T20 World Cup 2024: సౌతాఫ్రికా-నెదర్లాండ్స్‌ మ్యాచ్‌.. తుది జట్లు ఇవే..! | T20 World Cup 2024: South Africa Won The Toss, Opt To Bowl Against Netherlands | Sakshi
Sakshi News home page

T20 World Cup 2024: సౌతాఫ్రికా-నెదర్లాండ్స్‌ మ్యాచ్‌.. తుది జట్లు ఇవే..!

Jun 8 2024 7:46 PM | Updated on Jun 8 2024 7:51 PM

T20 World Cup 2024: South Africa Won The Toss And Opt To Bowl Against Netherlands

టీ20 వరల్డ్‌కప్‌ 2024లో భాగంగా ఇవాళ (జూన్‌ 8) రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌-సౌతాఫ్రికా జట్లు తలపడనున్నాయి. న్యూయార్క్‌ వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. గత మ్యాచ్‌లో ఆడిన జట్లతోనే ఇరు జట్లు ఈ మ్యాచ్‌లోనూ బరిలోకి దిగుతున్నాయి. 

గ్రూప్‌-డిలో భాగమైన సౌతాఫ్రికా, నెదర్లాండ్స్‌ జట్లు ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన చెరో మ్యాచ్‌లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. సౌతాఫ్రికా.. శ్రీలంకపై విజయం సాధించగా..నెదర్లాండ్స్‌.. నేపాల్‌ను మట్టికరిపించింది.

తుది జట్లు..

నెదర్లాండ్స్: మైకేల్ లెవిట్, మాక్స్ ఓడౌడ్, విక్రమ్‌జిత్ సింగ్, సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, స్కాట్ ఎడ్వర్డ్స్(కెప్టెన్‌/వికెట్‌కీపర్‌), బాస్ డి లీడే, తేజ నిడమనూరు, లోగాన్ వాన్ బీక్, టిమ్ ప్రింగిల్, పాల్ వాన్ మీకెరెన్, వివియన్ కింగ్మా

దక్షిణాఫ్రికా: క్వింటన్ డికాక్(వికెట్‌కీపర్‌), రీజా హెండ్రిక్స్, ఎయిడెన్ మార్క్రమ్(కెప్టెన్‌), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, అన్రిచ్ నోర్ట్జే, ఒట్నీల్ బార్ట్‌మన్

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement