప్రకారం వారిద్దరూ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు శాన్విరెడ్డిని హత్య చేశారని చుట్టుపక్కల వారిని, బంధువులను నమ్మించారు. బాలికను అర్థవీడులోని ఓ ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లగా, అప్పటికే మరణించినట్లు చెప్పడంతో తిరిగి ఇంటికి తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న పాప సొంత తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కన్న తండ్రి ఫిర్యాదు మేరకు అర్థవీడు ఎస్ఐ అనిత కేసు నమోదు చేశారు. మార్కాపురం డీఎస్పీ బాలసుందర్రావు ఆదేశాల మేరకు సీఐ జె.రామకోటయ్య ఆధ్వర్యంలో కంభం, బేస్తవారిపేట, అర్థవీడు ఎస్ఐలు 3 బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. అనుమానాస్పదంగా ఉన్న పెంపుడు తల్లిదండ్రులను పోలీసులు తమదైన శైలిలో విచారించగా, తామే నేరం చేసినట్లు వారు అంగీకరించారు.
ఎస్బీఐ ఏటీఎం సెంటర్లో చోరీ
కూడేరు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఏటీఎం సెంటర్లో శుక్రవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. ఈ ఘటన అనంతపురం జిల్లా, కూడేరు మండలంలో చోటుచేసుకుంది. ఏటీఎంను పగులగొట్టిన గుర్తు తెలియని వ్యక్తులు, అందులోని రూ.18,41,300 నగదును ఎత్తుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... కూడేరులో దళితవాడకు ఎదురుగా అనంతపురం–బళ్లారి ప్రధాన రహదారి పక్కన అనంతపురం సాయినగర్‌లోని స్టేట్ బ్యాంకు ప్రధాన శాఖ ఏటీఎం సెంటర్ ఏర్పాటు చేశారు. శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కట్టర్‌తో ఏటీఎంను కట్ చేశారు. మిషన్‌లో ఉంచిన నగదు చోరీ చేశారు. అదే సమయంలో మిషన్‌లో షార్ట్ సర్క్యూట్ సంభవించి పైభాగం కాలిపోయింది. శబ్దం కూడా రావడంతో స్థానికుడొకరు బయటకు వచ్చి చూడగా.. ఏటీఎం సెంటర్ నుంచి కొందరు కార్లో వెళ్లిపోవడం, సెంటర్లో నుంచి పొగ రావడం గమనించాడు. కొంత సమయం తర్వాత విషయాన్ని పోలీసులకు తెలియజేశాడు. సీఐ శివరాముడు ఏటీఎం సెంటరును పరిశీలించారు. చోరీ జరిగిందని నిర్ధారించుకుని సమాచారాన్ని బ్యాంకు అధికారులకు అందించారు. సంబంధిత అధికారులు వచ్చి పరిశీలించారు. నగదు నిల్వ, విత్‌డ్రాలకు సంబంధించి ప్రధాన కార్యాలయం నుంచి డేటా తీసుకున్నారు. రూ.18,41,300 చోరీకి గురైనట్టు పోలీసులకు తెలిపారు. వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మిర్యాలగూడలో గ్యాంగ్‌వార్
మిర్యాలగూడ అర్బన్: సినిమాల ప్రభావంతో నేటి యువత విలనిజమే హీరోయిజంగా ఫీలవుతున్నారు. దీంతో బయట కూడా సినిమాల్లో లాగా అనుకరిస్తూ పెడదోవ పడుతున్నారు. చిన్నచిన్న గ్యాంగ్‌లు ఏర్పాటు చేసుకుని సెటిల్మెంట్లు చేసే స్థాయికి చేరుకుంటున్నారు. బర్త్‌డేలకు కూడా డీజేలు పెట్టి బాణాసంచా కాలుస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారు. యువత డ్రగ్స్‌కు అలవాటు పడుతూ తమ నిండు జీవితాలను పాడు చేసుకుంటున్నారు. మిర్యాలగూడ పట్టణంలో నిత్యం ఏదో ఒక వీధిలో గ్యాంగ్వార్లు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో కొందరు తమ ప్రాణాలను సైతం కోల్పోతున్నారు. చెడు వ్యసనాలకు బానిసలుగా మారి దారి తప్పుతున్న యువతను గాడిలో పెట్టేదెవరు..? అని వారి చేష్టలను చూసిన వారు ప్రశ్నిస్తున్నారు.మత్తుకు బానిసలుగా మారుతున్నారిలా..గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండటంతో పిల్లల మానసిక పరిస్థితిని ఎప్పటికప్పుడు ఇంట్లో ఎవరో ఒకరు గుర్తించే అవకాశం ఉండేది. దీంతో ఆ పిల్లాడికి పలు ఉదాహారణలతో మంచి విషయాలపై అవగాహన పెంచేవారు. ఈవిధంగా కుటుంబం నుంచే క్రమశిక్షణ నేర్చుకుని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించేవారు. కానీ మారిన పరిస్థితుల కారణంగా చిన్న కుటుంబాలు పెరగడం, భార్యాభర్తలు ఇద్దరూ కుటుంబ పోషణ కోసం ఉద్యోగాలు చేస్తుండడంతో పిల్లలను గమనించేవారు లేకుండా పోతున్నారు. దీంతో పిల్లలు ఏం చేస్తున్నారు..? అతడి మానసిక స్థితి ఏవిధంగా ఉంది..? అని పరిశీలించేవారు లేకపోవడంతో ముందుగా స్నేహితులతో సరదాగా సిగరెట్, గుట్కా వంటి వాటికి అలవాటు పడుతూ క్రమంగా గంజాయి తీసుకునే స్థాయికి చేరుకుంటున్నారు. మిర్యాలగూడలో గంజాయికి బానిసైన యువకులు సుమారు 2 వేలకు పైగానే ఉంటారని సమాచారం. తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు తమ పిల్లల మానసికస్థితిని అర్ధం చేసుకుని వారికి సరైన దిశానిర్ధేశం చేయడం వలన యువత మత్తుకు బానిసలు కాకుండా.. పెడదోవ పట్టకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.మిర్యాలగూడలో ఇటీవల జరిగిన గ్యాంగ్వార్లు..👉 మిర్యాలగూడ పట్టణంలోని గాంధీ బొమ్మ సమీపంలో ఉన్న వైన్స్ వద్ద ఇటీవల రాత్రి సమయంలో కొందరు యువకులు కలిసి ఓ వ్యక్తిని తీవ్రంగా కొట్టి గాయపర్చారు. దీంతో ఆ యువకుడికి తలకు తీవ్ర గాయమై అపస్మారకస్థితిలోకి వెళ్లడంతో ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నట్లు సమాచారం.👉రెడ్డి కాలనీకి వెళ్లేదారిలో రాత్రి సమయంలో తల్లీకుమార్తె నడుచుకుంటూ వెళ్తుండగా.. మత్తులో ఉన్న యువకులు వెకిలి చేష్టలు చేయడంతో వారు భయాందోళనకు గురై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ యువకులకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించినట్లు తెలిసింది.👉 పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదురుగా ఓ వీధిలో గత నెల ఫుట్‌బాల్ ఆటలో తలెత్తిన వివాదంలో రెండు గ్యాంగ్‌ల మధ్య తీవ్రమైన గొడవ జరిగింది. దీంతో ఇరువర్గాలకు చెందిన పది మందిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం.👉 పట్టణంలోని తాళ్లగడ్డ, ప్రకాశ్‌నగర్, గాంధీనగర్, బాపూజీనగర్‌లో ప్రతి రోజు ఏదో గొడవ జరగుతుండగా.. గొడవలు పడిన వారు మత్తులో ఉన్నప్పుడే ఈ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆయా కాలనీల ప్రజలు పేర్కొంటున్నారు.పట్టించుకోని పోలీసులు ..రోజురోజుకు పెరుగుతున్న గ్యాంగ్వార్లను అరికట్టాల్సిన పోలీసులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. గొడవలకు దిగిన వారిని పోలీస్ స్టేషన్‌కు తీసుకురాగానే పలువురు రాజకీయ నాయకులు జోక్యం చేసుకుని విడిపిస్తుండటంతో సదరు యువకులు మరింత పెట్రేగిపోతున్నారని పట్టణ ప్రజలు పేర్కొంటున్నారు. దీంతో ముందుకుపోతే నుయ్యి.. వెనుకకు పోతే గొయ్యి అన్న చందంగా మారిందని, పోలీసులు కూడా మాకెందుకులే అని పట్టించుకోకుండా ఉంటున్నారని పోలీస్ శాఖ సిబ్బందే చెబుతుండటం విశేషం.యువకుడిపై విచక్షణారహితంగా దాడిమిర్యాలగూడ పట్టణంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయం సమీపంలో కొందరు యువకులు వీరంగం సృష్టించారు. వివరాలు.. రిజిస్ట్రేషన్ కార్యాలయం సమీపంలో శుక్రవారం పుట్టినరోజు వేడుకల్లో ఘర్షణ చెలరేగి ఓ యువకుడిపై మరికొంతమంది యువకులు విచక్షణారహితంగా దాడి చేయడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దాడికి గురైన యువకుడిని కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని దాడి చేస్తున్న వారిని చెదరగొట్టడంతో వివాదం సద్దుమణిగింది. ఈ గొడవను కొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. గాయాలపాలైన యువకుడు శనివారం జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దుయువత క్రమశిక్షణతో తమ చదువులు, కెరియర్‌పై దృష్టి సారిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. తల్లిదండ్రులు తమ పిల్లలను ఓ కంట కనిపెడుతూ ఉండాలి. వారి మానసికస్థితి, వారి ప్రవర్తనను గమనిస్తూ పెడదోవ పట్టినట్లు తెలిస్తే వెంటనే వారికి ఓపికగా కౌన్సిలింగ్ ఇవ్వాలి. అప్పుడే పిల్లలకు మంచి జీవితం ఇచ్చిన వారమవుతాం. యువత చెడుమార్గం పట్టి తమ విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దు.– రాజశేఖరరాజు, మిర్యాలగూడ డీఎస్పీ